newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

26-05-202026-05-2020 09:53:03 IST
Updated On 26-05-2020 10:06:15 ISTUpdated On 26-05-20202020-05-26T04:23:03.370Z26-05-2020 2020-05-26T04:22:48.330Z - 2020-05-26T04:36:15.118Z - 26-05-2020

సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా లాక్ డౌన్ వేళ వరంగల్ పోలీసులకు చుక్కలు చూపించాడు సంజయ్ కుమార్. ఒక హత్యను కప్పిపుచ్చుకునేందుకు మరో తొమ్మిది హత్యలు చేశాడు బీహార్ కు చెందిన సంజయ్. వరంగల్ గొర్రెకుంటలో జరిగిన 9హత్యల మిస్టరీని చేధించారు పోలీసులు. ప్రధాన నిందితుడు సంజయ్ కుమార్ ను వరంగల్ సీపీ రవీందర్ మీడియా ముందు ప్రవేశపెట్టారు. 

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. “బెంగాల్ నుంచి వలసవచ్చిన మక్సూద్ ఫ్యామిలీ స్థానిక శాంతినగర్ లోని గోనె సంచిల ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్లు. ఇక్కడే వాళ్లకు సంజయ్ పరిచయం అయ్యాడు. ఇదే టైంలో మక్సూద్ భార్య అక్క కూతురు..రఫికా తన ముగ్గురు సంతానంతో మక్సూద్ దగ్గరకు వచ్చింది. తను కూడా గోనె సంచిల ఫ్యాక్టరీలోనే పనిచేసేది. రోజూ సంజయ్‌కు అన్నం వండిపెట్టేది రఫికా. అలా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి.. అది సహజీవనం వరకు వెళ్లింది. అయితే రఫిక కూతురుపై సంజయ్ కన్నేశాడు. ఇది నచ్చని రఫికా సంజయ్ ను నిలదీసింది.

పెళ్లిచేసుకుంటానంటూ రఫికాకు నచ్చజెప్పి.. కుటుంబ సభ్యులతో మాట్లాడదామని చెప్పి బెంగాల్ వెళ్దామంటూ మార్చి 7న  ట్రైన్ లో రఫికను తీసుకెళ్లాడు సంజయ్. మార్చి8న ఉదయం  ట్రైన్ లోనే మజ్జిగలో నిద్రమాత్రలు కలిపి రఫికాను చున్నీతో బిగించి చంపేశాడు. తర్వాత పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు దగ్గర.. ట్రైన్ నుంచి నెట్టేసి వరంగల్ చేరుకున్నాడు సంజయ్. కొద్దిరోజుల తర్వాత రఫికా విషయమై సంజయ్‌ను నిలదీయడం మొదలుపెట్టారు మక్సూద్ కుటుంబసభ్యులు. దీంతో రఫికా మర్డర్ విషయం ఎక్కడ బయటపడుతోందనని.. మక్సుద్ ఫ్యామిలీని కూడా చంపాలని నిర్ణయించుకున్నాడు సంజయ్ కుమార్ .

మక్సుద్ ఫ్యామిలీ మొత్తం ఆరుగురు సభ్యులు. మక్సుద్ అతని భార్య, ఇద్దరు కుమారులు, కూతురు, మనవడు ఉన్నారు. అలాగే మక్సుద్ ఉంటున్న పై రూంలో శ్రీరాం,శ్యాం అనే ఇద్దరు బిహారీలు కూడా ఉంటున్నారు. మక్సుద్ ఫ్యామిలీని చంపాలనుకున్న సంజయ్ హన్మకొండ చౌరస్తాలోని ఓ మెడికల్ షాపు నుంచి స్లీపింగ్ పిల్స్ కొన్నాడు.

ఈనెల 16 నుంచి 20వరకు మక్సుద్ ఉండే ప్రాంతం చుట్టుపక్కల రెక్కీ చేశాడు. మక్సుద్ కొడుకు బర్త్ డే రోజున అందరినీ చంపాలని డిసైడ్ అయ్యాడు. అదే రోజు స్లీపింగ్ పిల్స్ ను మక్సుద్ వాళ్లు చేసుకున్న వంటలో కలిపాడు. అలాగే పై రూంలో ఉంటున్న బిహారీల వంటలో కూడా మత్తు మాత్రలు కలిపాడు. అందరూ స్పృహ తప్పి పడిపోయాక.. ఒక్కొక్కరిని తీసుకెళ్లి బావిలో పడేశాడు. ఆ తర్వాత ఏమీ తెలీనట్టే తన ఇంటికి చేరుకున్నాడు.

ఈ వరుస హత్యల కేసును చేధించేందుకు వరంగల్ పోలీసులకు సీసీ టీవీ ఫుటేజీ బాగా ఉపయోగపడింది. ఆ ఫుటేజీ ద్వారానే సంజయ్ కదలికలను గుర్తించారు పోలీసులు. తర్వాత సంజయ్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తే.. అసలు విషయం మొత్తం బయటపడిందని తెలిపారు వరంగల్  సీపీ రవీందర్. మొత్తం మీద ఒక హత్యను దాచేందుకు 9 మందిని హతమార్చి సంజయ్ పెద్ద సీరియల్ కిల్లర్ గా మారాడు. ఈ పది హత్యల ఉదంతం రాష్ట్యవ్యాప్తంగా సంచలనం రేపింది. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle