సూర్యాపేట జిల్లాలో దారుణం..టీఆర్ఎస్ నేత హత్య
15-02-202015-02-2020 10:25:39 IST
Updated On 15-02-2020 13:47:45 ISTUpdated On 15-02-20202020-02-15T04:55:39.969Z15-02-2020 2020-02-15T04:55:16.162Z - 2020-02-15T08:17:45.587Z - 15-02-2020

సహకార ఎన్నికలు ఓ నేతను బలి తీసుకున్నాయి. సూర్యాపేట జిల్లా మండలం ఎర్కారం మాజీ సర్పంచ్, టీఆర్ఎస్ నేత ఒంటెద్దు వెంకన్న దారుణంగా హత్య చేశారు. . సహకార సంఘాల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ ఇంట్లోకి వెళ్లిన వెంకన్నపై ప్రత్యర్థులు వేటకొడవళ్లతో దాడి చేసి హతమార్చినట్టు పోలీసులు ప్రకటించారు. గ్రామంలో గత రెండు రోజులుగా సహకార సంఘాల ఎన్నిక విషయంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. వెంకన్నను టార్గెట్ చేసిన ప్రత్యర్థి పార్టీ నేతలు గ్రామంలోనే కత్తులతో నరకడంతో వెంకన్న అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈహత్యపై టీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. వెంకన్నను హతమార్చింది కాంగ్రెస్ నాయకులే అంటున్నారు. టీఆర్ఎస్ నేత హత్య ప్రకంపనలు కలిగిస్తోంది. రంగంలోకి దిగిన డీఎస్పీ నాగేశ్వరరావు మృతదేహాన్ని పోస్టుమార్టంకి పంపించారు. వెంకన్న హత్యతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వెంకన్న హత్యతో గ్రామంలో ఫ్యాక్షన్ హత్యలు మరోసారి మొదలయ్యాయి. పదిహేనేళ్ల క్రితం ఇదే గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ నాయకుడు మిద్దె రవీందర్ హత్యకు గురయ్యాడు. మరోసారి ఇలాంటి వాతావరణం ఏర్పడడంతో గ్రామస్తులు ఎప్పుడేం జరుగుతుందో అర్థంకాక ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ సహకార ఎన్నికల పోలింగ్ జరుగుతోంది.

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
10 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
6 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
8 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
11 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
13 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
15 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
16 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
17 hours ago

భద్రలోక్పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
18 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
19 hours ago
ఇంకా