newssting
BITING NEWS :
*హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో కారు బీభత్సం. అదుపుతప్పి హోటల్ లోకి దూసుకెళ్లిన కారు. తప్పిన ప్రమాదం, కారు వదలి పరారైన యువకులు. మద్యం సేవించి డ్రైవింగ్ చేసినట్లుగా అనుమానం * అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్న ట్రంప్. ఎయిర్ పోర్ట్ నుంచి ర్యాలీగా మొతేరా స్టేడియానికి ట్రంప్. మధ్యాహ్నం 12:30 గంటలకు నమస్తే ట్రంప్ కార్యక్రమంలో ట్రంప్ ప్రసంగం*విశాఖ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్‌పై స్పందించిన నేవీ..మిలీనియం టవర్స్‌లో సచివాలయం పెట్టుకోవడానికి అనుమతి నిరాకరించినట్లు వచ్చిన వార్తలు అవాస్తవం*జనవరి 10న అమరావతి రైతుల మీద జరిగిన లాఠీఛార్జ్‌పై విచారణ ప్రారంభం..హైకోర్టు ఆదేశాల మేరకు తుళ్లూరులో విచారణ ప్రారంభించిన పోలీసులు..గుంటూరు అడిషనల్‌ ఎస్పీ స్వామిశేఖర్‌ నేతృత్వంలో కొనసాగుతున్న ఎంక్వైరీ *సికింద్రాబాద్ : బోయిన్ పల్లిలోనీ ఓ కెమికల్ గో డౌన్ లో భారీ అగ్నిప్రమాదం*చైనాలో 2400 పైగా చేరిన కోవిద్ 19 వైరస్ మృతులు. 78 వేలకు చేరిన వైరస్ బాధితుల సంఖ్య. ఇటలీలో కరోనా వైరస్ కారణంగా ఇద్దరు మృతి

సెలవుల్లేవు.. స్కూళ్లకు వచ్చేయండి..ప్రైవేట్ స్కూళ్ల దందా

15-10-201915-10-2019 12:09:16 IST
2019-10-15T06:39:16.761Z15-10-2019 2019-10-15T06:36:04.704Z - - 24-02-2020

సెలవుల్లేవు.. స్కూళ్లకు వచ్చేయండి..ప్రైవేట్ స్కూళ్ల దందా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించిన పలు ప్రయివేట్ విద్యా సంస్థలు హైదరాబాద్‌లో సోమవారం నుంచి క్లాసులకు రావాలని పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్థులను ఆదేశించాయి. దీన్ని గమనించిన ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలకు నోటీసులిచ్చాయి.

జిల్లా విద్యాధికారులు హైదరాబాద్ లోని పలు విద్యాసంస్థలను సోమవారం సందర్శించి ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి క్లాసులు నిర్వహిస్తున్న వైనం పసిగట్టారు. అలాంటి విద్యాసంస్థలను హెచ్చరించి నోటీసులు ఇవ్వడమే కాకుండా పిల్లల తల్లిదండ్రులను హుటాహుటిన రప్పించి పిల్లలను వారి వెంట ఇళ్లకు పంపించారు.

తొలిరోజు కాబట్టి కేవలం హెచ్చరికలతోటే వదిలేశామని, మంగళవారం నుంచి అలాంటి విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాధికారులు హెచ్చరించారు. తెలంగాణ ఆర్టీసీ సిబ్బంది సమ్మె  కొనసాగుతుండటంతో ప్రభుత్వం విధిలేక దసరా సెలవులను అక్టోబర్ 19 వరకు పొడిగించింది.

ప్రభుత్వ ప్రకటించిన నూతన సెలవుల షెడ్యూల్‌కు కట్టుబడాలని,  క్లాసులను అక్టోబర్ 21 నుంచి అంటే వచ్చే సోమవారం నుంచి మొదలెట్టాలని రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ఎయిడెడ్, ప్రైవేట్ కాలేజీలకు ఆదేశాలు జారీ చేసింది. కొంతమంది విద్యార్థులు అక్టోబర్ 21, 22 తేదీల్లో రాయవలసి ఉన్న పరీక్షలను కూడా అక్టోబర్ 29, 30కి వాయిదా వేస్తున్నట్లు స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలియజేశారు.

ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి కాలేజీలను నడుపుతున్న శ్రీచైతన్య, నారాయణ, గాయత్రి గ్రూప్ సంస్థలకు విద్యా శాఖ నోటీసులు పంపి రెండువారాల్లోపు వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. 80 శాతం ప్రైవేట్ స్కూళ్లలో టీచర్లు మాత్రం తమ యధావిధి కార్యక్రమాలలో ఉన్నారని, అయితే హైదరాబాద్ లోని అన్ని కార్పొరేట్ స్కూళ్లు పదవ తరగతి విద్యార్థులకు క్లాసులు నిర్వహిస్తున్నాయని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫెడరేషన్‌కి చెందిన షేక్ షబ్బీర్ ఆలీ చెప్పారు.

Image result for Sri Chaitanya narayana Schools, colleges in Hyd

రుణమాఫీలు శాశ్వత పరిష్కారం కాదు. గిట్టుబాటు ధరలే సమస్య: ఉపరాష్ట్రపతి

రుణమాఫీలు శాశ్వత పరిష్కారం కాదు. గిట్టుబాటు ధరలే సమస్య: ఉపరాష్ట్రపతి

   10 hours ago


తెలంగాణలో కలకలం రేపిన 'దొంగలతో దోస్తీ' కథనం!

తెలంగాణలో కలకలం రేపిన 'దొంగలతో దోస్తీ' కథనం!

   15 hours ago


‘‘ఈజీవో నాపై వేధింపులకు పరాకాష్ట’’బాబు ట్వీట్

‘‘ఈజీవో నాపై వేధింపులకు పరాకాష్ట’’బాబు ట్వీట్

   15 hours ago


నూజివీడు ఘటనపై మంత్రి సురేష్ సీరియస్

నూజివీడు ఘటనపై మంత్రి సురేష్ సీరియస్

   15 hours ago


మిలీనియం టవర్స్ చుట్టూ అల్లుకున్న రాజకీయం!

మిలీనియం టవర్స్ చుట్టూ అల్లుకున్న రాజకీయం!

   16 hours ago


భూములు లాక్కోవడంలేదు.. తప్పుచేయకుంటే ఎందుకంత భయం?

భూములు లాక్కోవడంలేదు.. తప్పుచేయకుంటే ఎందుకంత భయం?

   16 hours ago


విద్యార్ధుల భవిష్యత్తే మాకు ముఖ్యం... నూజివీడు ట్రిపుల్ ఐటీ వీసీ హేమచంద్రారెడ్డి

విద్యార్ధుల భవిష్యత్తే మాకు ముఖ్యం... నూజివీడు ట్రిపుల్ ఐటీ వీసీ హేమచంద్రారెడ్డి

   17 hours ago


సిట్‌కు స‌హ‌క‌రించే సీన్ ఉందా..?

సిట్‌కు స‌హ‌క‌రించే సీన్ ఉందా..?

   17 hours ago


12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   22-02-2020


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   22-02-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle