newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సీఏఏ, ఎన్నార్సీలపై భయం వద్దు.. వాటిపై చర్చిద్దాం

07-03-202007-03-2020 16:15:43 IST
2020-03-07T10:45:43.098Z07-03-2020 2020-03-07T10:45:36.465Z - - 10-04-2021

సీఏఏ, ఎన్నార్సీలపై భయం వద్దు.. వాటిపై చర్చిద్దాం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి సీఏఏ, ఎన్నార్సీ చట్టాలు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ శాసనసభలో వీటిపై స్పష్టమయిన ప్రకటన చేశారు. శాసనసభ సమావేశాల్లో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) పై విస్తృతంగా చర్చ జరగాలని సిఎం తెలిపారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా సిఎం కెసిఆర్‌ మాట్లాడారు. '' ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు సహజం.

పౌరసత్వ సవరణ చట్టం దేశాన్ని కుదిపేస్తోంది. సీఏఏ పై చర్చ ఒకరోజుతో అయ్యేది కాదు. సీఏఏపై చర్చ అంటే అంతర్జాతీయ స్థాయిలో దేశభవిష్యత్‌ గురించి మాట్లాడటమే. బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా తన వాదన వినిపించవచ్చు. సీఏఏ పై అందరి సభ్యులకు అవకాశం కల్పించాలని స్పీకర్‌ను కోరుతున్నా. సీఏఏపై ఎవరి అభిప్రాయం వారు వెల్లడించొచ్చు. సీఏఏ విషయంలో బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్‌ కూడా సవివరంగా మాట్లాడొచ్చు. ఒవైసీకి కూడా నేను ఇదే మాట చెబుతున్నా. సీఏఏ చాలా కీలకమైన అంశం, దీనిపై పూర్తిస్థాయిలో చర్చ జరగాలి’’ అన్నారు.

సీఏఏపై అన్ని పార్టీల వారికి అవకాశం ఇస్తాం. ఎన్ని గంటలయినా చర్చిద్దాం అన్నారు కేసీయార్. ఎన్పీఆర్‌, సీఏఏ విషయంలో ఏ పార్టీకి ఉండే అభిప్రాయాలు ఆ పార్టీకి ఉంటాయి. సీఏఏపై మేం ఇప్పటికే పార్లమెంట్‌లో వ్యతిరేకించాం. దేశవ్యాప్తంగా అయిదారు అసెంబ్లీల్లో చర్చ జరిగింది. రాష్ట్రాల అభిప్రాయాన్ని కేంద్రం అంగీకరిస్తుందా లేదా అన్నది తర్వాత చూడాలి. 40-50 మంది చనిపోయిన సీరియస్‌ అంశంపై కచ్చితంగా చర్చ జరగాలని అభిప్రాయపడుతున్నా. సభలో ఎవరు ఏం చెప్పినా విందాం..తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపేటప్పుడు చర్చ పెడదాం అన్నారు కేసీయార్. 

నాకు బర్త్ సర్టిఫికెట్ లేదు.. నా పరిస్థితే ఇలా వుంటే గిరిజనులు, ఆదివాసీల పరిస్థితి ఏంటి? దళితులు, పేదలకు ఎక్కడినుంచి వస్తుంది. సీఏఏపై రెండు మూడు గంటలైనా సభలో చర్చిద్దాం. సభ అంతిమ ఉద్దేశాన్ని కేంద్రానికి తెలియజేద్దాం. సీఏఏపై సభలో మాట్లాడాలని వందకు వంద శాతం సభలో తీర్మానం పెడదాం '' అని సిఎం కెసిఆర్‌ అన్నారు. తాము తప్పుని తప్పని ధైర్యంగా చెబుతాం అన్నారు.

సీఏఏ, ఎన్నార్సీ అంశాలను గవర్నర్ ప్రసంగంలో చేర్చకపోవడంపై ఏం జరిగి వుంటుందని కొంతమంది చర్చించుకోవడం కనిపించింది.  అసెంబ్లీలో తీర్మానానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి... గవర్నర్ ప్రసంగం ద్వారా ఈ విషయంలో కొత్త రాద్ధాంతం అవసరం లేదని సీఎం కేసీఆర్ భావించారని సమాచారం. ఇలా చేయడం వల్ల గవర్నర్ తమిళిసైకు అవకాశం ఇచ్చినట్టు అవుతుందని ఆయన అనుకుని ఉండొచ్చనే చర్చ కూడా జరుగుతోంది. మొత్తం మీద దేశవ్యాప్తంగా నడుస్తున్న సీఏఏ, ఎన్నార్సీ గురించి కేసీయార్ కూడా తనదైన రీతిలో స్పందించారు. 

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   6 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   2 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   5 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   9 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   12 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   13 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   a day ago


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle