సీనియర్ గులాబీ నేతల్లో గుబులు.. కారణం అదేనా?
18-02-202018-02-2020 07:56:33 IST
2020-02-18T02:26:33.778Z18-02-2020 2020-02-18T02:25:14.350Z - - 15-04-2021

అధికారంలో వున్నప్పుడు నేతలంతా చాలా యాక్టివ్ గా వుంటారు. అధికారం దూరం అయితే వారిలో భవిష్యత్తు మీద బెంగ మొదలవుతుంది. తెలంగాణలో కొంతమంది సీనియర్ రాజకీయ నాయకులు దూరం అవుతున్నారా. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత మొదటిసారిగా ఏర్పడిన టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న కీలకంగా వ్యవహరించిన చాలామంది ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. దీనికి కారణం ఎన్నికల్లో ఓటమి కావచ్చు... యువనేతలకు ప్రాధాన్యం కావచ్చు. సీనియర్ నేతలు మాత్రం ఇంటికే పరిమితమయ్యారు.రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ వారిని చాలా దూరం పెట్టారు. వారు అధినేతకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నా కేసీఆర్ వారిని పట్టించుకునే పరిస్థితుల్లో లేరని అంటున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి ఏర్పడిన ప్రభుత్వంలో కీలకంగా ఉన్న సీనియర్ నేతలు ఇప్పుడు దాదాపు కనుమరుగై పోయే పరిస్థితి కన్పిస్తోంది. ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో వీరంతా ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. ఐదేళ్లు గడిచేసరికి వీరి పరిస్థితి పూర్తిగా రివర్స్ కావడం విశేషం. రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ సీనియర్ నేతలను దరిదాపుల్లోకి రానివ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. 2014లో అధికారంలోకి రావడంతో కొందరు సీనియర్ నేతలు అప్పట్లో కీలకంగా వ్యవహరించారు. ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ, పదవుల భర్తీలోనూ వారిదే పైచేయిగా మారింది. ప్రధానంగా తుమ్మల నాగేశ్వరరావు, మధుసూదనాచారి, జూపల్లి కృష్ణారావు, వేణుగోపాలాచారి తదితరులు కేసీఆర్ కు అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. అయితే రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ వీరి వైపు చూడను కూడా చూడటం లేదు. టీడీపీలో సీనియర్ నేతగా వున్న తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ లో ఆయనకు ప్రాధాన్యత లభించింది. 2018 ఎన్నికల్లో ఓటమి చెందడంతో ఆయనను లైట్ తీసుకుంటున్నారు. ఆయనపై పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే టీఆర్ఎస్ లో చేరడంతో ఇక తుమ్మలతో పనిలేకుండా పోయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా మంత్రి పువ్వాడ అజయ్ ఉండటంతో ఇక తుమ్మల మాట చెల్లుబాటు కావడం లేదు. మాజీ స్పీకర్ మధుసూదనాచారి సయితం ఎన్నికల్లో ఓటమి పాలయి ఇప్పుడు పదవి కోసం ఎదురుచూపులు చూస్తున్నా పట్టించుకోవడం లేదట. వివిధ పార్టీ కార్యక్రమాల్లో అంత చురుకుగా పాల్గొనడం లేదు. ఇక మరోమంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఓటమి పాలై పదవి కోసం ఇప్పటి వరకూ ఓపికతో చూశారు. మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో తన వర్గాన్ని రెబల్స్ గా బరిలోకి దించి షాక్ ఇద్దామనుకున్న జూపల్లికి టీఆర్ఎస్ రివర్స్ షాక్ ఇచ్చింది. దీంతో ఆయన సైలెంట్ అయ్యారు. తొలి సర్కార్ లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న కడియం శ్రీహరి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నా పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో కన్పించడం లేదు. గత ప్రభుత్వంలో ఢిల్లీలో ప్రభుత్వ సలహాదారుగా ఉన్న వేణుగోపాలాచారి పదవీ కాలాన్ని పొడిగించలేదు. దీంతో ఆయన కూడా నిరాశలో ఉన్నారు. ఇక మాజీ ఎంపీలు నగేష్, సీతారాం నాయక్ ల పరిస్థితి అంతే. ఇక మరో సీనియర్ నేత కె.కేశవరావు రాజ్యసభ పదవీకాలాన్ని మరోసారి పొడిగిస్తారా? లేదా? అన్నది కూడా డౌటేనంటున్నారు. మరో వైపు టీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ , కేసీఆర్ తనయుడు కేటీఆర్ పై గత కొన్ని రోజులుగా రాష్ట్ర రాజకీయాలలో ఆసక్తికర చర్చ సాగుతుంది . తెలంగాణకు కాబోయే సీఎం కేటీఆర్ అంటూ టీఆర్ ఎస్ వర్గాల్లో ఎప్పటి నుంచో ఒక ప్రచారం ఉన్నప్పటికీ తాజాగా ఆయనకు డిప్యూటీ సీఎం గా అవకాశం ఇవ్వనున్నారు అన్న వార్త రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ ఎస్ ఘనవిజయం తరువాత కేటీఆర్ ను సీఎం చేస్తారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగినా అందుకు భిన్నంగా , సీఎం చెయ్యాలనే ఆలోచనకు దగ్గరగా కేసీఆర్ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది.మొత్తం మీద టీఆర్ఎస్ లో సీనియర్ నేతలను దాదాపు పక్కకు నెట్టేసినట్లేనని చెప్పుకోవాలి. వీరంతా తమ భవిష్యత్తు గురించి బెంగలో వున్నారు.

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
2 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
4 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
5 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
6 hours ago

భద్రలోక్పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
7 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
8 hours ago

వన్ ప్లస్ వన్ ఆఫర్
6 hours ago

నా రూటే సెపరేటు
10 hours ago

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత
a day ago

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్
a day ago
ఇంకా