newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సుదీర్ఘ చర్చ.... అనంతరమే కేసీయార్ నిర్ణయం

20-04-202020-04-2020 08:36:59 IST
Updated On 20-04-2020 10:45:41 ISTUpdated On 20-04-20202020-04-20T03:06:59.147Z20-04-2020 2020-04-20T03:06:51.584Z - 2020-04-20T05:15:41.547Z - 20-04-2020

సుదీర్ఘ చర్చ.... అనంతరమే కేసీయార్ నిర్ణయం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాష్ట్రంలో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. లాక్ డౌన్ సడలింపుల వల్ల ఎక్కువమంది రోడ్ల మీదకు వచ్చే అవకాశం ఉంది. మే 3 నుంచి 7 వరకూ లాక్ డౌన్ పెంచింది. ప్రస్తుతం అమలులో ఉన్న లాక్‌డౌన్‌ను మే 7 వరకు కొనసాగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ భావించారు. అలాగే పుడ్‌ డెలివరీ సర్వీసులను కూడా నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనితో పాటు ఇళ్ల కిరాయిలను మూడు నెలల పాటు వసూలు చేయకుండా ఉండే విధంగా గృహ యజమానులను ఆదేశించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కొన్ని గంటల పాటు మంత్రివర్గ సమావేశం జరిగింది.

కేసీయార్ తరహాలోనే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఢిల్లీలో కరోనా తీవ్రంగా ఉండటంతో సడలింపు ఇవ్వ కూడదని భావిస్తోంది. రేపటి నుంచి ఎలాంటి మినహాయింపులు లేవని కేజ్రీవాల్‌ అధికారికంగా ప్రకటించారు. కరోనా తీవ్రత, లాక్‌డౌన్‌ సడలింపుపై ఏప్రిల్‌ 27న మరోసారి సమీక్ష నిర్వహించి అప్పటి పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని సీఎం తెలిపారు. పాజిటివ్‌ కేసుల్లో దేశవ్యాప్తంగా రెండో స్థానంలో ఉంది. దేశ రాజధానిలో 71 కంటైన్మెంట్ జోన్ల‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు 1,893 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 42 మంది మరణించారు.

తెలంగాణ వ్యాప్తంగా 31 జిల్లాలో 4 జిల్లాలో ఎటువంటి కేసులు నమోదు కాలేదని కేసీయార్ వెల్లడించారు. దేశం మొత్తంలో 8 రోజులకు ఒకసారి కరోన కేసులు రెట్టింపు అవుతుంటే  తెలంగాణ లో 10 రోజులకు ఒకసారి పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అంతా భావించినట్టు ఇవాళ్ళి నుంచి ఎటువంటి సడలింపులు ఉండవని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్టు తెలంగాణలో ఎటువంటి సడలింపులు ఉండవన్నారు. ప్రపంచ మొత్తంలో 42 దేశాలు మొత్తం లాక్ డౌన్ లో ఉన్నాయి, మన దేశం కూడా మే 3 వరకు సంపూర్ణ లాక్ డౌన్ వుంది. క్యాబినెట్ మీటింగ్ లో సుదీర్ఘ చర్చ , ప్రజా సేకరణ, మీడియా సర్వే ల అనుగుణంగా లాక్ డౌన్ ని తెలంగాణ ప్రభుత్వం వచ్చే నెల మే 7 వరకు లాక్ డౌన్ ని పొగిస్తున్నాం. పండుగలు, పబ్బలు ఇంట్లోనే జరుపుకోవాలన్నారు. సర్పంచ్ నుండి మంత్రి వరకు  ప్రజాప్రతినిధులు చాలా బాగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. 

ప్రభుత్వ ఉద్యోగులకు 50 శాతం జీతాలు ఇస్తాం, పెన్షనర్లకు మాత్రం 75 శాతం డబ్బులు ఇస్తామన్నారు సీఎం కేసీయార్. ప్రైవేట్ విద్యా సంస్థలు వచ్చే విద్యా సంవత్సరంలో ఫీజు పెంచ కూడదు, ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలి, తల్లిదండ్రులు కు ఎలాంటి ఇబ్బందులు పెట్టకూడదన్నారు. తెల్ల రేషన్ కార్డు దారులకు మే నెల బియ్యం, ఒక వ్యక్తి కి 12 కిలో చొప్పున ఇచ్చి, 1500 నగదు ఇస్తాం. వచ్చే నెల 7వ తేదీలోపు ఇవన్నీ జరుగుతాయి. పరిశ్రమలకు ఏప్రిల్, మే నెల డిఫర్ మెంట్ చార్జీలు మొత్తం మాఫీ చేస్తాం అన్నారు కేసీయార్. తెలంగాణలో  కోవిడ్ స్పెషల్ దవాఖానా ప్రారంభిస్తున్నామన్నారు. గచ్చిబౌలి స్టేడియంలోని 14 అంతస్తుల భవనంని వైద్య విధాన పరిషత్ ఆధీనంలో తీసుకొని 1500  పడకల  కోవిడ్ స్పెషల్  దవాఖాన ఏర్పాటు చేస్తున్నామన్నారు. ా

మే 5 తర్వాత ఎరువులు కోనుగోలు చేసుకుని వచ్చే రబీ కోసం సన్నద్ధంగా ఉండాలని, మే తర్వాత కూడా పెళ్ళిళ్ళకు, శుభ కార్యాలకు ఫంక్షన్ హాల్ లు ఇవ్వబడవన్నారు, అట్టి ఫంక్షన్ హాళ్ళను ఫెర్టిలిజర్ గోడౌన్ కొరకు వాడుకోవాలి. కరోనా వ్యాధి ప్రమాద స్థాయిలో ఉంది. లాక్ డౌన్ ని మరింత పటిష్టంగా అమలు పరచాలి, అనవసరంగా బయటకి రావద్దు, ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలన్నారు. కరోన వైరస్ కు మందు లేదు... స్వీయ నియంత్రనే మార్గం అన్నారు కేసీయార్. 

 

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   4 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   5 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   44 minutes ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   8 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   8 hours ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   16 minutes ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   2 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   8 hours ago


ఇక కేటీఆర్ టైం వ‌చ్చిన‌ట్లేనా

ఇక కేటీఆర్ టైం వ‌చ్చిన‌ట్లేనా

   9 hours ago


బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం

బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం

   18-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle