సూర్యాపేటలో విజృంభిస్తున్న కరోనా..! 20 రోజుల్లో 80 కేసులు
22-04-202022-04-2020 07:11:49 IST
Updated On 22-04-2020 09:32:21 ISTUpdated On 22-04-20202020-04-22T01:41:49.202Z22-04-2020 2020-04-22T01:41:28.605Z - 2020-04-22T04:02:21.094Z - 22-04-2020

తెలంగాణలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 928కి చేరింది. రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రత్యేకించి గ్రేటర్ హైదరాబాద్ తర్వాత సూర్యాపేట పెద్ద డేంజర్ జోన్‌గా మారింది. ఇక్క సూర్యాపేటలోనే 80 పాజిటీవ్ కేసులు నమోదు కావడం ప్రభుత్వానికి కూడా ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం ఒక్కరోజే ఇక్కడ 26 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో హైదరాబాద్ మినహా మిగతా అన్ని జిల్లాల్లో కరోనా పాజిటీవ్ కేసులు కంట్రోల్లో ఉంటున్నాయి. కేవలం సూర్యాపేటలో మాత్రమే కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి. జిల్లాలో కరోనా పాజిటీవ్ కేసులు పెరుగుతున్న తీరు ప్రభుత్వానికి, ప్రజలకు ఒక హెచ్చరికలా మారింది. ఈ నెల 2న సూర్యాపేటలో మొదటి కేసు నమోదు కాగా కేవలం 20 రోజుల పరిధిలోని 80 కేసులకు చేరింది. ఢిల్లీ జమాత్ వెళ్లి వచ్చిన ఒకే ఒక్క వ్యక్తి నుంచి జిల్లాలో ఇంత పెద్ద సంఖ్యలో పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. ఢిల్లీకి వెళ్లొచ్చిన వ్యక్తి వల్ల తన కుటుంబసభ్యులకు, ఓ మెడికల్ షాపులో మందులు కొని మెడికల్ షాపు సిబ్బంది వైరస్ అంటించాడు. దీంతో సదరు మెడికల్ షాపులో మందులు కొన్న ఓ చేపలు అమ్మే మహిళకు వైరస్ సోకింది. ఆమె మార్కెట్లో చేపలు అమ్ముతుంది. దీంతో మార్కెట్లో కిరాణా షాపు నిర్వహాకుడికి, అతడి నుంచి మరి కొందరికి వైరస్ సోకింది. ఈ మొత్తం కాంటాక్ట్‌లను చేధించడమే ఇప్పుడు అధికార యంత్రాంగానికి పెద్ద సవాల్‌గా మారింది. చాలా రోజులు చిక్కుముడిగా ఉన్న ఈ కాంటాక్ట్ ట్రేసింగ్ను చవరకు సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా అధికారులు గుర్తించారు. కరోనా పాజిటీవ్‌గా తేలిన వారికి కాంట్రాక్ట్‌లో ఉన్న వారు సుమారు 5 వేల మంది ఉన్నారంటే పరిస్థితి ఎంత ప్రమాదకర స్థాయికి వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. ఇలా గుర్తించిన వారిలో 4,346 మందిని హోం క్వారంటైన్లో ఉంచారు. మరో 210 మందిని ప్రభుత్వ క్వారంటైన్లో పెట్టారు. మొత్తం 796 నమూనాలను సేకరించగా 80 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. మరో 191 పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది. ప్రమాదకరస్థాయిలో కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం సూర్యాపేటపై ప్రత్యేక దృష్టి పెట్టింది. సూర్యాపేట మున్సిపాలిటీకి కరోనా ప్రత్యేక అధికారిగా వేణుగోపాల్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన మెడికల్ షాపులో ఎవరెవరు మందులు కొన్నారనే వివరాలను సేకరించి, వారిని క్వారంటైన్లో పెడుతున్నారు. కేవలం మార్కెట్ ప్రాంతంలోనే 40 మందికి కరోనా సోకడంతో ఈ మార్కెట్‌కు వచ్చే నాలుగు మండలాల్లోని సుమారు 40 గ్రామాల్లో ఇంటింటికీ సర్వే నిర్వహిస్తున్నారు. జిల్లాలో, ప్రత్యేకించి సూర్యాపేట పట్టణంలో కరోనా వ్యాప్తిని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటోంది. కరోనాను తేలిగ్గా తీసుకుంటున్న వారికి సూర్యాపేటలో ఒక్కరి నుంచి నమోదవుతున్న కేసులు ఒక హెచ్చరిక లాంటివి. అందుకే లాక్‌డౌన్‌ను సరిగ్గా పాటించి అందరూ ఇళ్లకే పరిమితం అవడం మంచిది.

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత
5 hours ago

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్
6 hours ago

షర్మిల దీక్ష..రచ్చ ఫిక్స్..పర్మిషన్ ప్రాబ్లమ్
5 hours ago

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.
9 hours ago

ఏపీ, తెలంగాణలో ఉత్కంఠ.. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్
11 hours ago

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జగన్
9 hours ago

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
11 hours ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
12 hours ago

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!
7 hours ago

ఎమ్మెల్యేల డ్రగ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు
13 hours ago
ఇంకా