newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సెప్టెంబర్‌ ఒకటినుంచి అకడమిక్ ఇయర్ ... ఆన్ లైన్ పాఠాలు

25-08-202025-08-2020 15:25:32 IST
2020-08-25T09:55:32.968Z25-08-2020 2020-08-25T09:55:31.082Z - - 22-04-2021

సెప్టెంబర్‌ ఒకటినుంచి అకడమిక్ ఇయర్ ... ఆన్ లైన్ పాఠాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒక్క కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. జూన్ లో ప్రారంభం కావాల్సిన విద్యాసంవత్సరం ఆలస్యం అయింది. కరోనా వల్ల ఈ ఏడాది విద్యాసంవత్సరం అసలు ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలీని సందిగ్ధ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కరోనా కారణంగా ఆలస్యమైన విద్యా సంవత్సరాన్నిసెప్టెంబర్‌ ఒకటి నుంచి నూతన ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ మేరకు చర్యలు చేపట్టాలని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు ఆదేశాలు జారీచేశారు. స్కూళ్లలో ప్రవేశాలతోపాటు ఈ-పాఠాలు, దూర విద్యావిధానంలో బోధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. టీవీ, టీశాట్‌ ద్వారా పాఠశాల విద్యార్థులకు సెప్టెంబర్‌ 1 నుంచి డిజిటల్‌ పాఠాలు అందించాలని సూచించారు. ఉపాధ్యాయులంతా ఈ నెల 27 నుంచి స్కూళ్లకు హాజరుకావాలని ఆదేశించారు.

విద్యార్థులకు కావాల్సిన డిజిటల్‌ కంటెంట్‌ తయారీకి ప్రణాళికలు రూపొందించాలని చిత్రా రామచంద్రన్ ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాల ప్రకారం రెగ్యులర్‌ తరగతుల ప్రారంభంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అప్పటివరకు విద్యార్థులు స్కూళ్లకు వెళ్లాల్సింది వుండదన్నారు. సెప్టెంబర్‌ 1 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలా ఎస్సీఈఆర్టీ రూపొందించిన ప్రత్యామ్నాయ విద్యాక్యాలండర్‌ను అమలుచేయాలని, ఈ మేరకు మార్గదర్శకాలు విడుదలచేయాలని ఆమె సూచించారు.

సెప్టెంబర్‌ ఒకటి నుంచి ప్రారంభమయ్యే డిజిటల్‌ పాఠాలను నేర్చుకోవడంతోపాటు వాటిని ప్రాక్టీస్‌కు అనుకూలంగా రూపొందించించిన వర్క్‌షీట్లను ఎన్‌సీఈఆర్‌టీ విడుదలచేసింది. తెలంగాణ ఎన్‌సీఈఆర్‌టీ అధికారిక వెబ్‌‌సైట్‌ https://scert.telangana.gov.in/ద్వారా 2 నుంచి10 తరగతుల ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులు, ఉపాధ్యాయులందరూ ఈ వర్క్‌బుక్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్‌ భాషల్లో అన్ని సబ్జెక్టులు ప్రాక్టీస్‌ చేసుకొనే విధంగా వర్క్‌షీట్‌ను రూపొందించారు. విద్యార్ధులు వీటిని ప్రాక్టీస్ చేసుకోవడం ద్వారా పాఠశాలలకు వెళ్ళడం లేదని వెలితిని కొంతవరకైనా తగ్గించుకోవచ్చు. 

కరోనా వల్ల ఆలస్యం అయిన వివిధ ప్రవేశ పరీక్షలు కూడా షెడ్యూల్ ప్రకారం జరుగుతాయి. సెప్టెంబర్ 9 నుంచి 14వ తేదీ వరకు ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్ష జరుగుతుందని.. అలాగే ఈ నెల 31న ఈసెట్, సెప్టెంబర్ 21 నుంచి 24 వరకు పీజీ ఈసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్ష సెప్టెంబర్ 28,29 తేదీల్లో జరగనుంది. అటు సెప్టెంబర్ 30, అక్టోబర్ 1న టీఎస్ ఐసెట్, అక్టోబర్ 1 నుంచి 3వ తేదీ వరకు ఎడ్‌సెట్, అక్టోబర్ 4న లాసెట్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రవేశ పరీక్షల సందర్బంగా కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా ఆచరించాలని నిర్దేశించారు. 

 

 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   8 hours ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   11 hours ago


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   14 hours ago


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   14 hours ago


ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

   15 hours ago


ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

   13 hours ago


ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

   21-04-2021


తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

   21-04-2021


కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

   21-04-2021


తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

   21-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle