newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సుప్రీం ఎఫెక్ట్: తెలంగాణ నేతలపై కేసుల చిట్టా ఇదే!

18-02-202018-02-2020 07:43:57 IST
2020-02-18T02:13:57.694Z18-02-2020 2020-02-18T02:13:54.587Z - - 15-04-2021

సుప్రీం ఎఫెక్ట్: తెలంగాణ నేతలపై కేసుల చిట్టా ఇదే!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రజా ప్రతినిధులపై నమోదైన క్రిమినల్, ఇతర కేసుల వివరాలను ప్రజలకు తెలిసేలా ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఆ కేసులకు సంబంధించిన వివరాలను ఆయా రాజకీయ పార్టీలు తమ అధికారిక వెబ్‌సైట్లలో, అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. క్రిమినల్ కేసులు ఉన్న వారిని సహించేది లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఇందులో భాగంగా తెలంగాణలో ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసుల చిట్టా సిద్ధమైంది. ప్రత్యేక తెలంగాణ పోరాట ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ అగ్ర నేతలు సహా, కాంగ్రెస్, బీజేపీ, టీటీడీపీ నేతలపై నమోదైన కేసులు వారిపై ఇంకా కొనసాగుతున్నాయి.

సుప్రీం కోర్టు ఆదేశాలతో నేరస్తుల చిట్టాలు బయటకు వస్తున్నాయి. మొత్తం తెలంగాణలో ఉన్న 119 మంది ఎమ్మెల్యేలలో  దాదాపు వంద మందికిపైగా  వివిధ రకాల కేసులు నమోదై ఉన్నాయి. టీఆర్ఎస్‌లో 69 మంది,తెలంగాణ కాంగ్రెస్‌లో 19 మంది నేర చరితులు ఉన్నట్లు తెలుస్తోంది. టీటీడీపీలో ఇద్దరు, ఎంఐఎంలో ఏడుగురు, బీజేపీలో నలుగురిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు సమాచారం. 

తెలంగాణ పోరాట ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ నాయకుడైన మంత్రి హరీశ్ రావుపై అత్యధికంగా 41 కేసులు నమోదయ్యాయి. తర్వాత మంత్రి కేటీఆర్‌పై 17, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై 13 తెలంగాణ ఉద్యమ కేసులు ఉన్నాయి. అంతేకాక, టీఆర్ఎస్ నేతలు ఆత్రం సక్కుపై 13, రోహిత్ రెడ్డిపై 8, తాటికొండ రాజయ్యపై 5 కేసులు, ఎర్రబెల్లిపై 5, గంగుల కమలాకర్‌పై 3, మంత్రులు సబితా ఇంద్రారెడ్డిపై 4 కేసులు, తలసానిపై 3, మాజీ మంత్రి జూపల్లిపై 3 కేసులు ఉన్నాయి. 

ఇక కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై 4, చిరుమర్తి లింగయ్యపై 8, దానం నాగేందర్‌పై 4 కేసులు ఉన్నాయి. రేవంత్ రెడ్డిపై ఓటుకు నోటు సహా మరో 7 కేసులు నమోదై ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే సంపత్‌పై 4 కేసులు, మాజీ మంత్రి డి.శ్రీధర్ బాబుపై 4 కేసులు ఉన్నాయి. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై 17 క్రిమినల్ కేసులు రౌడీ షీట్ ఉంది. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై 8, కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై 9 కేసులు ఉన్నాయి. అంతేకాక, ఏపీలో వైసీపీకి చెందిన 86 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలపైనా కేసులు ఉన్నాయి. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పోరాడుతోంది.

2018లో సుప్రీంకోర్టు దీనిపై తీర్పు ఇచ్చిన సందర్భంలో అభ్యర్థులెవరైనా తమపై ఉన్న కేసులను ఓ జాతీయ పత్రిక, స్థానిక పత్రికలో ప్రకటించాలని సూచించింది. కానీ అభ్యర్థులు దీన్ని పట్టించుకోలేదు. దీంతో ఈ చర్చ మళ్లీ సుప్రీంకోర్టుకు చేరింది. ఈ ఆదేశాలను సుప్రీంకోర్టు రాజకీయపార్టీలకు ఇచ్చింది. నేర చరితులకు టికెట్ ఇస్తున్న సందర్భంలో వారికి ఎందుకు ఇవ్వాల్సి వస్తోందో ఆయా పార్టీలు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. 

అత్యాచారం, హత్యలు వంటి తీవ్రమైన క్రిమినల్ నేరారోపణలు ఉన్న అభ్యర్థులను కొన్నేళ్లపాటు పక్కన పెట్టాలని గతంలో సూచించింది. అయితే, ఉద్యమ కేసులు నమోదైన సందర్భంలో వాటిని పరిగణనలోకి తీసుకోలేం. అభ్యర్థులపై నేరారోపణలు త్వరితగతిన తేల్చేందుకు తెలంగాణ ప్రభుత్వం రెండేళ్ల క్రితం ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసింది. 40 మంది సిబ్బందిని నియమించారు.

కానీ ఏడాదిన్నర వరకూ జడ్జిని నియమించలేదు. తర్వాత మళ్లీ పోరాడితే ఆర్నెల్లకు జడ్జిని నియమించారు. కానీ, ఇప్పుడు రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేసే పరిస్థితులు లేవు. అందుకే కేసులు కోర్టుల వరకూ రావట్లేదు. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించి కేసుల చిట్టా విప్పినా.. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై చర్యలు మాత్రం లేవు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle