newssting
BITING NEWS :
*రాష్ట్రాలను కేంద్రం చిన్న చూపు చూస్తోందన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యల్లో వాస్తవం లేదు-కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ *ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ. 5 గంటల పాటు కొనసాగిన కేబినెట్ మీటింగ్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చర్చించిన ముఖ్యమంత్రి కేసీఆర్. పలు కీలక అంశాలపై చర్చించిన కేబినెట్ *కొత్తకోట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. డివైడర్ ఢీ కొట్టి తుఫాన్ వాహనం బోల్తా. ఇద్దరు మృతి. 14 మందికి తీవ్రగాయాలు, హాస్పిటల్ కు తరలింపు * ఇవాళ కెసిఆర్ బర్త్ డే. కెసిఆర్ పుట్టినరోజును మొక్కల పండుగగా జరపాలని తెరాస పిలుపు. రేపు ఉదయం నుంచి మొక్కలు నాటడం... రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపు *జనసేన కార్యకర్తలతో పవన్ సమావేశం. పనిచేసే కార్యకర్తలకే జనసేన పార్టీలో ప్రాధాన్యత. కార్యకర్తల సలహాలు, సూచనలు తీసుకున్నా-పవన్ *రాజధాని మార్పు, పీఏఏల రద్దు తొందరపాటు నిర్ణయాలు, పోలవరం రివర్స్ టెండరింగ్ వల్ల కోర్టులకు వెళ్లే పరిస్థితి, శాసనమండలి రద్దు నిర్ణయం సరైంది కాదు-దగ్గుబాటి పురంధేశ్వరి*ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం... మూడోసారి సీఎంగా ప్రమాణం

సెగ మామూలుగా త‌గ‌ల‌దా..?

11-11-201911-11-2019 08:30:15 IST
2019-11-11T03:00:15.879Z11-11-2019 2019-11-11T02:58:43.658Z - - 17-02-2020

సెగ మామూలుగా త‌గ‌ల‌దా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ‌లో ఆర్టీసీ కార్మికుల స‌మ్మె ఉధృతంగా కొన‌సాగుతోంది. సుమారు 40 రోజులు కావొస్తున్న ఆర్టీసీ కార్మికులంతా ఒకే మాట‌పై నిలిచి స‌మ్మె చేస్తున్నారు. త‌మ డిమాండ్ల సాధ‌న కోసం పోరాడుతున్నారు. ఉద్య‌మంలో చురుగ్గా పాల్గొంటున్నారు. లాఠీఛార్జిలు భ‌రిస్తున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ప‌డుతున్నారు. అయితే స‌మ్మెను మాత్రం విర‌మించ‌డం లేదు.

ఆర్టీసీ కార్మికుల స‌మ్మె వ‌ల్ల ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నా ఎక్క‌డా కార్మికుల ప‌ట్ల వ్య‌తిరేక‌త రావ‌డం లేదు. ఎక్కువ శాతం ప్ర‌జ‌లు కూడా ఆర్టీసీ కార్మికుల‌కు మ‌ద్ద‌తునిస్తున్నారు. టీఆర్ఎస్‌, మ‌జ్లీస్ మిన‌హా అన్ని పార్టీలూ ఆర్టీసీ కార్మికుల‌కు అండగా ఉంటున్నాయి. ఆర్టీసీ కార్మికుల స‌మ్మె సెగ టీఆర్ఎస్‌కు గ‌ట్టిగానే త‌గిలే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి.

ఇందుకు అమెరికాలో జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌లే ఉదాహ‌ర‌ణ‌. రెండు రోజుల పాటు అక్క‌డ తెలంగాణ డెవెల‌ప్‌మెంట్ ఫోరం(టీడీఎఫ్‌) వార్షికోత్స‌వ స‌మావేశాలు జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మానికి టీఆర్ఎస్ పార్టీ నుంచి సీనియ‌ర్ నేత బోయిన‌ప‌ల్లి వినోద్ కుమార్‌, ఎమ్మెల్యే ర‌స‌మ‌యి బాల‌కిష‌న్ హాజ‌ర‌య్యారు. కాంగ్రెస్ నుంచి ఎంపీలు కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి, రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

అయితే, ఎన్ఆర్ఐల నుంచి టీఆర్ఎస్ నేత‌ల‌కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. స‌భ‌కు వ‌చ్చిన ఎన్ఆర్ఐలు టీఆర్ఎస్ నేత‌ల ప్ర‌సంగాల‌ను అడ్డుకున్నారు. సేవ్ ఆర్టీసీ, కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.

టీఆర్ఎస్ నేత‌లు ఈ స్థాయిలో నిర‌స‌న‌ను ఊహించ‌లేదు. దీంతో ఆర్టీసీ ఎటూపోదు అంటూ వినోద్ కుమార్ స‌మాధానం ఇచ్చుకోవాల్సి వ‌చ్చింది. నిర‌స‌న తెలిపిన వారిలో ఓవ‌ర్సీస్ కాంగ్రెస్‌కు చెందిన వారు ఉన్నా సాధార‌ణ ఎన్ఆర్ఐలు కూడా త‌మ నిర‌స‌న తెలిపారు.

అంతేకాదు, ఉద్య‌మాలను ఒక‌రు నిర్మించ‌లేరు, ఒక‌రు ఆప‌లేరు అంటూ ఆయ‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. స‌భ‌కు వ‌చ్చిన వారంతా మౌనం పాటించి మ‌ర‌ణించిన ఆర్టీసీ కార్మికుల‌కు నివాళి అర్పించారు.

ఇక ఆర్టీసీ భ‌విష్య‌త్ కార్య‌చ‌ర‌ణ కూడా టీఆర్ఎస్‌ను మ‌రింత ఇరుకున పెట్టేలా ఉంది. ఇవాళ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్ల ముట్ట‌డికి ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది.

12వ తేదీ నుంచి ఆర్టీసీ జేఏసీ నేత‌లు ఆమ‌ర‌ణ దీక్ష‌ల‌కు దిగ‌బోతున్నారు. ఆర్టీసీ కార్మికుల పోరాటాన్ని ప్ర‌భుత్వం అణిచివేయ‌డం పెద్ద విష‌యం కాదు కానీ ఈ అణిచివేత క్ర‌మంలో ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త బాగా వ‌చ్చే అవ‌కాశం ఉంది.

మొన్న‌టి ఛ‌లో ట్యాంక్‌బండ్ కార్య‌క్ర‌మాన్ని ఎంత‌టి పోలీస్ ఆంక్ష‌లు ఉన్నా, బ్యారికెడ్ల‌ను, ముళ్ల‌కంచెల‌ను దాటుకొని కార్మికులు ట్యాంక్‌బండ్ మీద‌కు చేరుకున్నారు.

ఈ క్ర‌మంలో వంద‌లాది మంది ఆర్టీసీ కార్మికులు అరెస్ట‌య్యారు. అనేక మంది గాయాల‌పాల‌య్యారు. మ‌హిళా కార్మికులకు సైతం ర‌క్తం కారేలా దెబ్బ‌లు తాకాయి. ఈ చిత్రాలు సాధార‌ణ ప్ర‌జ‌ల‌ను కూడా కలిచివేసేలా ఉన్నాయి.

దీంతో కేవ‌లం 48 వేల కార్మికుల కుటుంబాలే కాకుండా ప‌రిస్థితి ఇలానే ఉంటే సాధార‌ణ ప్ర‌జ‌ల్లోనూ ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది. 

 

 

చంద్రబాబుని కలిసిన మాజీ ఎమ్మెల్యే, నటి జయసుధ

చంద్రబాబుని కలిసిన మాజీ ఎమ్మెల్యే, నటి జయసుధ

   an hour ago


మాయగాళ్ళకు కేంద్రంగా ఏపీ..!

మాయగాళ్ళకు కేంద్రంగా ఏపీ..!

   an hour ago


మోదీకి వ్యతిరేకంగా మాట్లాడితే జైలుకు పంపుతారా.. సిద్ధమే: ఒవైసీ

మోదీకి వ్యతిరేకంగా మాట్లాడితే జైలుకు పంపుతారా.. సిద్ధమే: ఒవైసీ

   3 hours ago


కేజ్రీవాల్ మాటలో మార్పు.. పోరాటం వదిలి సర్దుకుపోయే ధోరణి!

కేజ్రీవాల్ మాటలో మార్పు.. పోరాటం వదిలి సర్దుకుపోయే ధోరణి!

   3 hours ago


అయ్య బాబోయ్.. గాంధీతో కేసీఆర్‌కు పోలికా?

అయ్య బాబోయ్.. గాంధీతో కేసీఆర్‌కు పోలికా?

   5 hours ago


రాజధాని మాటేమో కానీ విశాఖలో రియల్ బూమ్‌..

రాజధాని మాటేమో కానీ విశాఖలో రియల్ బూమ్‌..

   5 hours ago


కేంద్రంతో సయోధ్యకు కేజ్రీవాల్ ప్రయత్నాలు

కేంద్రంతో సయోధ్యకు కేజ్రీవాల్ ప్రయత్నాలు

   7 hours ago


కాశ్మీర్‌పై జోక్యం వద్దు.. ఐక్యరాజ్యసమితికి భారత్ ఘాటు జవాబు

కాశ్మీర్‌పై జోక్యం వద్దు.. ఐక్యరాజ్యసమితికి భారత్ ఘాటు జవాబు

   7 hours ago


అక్షరాస్యత, పరిశుభ్రతలో ఆంధ్రా అమ్మాయిలదే అగ్రపీఠం

అక్షరాస్యత, పరిశుభ్రతలో ఆంధ్రా అమ్మాయిలదే అగ్రపీఠం

   8 hours ago


‘‘తెలంగాణపై వివక్ష ప్రశ్నేలేదు.. మాకన్ని రాష్ట్రాలు సమానమే’’

‘‘తెలంగాణపై వివక్ష ప్రశ్నేలేదు.. మాకన్ని రాష్ట్రాలు సమానమే’’

   9 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle