సురేష్ రెడ్డికి దక్కని హామీ.. కమలం వైపు చూపు
27-02-202027-02-2020 09:25:16 IST
2020-02-27T03:55:16.257Z27-02-2020 2020-02-27T03:54:43.761Z - - 15-04-2021

కేఆర్ సురేష్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో పరిచయమక్కర్లేని పేరిది. వివాద రహితుడుగా పేరు తెచ్చుకున్న నాయకుడు. కీలక పదవులు అనుభవించిన అనుభవం,కాంగ్రెస్ పార్టీలో మంచి ప్రాధాన్యత సంపాదించుకున్నలీడర్. అంతా బాగానే ఉన్నా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు గులాబీ కండువా కప్పుకున్నారు. చాల మీటింగ్ లలో కేసిఆర్ పక్కనే కూర్చుంటూ చాలా కీలక నేతగా కనిపించారు. కానీ, ఇప్పుడు అసలు అడ్రస్ కనిపించడం లేదు. అసలు సురేష్ రెడ్డి ప్యూచర్ ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ జిల్లాలో పరిచయం అక్కర లేని రాజకీయ నేతల్లో ఒకరు మాజీ స్పీకర్ కే.ఆర్. సురేష్ రెడ్డి.ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నేత. కాంగ్రెస్ పార్టీ తరపున నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది రెండు నియోజకవర్గాల్లో పట్టున్న నేత.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సురేష్ రెడ్డి... గులాబీ గూటికి చేరారు. ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్ధుల గెలుపు కోసం తన వంతు ప్రచారం చేసి సక్సెస్ అయ్యారు. అభివృద్దిలో దూసుకుపోతున్న కారు స్టీరింగ్ మరొకరికి అప్పగించొద్దంటూ సరికొత్త నినాదంతో ప్రచారం చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే సురేష్ రెడ్డికి కీలక పదవి దక్కుతుందని..టీఆర్ఎస్ అధినేత జిల్లాలో జరిగిన ప్రచార సభలో చెప్పారు. దీంతో అందరూ ఆయనకు మండలి ఛైర్మన్ ఖాయమనే భావించారు. అది కాకుంటే రాజ్యసభ పక్కా అనుకున్నారు. కాని ఇప్పటి వరకు ఆయనను ఏ పదవీ వరించలేదు.సురేష్ రెడ్డి అనుచరులు మా నేతకు పదవి ఎప్పుడొస్తుందని ఆశగా ఎదురుచూస్తుంటే.. టీఆర్ఎస్ శ్రేణులు మాత్రం క్యూలో ఇంకా చాలా మంది ఉన్నారని సమాధానం ఇస్తున్నారు. దీంతో ఇప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్తు పై జిల్లాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇక ఇప్పుడు తన ప్యూచర్ ఏంటనే అనే క్వశ్చన్ అటు ఆయనను వేధిస్తోందట. ఎవరిని అడగాలో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారాయన. పార్టీ మారాలనే ఒత్తిడి కూడా అనుచరుల నుండి పెరుగుతుందట. సంవత్సరం గడిచిన ఎలాంటి పదవి ఇవ్వకపోవడంతో అసంతృప్తితో ఉన్నారట సురేష్ రెడ్డి. ఇప్పటికే ఓ పదవిని సురేష్ రెడ్డికి ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది.అదే ఇంతకు ముందు డిఎస్ కి ఇచ్చిన అంతరాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అంట. దానిని సురేష్ రెడ్డి నిరాకారించారు అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇక అటు నియోజకవర్గంలో సురేష్ పార్టీ మారుతారనే ప్రచారం కూడా విసృతంగా జరుగుతోంది. టీఆర్ఎస్ లో సరైనా ప్రాధాన్యం దక్కడం లేదనే అసంతృప్తి దీనికి బలం చేకూర్చుతుంద. దీంతో పాటు గత కోద్ది రోజులుగా సురేష్ రెడ్డి పార్టీ కార్యక్రమంలో అసలు పాల్లోన్న దాఖలలు లేవు. దీంతో కారు దిగి కమలం కండువ కప్పుకుంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక అటు నిజామాబాద్ జిల్లా నుంచి రాజ్యసభ సభ్యునిగా ఉన్న డి.ఎస్. తన పదవికి రాజీనామా చేస్తే ఆ పదవి సురేష్ రెడ్డికి కట్టబెడతారనే ప్రచారం జరుగుతోంది. డీఎస్ రాజీనామా ఎప్పుడు చేస్తారో,సురేష్ రెడ్డికి రాజ్య సభ ఎప్పుడొస్తుందో తెలియక కార్యకర్తలు పరేషాన్ అవుతున్నారు.సురేష్ రెడ్డి సైతం అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. అంతేకాదు బీజేపీ నుంచి కూడా సురేష్ రెడ్డికి ఆఫర్ వచ్చిందనే ప్రచారం సాగుతోంది.

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
2 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
4 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
5 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
6 hours ago

భద్రలోక్పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
7 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
8 hours ago

వన్ ప్లస్ వన్ ఆఫర్
6 hours ago

నా రూటే సెపరేటు
10 hours ago

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత
a day ago

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్
a day ago
ఇంకా