సీపీ సజ్జనార్.. ఎంపీ అసదుద్దీన్ ట్విట్టర్ వార్!
09-01-202009-01-2020 09:20:34 IST
Updated On 09-01-2020 11:35:45 ISTUpdated On 09-01-20202020-01-09T03:50:34.361Z09-01-2020 2020-01-09T03:50:31.639Z - 2020-01-09T06:05:45.446Z - 09-01-2020

షాద్ నగర్ దిశా అత్యాచారం.. హత్యపై యావత్ దేశం అట్టుడికిపోయిన సంగతి తెలిసిందే. మూగజీవాలకి వైద్యం అందించే డాక్టరును అతి కిరాతకంగా నలుగురు మృగాలు నాశనం చేసి కిరాతకంగా చంపిన ఈ ఘటన మరోసారి దేశాన్ని కుదిపేసింది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్ కి తరలించారు. న్యాయస్థానం అనుమతితో నలుగురిని విచారణకి తీసుకున్నారు. అయితే అతికొద్ది మంది మాత్రమే ఊహించిన విధంగా నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. అందుకు పోలీసులు చెప్పిన సీన్ రీ కనస్ట్రక్షన్ కథలు కూడా అందరికీ తెలిసిందే. ఈ ఎన్ కౌంటర్ తో తెలంగాణ పోలీసులు మరోసారి హీరోలయ్యారు. మహిళలు పెద్ద ఎత్తున నీరాజనాలు పలకడంతో పాటు పూలవర్షం కురిపించారు. ఆ ఎన్ కౌంటర్ కేసు ఇప్పటికీ విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ ఎన్ కౌంటర్ పై భిన్నవాదనలు ఉన్నప్పటికీ ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఎక్కువశాతం నేతలు ఎన్ కౌంటర్ ను సమర్ధించారు. అయితే ఇప్పుడు మరోసారి ఎన్ కౌంటర్ ప్రస్తావన తెచ్చారు ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. అది కూడా ట్విట్టర్ సాక్షిగా సీపీ సజ్జనార్ పై ట్వీట్ల వర్షం కురిపించారు. కడుపులో బుల్లెట్లు దించొద్దు సీపీ సాబ్ అంటూ రెచ్చిపోయారు. హైదరాబాద్ అమెరికన్ కంపెనీల్లో జిహాదీలో పనిచేస్తున్నారా? వాళ్ళను గుర్తించేందుకు మీ దగ్గర ఏమైనా వ్యవస్థ, డేటా ఉందా అని సురేష్ అనే ఓ నెటిజన్ హైదరాబాద్ పోలీసులను ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. దీనికి సైబరాబాద్ సీపీ సజ్జనార్ స్పందిస్తూ ట్వీట్ చేశారు. దానిపై పనిచేస్తున్నామని.. డేటాను కలెక్ట్ చేస్తున్నామన్నారు. 24 గంటలు తమ టీం పనిచేస్తుందన్నారు. ఉగ్రవాదం సమాచారం సేకరించేందుకు మా వద్ద వ్యవస్థ ఉందని.. మీకు ఎవరైనా అనుమానితులుగా అనిపించినా.. మీకు తెలిసినా మాకు సమాచారం తెలపాలని నెటిజను సీపీ కోరారు. అయితే, సజ్జనార్ ట్వీట్‌పై ఎంపీ అసదుద్దీన్ మండిపడుతూ ట్వీట్స్ చేశారు. సైబరాబాద్‌లో ఎంతమంది జిహాదీలు ఉన్నారని.. మీ దగ్గర ఉన్న వాళ్ల సమాచారం ఏమిటని? ఏ కంపెనీలో జిహాదీలు పనిచేస్తున్నారు? అంటూ అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ చేశారు. అంతటితో ఆగని ఒవైసీ వేకువజామున ఐదు గంటలకు కడుపులో బుల్లెట్లు దించడం సరైంది కాదని.. కావాలంటే థర్డ్ డిగ్రీతో విచారణ చేసుకోవాలన్నారు. అంతేకాదు, మీ అభిమానులకు మాత్రమే మీరు సమాధానం చెప్తారా? లేక ఓ ఎంపీ ప్రశ్నకు కూడా సమాధానం చెప్తారా? అంటూ ట్వీట్స్ చేశారు. వీరిద్దరి ట్వీట్ వార్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
6 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
2 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
4 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
9 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
11 hours ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
12 hours ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
a day ago

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా