newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సీఏఏ హిందూ ముస్లిం సమస్య కాదు, దేశ సమస్య.. కేసీఆర్

17-03-202017-03-2020 13:07:43 IST
2020-03-17T07:37:43.926Z17-03-2020 2020-03-17T07:37:41.607Z - - 10-04-2021

సీఏఏ హిందూ ముస్లిం సమస్య కాదు, దేశ సమస్య.. కేసీఆర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పౌరసత్వ సవరణ చట్టంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు శాసనసభలో కీలక వ్యాఖ్యలు చేశారు. రాక్షసానందం పొందుతూ పౌర చట్టాన్ని అమలు చేయాల్సిన అవసరం లేదని కేంద్రానికి స్పష్టం చేశారు. సీఏఏకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో సోమవారం తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భిన్న స్వరూపం, వందల ఏళ్ల కాస్మోపాలిటిన్‌ కల్చర్‌, భిన్న సంస్కృతులకు ఆలవాలంగా ఉన్న తెలంగాణ సీఏఏపై స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. 

జాతీయ పౌరసత్వ చట్టంపై గత కొద్ది రోజులుగా అనేక వర్గాలు వారి వారి పద్ధతుల్లో నిరసనలు తెలియజేశాయని కేసీఆర్‌ గుర్తు చేశారు. సీఏఏపై పార్లమెంట్‌లో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం చెప్పామని అన్నారు. దేశంలో ఇప్పటికే ఏడు రాష్ట్రాలు.. కేరళ, పంజాబ్‌, పశ్చిమ బెంగాల్‌, రాజస్తాన్‌, ఛత్తీస్‌గఢ్‌, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌ సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేశాయని, తమది ఎనిమిదో రాష్ట్రమని సీఎం తెలిపారు. 

ఆందోళనలను సృష్టిస్తున్న సీఏఏని పునఃసమీక్షించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పీకర్‌ ద్వారా కేంద్రాన్ని కోరారు. సీఏఏను తాము గుడ్డిగా వ్యతిరేకించడం లేదని, అన్నీ అర్థం చేసుకొని పూర్తిగా ఈ బిల్లుని వ్యతిరేకిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడి ఢిల్లీ పర్యటన సందర్భంగా అనేక మంది  చనిపోయారని, కేంద్ర నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని ఆయన విమర్శించారు. ఈ దేశానికి సీఏఏ అవసరం లేదని కేసీఆర్‌ తేల్చిచెప్పారు.

‘సీఏఏ అమలు తప్ప దేశంలో వేరే సమస్యే లేదన్నట్టు, ఏదో కొంపలు మునిగినట్టు ఇదొక్కటే సమస్య అన్నట్టు కేంద్రం ప్రవర్తిస్తోంది. ఇది హిందూ ముస్లిం సమస్య కాదు, దేశ సమస్య. నాకే బర్త్ సర్టిఫికెట్ లేదని ఇదివరకే చెప్పాను. నా ఒక్కడి పరిస్థితి ఇలా అంటే దేశంలో అనేక మందికి ధ్రువీకరణ పత్రాలు లేవు. నిన్ను ఎవరు బర్త్ సెర్టిఫికెట్ అడిగారు అని నన్ను అంటున్నారు. ఒక్క మాట అడుగుతా సమాధానం చెప్తారా. ఓటర్ ఐడి, ఆధార్, రేషన్ కార్డ్ ఏవీ కూడా పని చేయవని అంటున్నారు. దేశంలో కోట్ల మందికి బర్త్ సర్టిఫికెట్ లేదు వారి పరిస్థితి ఏంటి. దీనికి కేంద్రం సమాధానం చెప్పాలి’ అని సీఎం పేర్కొన్నారు.

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని తెలంగాణ శాసనసభ సోమవారం ఆమోదించింది. తీర్మానంపై చర్చ అనంతరం శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. సోమవారం ఉదయం అసెంబ్లీ ప్రారంభంకాగానే సీఏఏపై తీర్మానం ప్రవేశపెట్టి సీఎం కేసీఆర్‌ చర్చను ప్రారంభించారు. అనంతరం అన్ని పార్టీల నేతలు తీర్మానంపై మాట్లాడారు.  

సీఏఏ వల్ల అన్యాయం జరిగిందని నిరూపిస్తే తెలంగాణ వదిలి వెళ్లిపోతా.. రాజాసింగ్ సవాల్

తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్‌ మోసం చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విమర్శించారు. సీఏఏను వ్యతిరేకిస్తూ సోమవారం తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఈ మేరకు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటన చేశారు. దీంతో ఆగ్రహించిన రాజాసింగ్‌ పాస్‌ చేసిన బిల్లు పేపర్లను చించివేస్తూ నిరసన తెలిపారు. రాజాసింగ్‌ మాట్లాడుతున్న సమయంలో స్పీకర్‌ మైక్‌ కట్‌ చేయడంతో సభ నుంచి వెళ్లిపోయారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ.. కేవలం ఎంఐఎం దృష్టిలో మంచి మార్కులు తెచ్చుకునేందుకే సీఏఏకు టీఆర్ఎస్ వ్యతిరేకంగా తీర్మానం చేసిందని ధ్వజమెత్తారు. సీఏఏ వల్ల ఎవరికైనా అన్యాయం జరుగుతుందని నిరూపిస్తే రాజీనామా చేసి, తెలంగాణ నుంచి వెళ్లిపోతానని ప్రకటించారు.

ఈ చట్టం వల్ల దేశంలోని మైనార్టీలకు సమస్య లేదని అమిత్‌షా తెలిపారని అన్నారు. ఎంఐఎం పార్టీని ఖుషీ చేయాలనే కేసీఆర్‌ ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో కర్ఫ్యూ తరహాలో భయానక వాతావరణం సృష్టించి సమగ్ర కుటుంబ సర్వే చేయించారని విమర్శించారు. తెలంగాణ వివరాలు కేంద్రానికి వెళ్లవద్దని కేసీఆర్‌ కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు.

‘‘ముఖ్యమంత్రికి ఇంత కూడా తెలివి లేదా. ఎన్నార్సీపై ఇంకా నిర్ణయం కాలేదు. దానిపైన కూడా వ్యతిరేకిస్తూ తీర్మానం చేసారు. దేశం అనాథాశ్రమం కాదు.1985లో రాజీవ్ ప్రధానిగా ఉన్నప్పుడే ఎన్నార్సీ తెచ్చారు. సీఏఏ.. ఎన్పీఆర్.. ఎన్ఆర్సీకి సబంధం లేదు. ఎంఐఎంకు గులాంగిరి చేసే విధంగా సీఎం వ్యవహరిస్తున్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాలు తిరిగి ప్రజలకు వాస్తవాలు తెలియ జేస్తాం. ప్రజలపై ఒత్తిడి తీసుకు వచ్చి తీర్మానాన్ని ఉపసంహరించుకునేలా చేస్తాం. ఈ తీర్మానం ఫాల్తూ రిజల్యూషన్. ఇది ఎందుకు పనికి రాని తీర్మానం.’’ అని టీఆర్‌ఎస్‌పై రాజాసింగ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   5 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   an hour ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   4 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   8 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   11 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   12 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   a day ago


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle