newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సీయం కేసీయార్‌పై మండిపడ్డ నడ్డా

10-08-202010-08-2020 18:36:57 IST
Updated On 10-08-2020 18:44:29 ISTUpdated On 10-08-20202020-08-10T13:06:57.388Z10-08-2020 2020-08-10T13:06:32.267Z - 2020-08-10T13:14:29.497Z - 10-08-2020

సీయం కేసీయార్‌పై మండిపడ్డ నడ్డా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ సీఎం కేసీఆర్‌ పై బీజేపీ జాతీయాధ్యక్షుడు జెపి నడ్డా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కరోనాను కట్టడి చేయకుండా కుంభకర్ణుడిలా మొద్దు నిద్ర పోతున్నారని మండిపడ్డారు. ఇవాళ తెలంగాణ జిల్లాల్లో బీజేపీ ఆఫీసులకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ నుంచి వర్చువల్‌గా పాల్గొన్న ఆయన.. తెలంగాణ సర్కారును టార్గెట్ చేసుకొని తీవ్రమయిన విమర్శలకు దిగారు.

రూ.45 వేల కోట్లతో పూర్తి కావాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టును దోచుకోవడం కోసమే రూ.85 వేల కోట్లకు పెంచారని నడ్డా ఆరోపించారు. తెలంగాణ వస్తే లక్ష ఉద్యోగాలు వస్తాయన్న కేసీఆర్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏడు లక్షల డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తానని మాటిచ్చి.. 50 వేల ఇండ్లు కూడా కట్టలేదన్నారు. గత ఆరేళ్లలో తెలంగాణ ప్రజలకు ఏం చేశారో చెప్పాలని నడ్డా డిమాండ్ చేశారు.

కరోనాను కట్టడి చేయకుండా కేసీఆర్ కుంభకర్ణుడిలా నిద్రపోతున్నారని నడ్డా విమర్శించారు. హైకోర్టు మొట్టికాయలు వేసినా కేసీఆర్ సర్కారు మొద్దు నిద్ర వీడటం లేదన్నారు. తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయడం లేదని.. దీంతో 98 లక్షల మంది బీమా సదుపాయాన్ని కోల్పోయారన్నారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలని నడ్డా కోరారు. కరోనాను కట్టడి చేయడంలో ప్రజలు కేంద్రానికి సహకరించాలని కోరారు. కరోనాను ఎదుర్కోవడంలో మోదీ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఉచిత ఆహారధాన్యాలు, వలస కార్మికులకు శ్రామిక్ రైళ్ల ద్వారా వారిని ఆదుకున్నారన్నారు. 

 

ఏపీలో స్కూల్స్ బంద్

ఏపీలో స్కూల్స్ బంద్

   an hour ago


వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

   33 minutes ago


జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   5 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   6 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   2 hours ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   9 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   9 hours ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   an hour ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   3 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   9 hours ago


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle