సీతక్క సేవకు సలాం అంటున్న ప్రజలు..!
19-04-202019-04-2020 07:58:43 IST
Updated On 19-04-2020 09:46:00 ISTUpdated On 19-04-20202020-04-19T02:28:43.972Z19-04-2020 2020-04-19T02:27:03.929Z - 2020-04-19T04:16:00.906Z - 19-04-2020

విపత్కర పరిస్థితులను తమ వ్యక్తిగత ప్రచారానికి మలుచుకుంటున్న వారిని చూశాం. మున్సిపల్ బట్టలు వేసుకొని ఫోటోల కోసం ఫోజులు కొడుతున్న నేతలను చూస్తున్నాం. పేదలకు పంచే నిత్యావసర సరుకులపైనా పోస్టర్లు వేసుకుని పబ్లిసిటీలు చేసుకుంటున్న వారూ ఉన్నారు. అయితే, ఆ ఎమ్మెల్యే అందుకు భిన్నం. ఆమె సేవలో నిజాయితీ ఉంది. ప్రచారం, ఆర్భాటం కోసం కాకుండా తన ప్రజల కోసం ఆమె పని చేస్తోంది. కష్టకాలంలో గిరిపుత్రుల ఆకలి తీరుస్తున్నారు. ఆమే ములుగు ఎమ్మెల్యే సీతక్క. ఆమె సేవకు ఇప్పుడు నియోజకవర్గ ప్రజలే కాదు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా సలాం అంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎమ్మెల్యే సీతక్క శైలి మిగతా వారికి భిన్నం. ఆ మాటకొస్తే రాష్ట్రంలోని అందరు ఎమ్మెల్యేల్లోనూ ఆమె సామాన్యురాలు. ఆదివాసీ బిడ్డ. పేదల కష్టాలు తెలిసిన నాయకురాలు. యుక్త వయస్సులోనే అన్యాయానికి గురవుతున్న తన ప్రజల కష్టాలు తీర్చేందుకు తుపాకి పట్టి అడవుల్లోకి వెళ్లి ధైర్యం ఆమెది. సుదీర్ఘకాలం పీపుల్స్‌వార్ దళ సభ్యురాలిగా, కమాండర్‌గా పని చేశారు. ఈ సమయంలో ఆదివాసీ ప్రజలు ఆమెకు ఆశ్రయం కల్పించారు. అన్నం పెట్టి కాపాడుకున్నారు. ఇప్పుడు జనజీవన స్రవంతిలోకి వచ్చాక వారి రుణం తీర్చుకునేందుకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు సీతక్క. 2009, 2018లో రెండుసార్లు ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గమైన ములుగు ఎమ్మెల్యేగా గెలిచారామె. ఎప్పుడూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటారు. ములుగు నియోజకవర్గం పూర్తిగా ఏజెన్సీ ఏరియా. ఈ నియోజకవర్గంలో గిరిజనులు ఎక్కువగా నివసిస్తుంటారు. ఇక్కడి గిరిజన గూడాలకు ఇంకా సరైనా రోడ్డు వసతి కూడా లేదు. అడవులు, కాల్వలు దాటుకొని వారి ఆవాసాలకు చేరుకోవాలి. వీరంతా ఆడవిలో దొరికే వస్తువులను అమ్ముకొని, మార్చుకొని నిత్యావసర వస్తువులు తీసుకొని జీవిస్తుంటారు. అయితే, ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా వీరు అడవుల్లో సేకరించిన ఉత్పత్తులు అమ్ముకునే వీలు లేకుండా పోయింది. దీంతో ఆకలి బాధలు మొదలయ్యాయి. స్వయంగా ఆదివాసీ మహిళ అయిన సీతక్కకు ఈ కష్టాలన్నీ తెలుసు. దీంతో ఆమె మిగతా వారిలా ఆదేశాలు ఇవ్వడానికి, ఆర్భాటాలు చేయడానికి పరిమితం కాలేదు. వెంటనే రంగంలోకి దిగారు. లాక్డౌన్ మొదలైన నాటి నుంచి ఆమె ఉదయం నుంచి రాత్రి వరకు గిరిజనులతోనే ఉంటున్నారు. ట్రాక్టర్లను వెళ్లి వారికి స్వయంగా నిత్యావసర వస్తువులను అందిస్తున్నారు. వారి బాగోగులను అడిగి తెలుసుకుంటున్నారు. వారితోనే కలిసి భోజనం చేస్తున్నారు. కరోనాపై, లాక్డౌన్ పరిస్థితులపై వారికి అవగాహన కల్పిస్తున్నారు. గత 25 రోజులుగా సీతక్క పూర్తిగా వారి కోసమే పని చేస్తున్నారు. దీంతో నియోజకవర్గ ప్రజలతో పాటు ఆమె సేవలను సోషల్ మీడియాలో చూస్తున్న తెలుగు ప్రజలంతా ప్రశంసిస్తున్నారు. ఇప్పుడే కాదు ఇతర సమయాల్లోనూ సీతక్క నిత్యం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటారు. గిరిజనులు తమ సమస్యలను ఎమ్మెల్యే వద్దకు వెళ్లి చెప్పుకునే పరిస్థితి లేదు. దీంతో ఆమెనే తరచూ గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తూ వారి సమస్యలు పరిష్కరిస్తుంటారు. ఇటీవల జరిగిన ఆదివాసీల మేడారం సమ్మక్క - సారలమ్మ జాతరలో అయితే సీతక్క కష్టపడిన తీరు అంతాఇంతా కాదు. కాళ్లకు బొబ్బలెక్కినా పట్టించుకోకుండా ఆమె జాతరలో పని చేశారు. ఇప్పుడు కరోనా వైరస్ నేపథ్యంలోనూ ఆమె మరోసారి ప్రజల కోసం కష్టపడుతున్న తీరు ప్రశంసనీయం. మిగతా వారికి ఆదర్శం.

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
13 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
9 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
11 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
14 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
16 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
18 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
19 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
20 hours ago

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
21 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
a day ago
ఇంకా