newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సుప్రీం తీర్పుతో ఇద్ద‌రు సీఎంల‌కు కొత్త ప‌రేషాన్‌

29-08-202029-08-2020 08:23:43 IST
Updated On 29-08-2020 08:35:47 ISTUpdated On 29-08-20202020-08-29T02:53:43.531Z29-08-2020 2020-08-29T02:46:59.947Z - 2020-08-29T03:05:47.424Z - 29-08-2020

సుప్రీం తీర్పుతో ఇద్ద‌రు సీఎంల‌కు కొత్త ప‌రేషాన్‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు ఇప్పుడు ఒక కొత్త స‌మ‌స్య ఎదుర‌వ‌బోతోంది. ఇంత‌కాలం కోల్డ్ స్టోరేజ్‌లోకి నెట్ట‌బ‌డ్డ ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ అనే సున్నిత‌మైన అంశం ఇప్పుడు మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. ఎస్సీ, ఎస్టీ వ‌ర్గీక‌ర‌ణ‌పై రాష్ట్ర ప్ర‌భుత్వాలు నిర్ణ‌యం తీసుకోవ‌చ్చ‌ని సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వ‌డంతో ఇప్పుడు ఈ అంశంపై చ‌ర్చ మొద‌లైంది. ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ కోసం గ‌త రెండు ద‌శాబ్దాలుగా పోరాడుతున్న ఎమ్మార్పీఎస్ ఇప్పుడు రెండు రాష్ట్రాల ప్ర‌భుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధ‌మ‌వుతోంది.

ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ అనేది తెలుగు నాట సుదీర్ఘ‌కాలంగా ఉన్న సున్నితమైన స‌మ‌స్య. ఎస్సీలంద‌రూ ఒకే కులానికి చెందిన వారు కాదు. అనేక ఉప‌కులాలు ఉన్నాయి. అయితే, ఎస్సీల్లోని కొన్ని కులాల వారే ఎక్కువ‌గా రిజ‌ర్వేష‌న్ ఫ‌లాల‌ను అందుకుంటున్నార‌ని, మిగ‌తా ఎస్సీ కులాలు వెనుక‌బ‌డుతున్నాయ‌ని, కాబ‌ట్టి ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ చేయాల‌నే డిమాండ్‌ను ఎమ్మార్పీఎస్ తెర‌పైకి తెచ్చింది. ఈ డిమాండ్‌తో ఎమ్మార్పీఎస్ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు మంద కృష్ణ‌మాదిగ పెద్ద ఎత్తున ఉద్య‌మాలు కూడా చేశారు.

అయితే, ఎస్సీల్లోని కొన్ని కులాల వారు మాత్రం ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌ను వ్య‌తిరేకిస్తున్నారు. దీంతో ఎస్సీల్లో వ‌ర్గీక‌ర‌ణ విష‌యంపైన విభేదాలు వ‌చ్చాయి. దీంతో ఇది సున్నిత‌మైన స‌మ‌స్య‌గా మారింది. ప్ర‌భుత్వాలు వ‌ర్గీక‌ర‌ణ‌కు అనుకూలంగా నిర్ణ‌యం తీసుకుంటే, వ‌ర్గీక‌ర‌ణ‌ను వ్య‌తిరేకిస్తున్న వారు దూర‌మ‌వుతార‌ని, ఒక‌వేళ వ్య‌తిరేకంగా నిర్ణ‌యం తీసుకుంటే వ‌ర్గీక‌ర‌ణ కోరుతున్న వారు దూర‌మ‌వుతార‌ని భావిస్తూ వ‌స్తున్నాయి. దీంతో ఈ విష‌యాన్ని కాల‌యాప‌న చేయ‌డం మొద‌లుపెట్టాయి.

ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ అంశం కేంద్రం ప‌రిధిలో ఉండ‌టంతో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉన్న‌ప్ప‌టి నుంచి రాజ‌కీయ పార్టీలు ఈ విష‌యంపై స్ప‌ష్ట‌మైన వైఖ‌రిని అవ‌లంభించ‌డం లేదు. అయితే, అన్ని పార్టీలూ ఏదో ఒక సంద‌ర్భంలో ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌కు అనుకూలంగా ప్ర‌క‌ట‌న‌లు చేశాయి. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కూడా ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌కు అనుకూల‌మ‌ని చెప్పింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన త‌ర్వాత జ‌గ‌న్ ఈ విష‌యంపై త‌మ వైఖ‌రి ఇదీ అని ఇంత‌వ‌ర‌కు ఒక స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న ఇవ్వ‌లేదు.

ప్ర‌స్తుతం సుప్రీం కోర్టు ఈ విషయంలో రాష్ట్ర ప్ర‌భుత్వాలు నిర్ణ‌యం తీసుకోవ‌చ్చ‌ని చెప్పింది. అయితే, ఏడుగురు లేదా తొమ్మిది మంది స‌భ్యుల ధ‌ర్మాస‌నం వ‌ద్ద తుది విచార‌ణ జ‌ర‌గ‌నుంది.

దీంతో మ‌రోసారి ఉద్య‌మాన్ని ఉధృతం చేయాల‌ని ఎమ్మెర్పీఎస్ భావిస్తోంది. రెండు రాష్ట్రాల ప్ర‌భుత్వాల‌పై ఒత్తిడి తేవాల‌ని, ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌కు అనుకూలంగా మంచి లాయ‌ర్ల‌ను నియ‌మించి కోర్టులో వాద‌న‌లు వినిపించాల‌ని మంద కృష్ణ‌మాదిగ కోరుతున్నారు. ఈ మేర‌కు విన‌వించేందుకు త్వ‌ర‌లోనే ఆయ‌న ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌ను క‌ల‌వాల‌ని భావిస్తున్నారు.

సుప్రీం కోర్టు తాజా తీర్పుతో  ఇంత‌కాలంగా తాము చేస్తున్న డిమాండ్‌లో న్యాయం ఉంద‌ని తేలిందని మంద కృష్ణ‌మాదిగ అంటున్నారు. ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ లేక‌పోవడం వ‌ల్ల కొన్ని ఎస్సీ ఉప‌కులాలు రిజ‌ర్వేష‌న్ల వాటా స‌రిగ్గా పొంద‌లేక‌పోయార‌ని, విద్యా, ఉద్యోగాల‌ ప‌రంగా వెనుక‌బ‌డ్డాయని ఆయ‌న అంటున్నారు.

సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు 90 శాతం ద‌ళిత కులాల‌కు మేలు చేసేదిగా ఉందన్నారు. ఇప్ప‌టికైనా ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌కు అనుకూలంగా రెండు తెలుగు రాష్ట్రాల‌ ప్రభుత్వాలు ముందుకుపోవాలని డిమాండ్ చేస్తున్నారు.

2004లో కాంగ్రెస్ ప్రభుత్వం వ‌చ్చిన త‌ర్వాత కొన్ని సాంకేతిక కార‌ణాల వ‌ల్ల‌ ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ ర‌ద్ద‌యినా ఆనాటి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌కు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మాణం చేసిందని, ఎంపీగా ఉన్న‌ప్పుడు ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌కు అనుకూలంగా ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి లేఖ రాశార‌ని ఆయ‌న మంద కృష్ణ గుర్తు చేస్తున్నారు. తండ్రి ఆశ‌య‌సాధ‌న‌కు కృషి చేస్తాన‌ని చెప్పే జ‌గ‌న్ ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌కు అనుకూలంగా ముందుకుపోవాల‌ని కోరుతున్నారు. త్వ‌ర‌లోనే జ‌గ‌న్‌ను క‌లిసే ప్ర‌య‌త్నం చేస్తామంటున్నారు.

తెలంగాణ‌లో కూడా ఎస్సీ వ‌ర్గీకర‌ణ‌కు ‌అనుకూలంగా కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేశార‌ని మంద కృష్ణ గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు రెండు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు చిత్త‌శుద్ధితో ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌కు కృషి చేయాల‌ని కోరుతున్నారు.

ఇందుకు గానూ ఒత్తిడి తీసుకురావాల‌ని ఎమ్మార్పీఎస్ నిర్ణ‌యించింది. దీంతో ఏదో ఒక స్ప‌ష్ట‌మైన నిర్ణ‌యం తీసుకోవాల్సిన ప‌రిస్థితి అటు కేసీఆర్‌కు, ఇటు జ‌గ‌న్‌కు ఎదురుకాబోతోంది. మ‌రి, ఈ సున్నిత‌మైన అంశంలో వీరు ఎలా ముందుకు వెళ‌తారో చూడాలి.

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   5 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   6 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   6 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   10 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   11 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   9 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   11 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   12 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   7 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   14 hours ago


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle