సెప్టెంబర్ 17 చుట్టూ రాజకీయం- కమలం vs కారు
11-09-202011-09-2020 23:20:02 IST
Updated On 11-09-2020 23:23:13 ISTUpdated On 11-09-20202020-09-11T17:50:02.473Z11-09-2020 2020-09-11T17:49:54.808Z - 2020-09-11T17:53:13.916Z - 11-09-2020

తెలంగాణలో సెప్టెంబర్ 17వ తేదీని విమోచన దినోత్సవంగా ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్న బిజెపి నాయకులు, కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా పలువురు నాయకులను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని కమాన్ పూర్, రామగిరి, మంథని మండలాలలో ఉన్న బిజెపి నాయకులను కార్యకర్తలను అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. తెలంగాణ రాక ముందు సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణలో విమోచన దినోత్సవంగా జరుపుకుంటామని చెప్పిన కేసిఆర్. తెలంగాణ ఆవిర్భావం తరువాత విమోచన దినోత్సవం జరపకుండా, తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని బీజేపీ విమర్శిస్తున్నది. 2023 ఎన్నికల్లో విజయం సాధించి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే సెప్టెంబర్ 17వ తేదీని విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహిస్తామని హామీ ఇస్తున్నది. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17న అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టింద. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి బయలు దేరిన బిజెపి మాజీ ఎమ్మెల్యే లక్ష్మణ్, బీజేపీ కార్యదర్శి మాధవ్ లను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 17 ను తెలంగాణ విమోచన దినోత్సవంగ అధికారికంగా ప్రకటించాలని కోరుతూ ఈరోజు అసెంబ్లీ ముట్టడికి రాష్ట్ర బీజేపీ పిలుపు మేరకు భయలుదేరుతున్న ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులను కూడా పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట, సూర్యపేట జిల్లా , నల్గొండ జిల్లాలో ఈ తెల్లవారుజాము నుండే బీజేపీ నాయకుల అరెస్టుల పర్వం ప్రారంభమైంది. అరెస్టులను ఖండిస్తూ బీజేపీ తీవ్ర స్థాయిలో టీఆర్ఎస్ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్నది. తెరాస ప్రభుత్వం ఏం ఐ ఎం అడుగులకు మడుగులొత్తుతూ తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించకపోగా బిజెపి కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేయడం దారుణమని బీజేపీ నేతలు విమర్శించారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు హైదరాబాద్ లో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. చలో అసెంబ్లీ పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడికి బయలు దేరిన బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేసి ఘోషా మహల్ పీఎస్ కు తరలించారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు పోలీసు వాహనాన్ని చుట్టుముట్టి కదలకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి ఘర్షణ వాతావరణం ఏర్పడింది. చివరకు నిరసన కారులను చెదరగొట్టి బండి సంజయ్ ను ఘోషామహల్ పీఎస్ కు తరలించారు. మొత్తం మీద తెలంగాణ విమోచన దినోత్సవం కేంద్రంగా బీజేపీ- టీఆర్ఎస్ మధ్య రాజకీయ యుద్ధం జరుగుతోందని చెప్పవచ్చు. దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికలలో తెలంగాణ విమోచన దినోత్సవం వ్యవహారం ఒక కీలక అంశంగా మార్చాలని బీజేపీ శతథా ప్రయత్నిస్తున్నది. అదే విధంగా బీజేపీ వ్యూహాలు ఫలించకుండాటీఆర్ఎస్ కూడా వ్యూహాలు పన్నుతున్నది. మొత్తం మీద తెలంగాణ విమోచన దినోత్సవం రాజకీయయుద్ధానికి వేదికగా మారుతోంది.

ఏపీ, తెలంగాణలో ఉత్కంఠ.. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్
17 minutes ago

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
an hour ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
2 hours ago

ఎమ్మెల్యేల డ్రగ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు
3 hours ago

కేటీఆర్ కి అంత సీన్ లేదులే
5 hours ago

పెద్ద నాయకుడికి ఇబ్బందులు అంటూ స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు..!
5 hours ago

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ
20 hours ago

వివేకానంద రెడ్డి హత్యపై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!
20 hours ago

ఆ వీడియో వార్తలపై అచ్చెన్న ఫైర్..!
21 hours ago

గత సావాసంతో టీఆర్ఎస్ కు కమ్యూనిస్టుల సపోర్ట్
19 hours ago
ఇంకా