newssting
BITING NEWS :
*ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌..రాష్ట్రపతి భవన్‌ లో విందుకు హాజరుకానున్న సీఎం కేసీఆర్‌ *రెండవ రోజు భారత్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పర్యటన *దేవరకొండలో మంత్రి కేటీఆర్‌ పర్యటన. పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేయనున్న కేటీఆర్‌ *తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎన్‌ ఎన్నికల్లో నేడు నామినేషన్ల స్వీకరణ * కుప్పంలో రెండోరోజు పర్యటించనున్న చంద్రబాబు* ఏపీ స్థానికల రిజర్వేషన్లపై తీర్పు వెల్లడించనున్న ఏపీ హైకోర్టు ఫాలో అప్ *వివేకా హత్యకేసుపై తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు *ఇవాళ హైదరాబాద్ హౌస్ లో మోదీతో ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు *ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ గా రామ్‌ నివాస్‌ గోయల్ ఏకగ్రీవ ఎన్నిక*అమరావతి: 70వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళనలు, మందడం, వెలగపూడి, తుళ్లూరులో రైతుల ధర్నాలు*వికారాబాద్: కొడంగల్ సమీపంలో రోడ్డు ప్రమాదం. బీజాపూర్ - హైదరాబాద్ హైవేపై కారును ఢీకొట్టిన లారీ. భార్యాభర్తలకు తీవ్రగాయాలు. హాస్పిటల్ కు తరలింపు*భారతీయ సినిమాలు గ్రేట్.. దిల్‌వాలే దుల్హనియా, షోలే చిత్రాలు గొప్పవి-డొనాల్డ్ ట్రంప్

సీఎం పీఠం మీద ఆశలేదన్న కేటీఆర్...

16-01-202016-01-2020 08:59:00 IST
2020-01-16T03:29:00.230Z16-01-2020 2020-01-16T03:28:57.831Z - - 25-02-2020

సీఎం పీఠం మీద ఆశలేదన్న కేటీఆర్...
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణకు కాబోయే కొత్త ముఖ్యమంత్రి కేటీఆర్.. సమర్ధుడు.. సత్తా ఉన్న నాయకుడు కేటీఆర్.. కేటీఆర్ సీఎం అయితే తప్పేంటి?.. స్వాతంత్య్రం తెచ్చిన నెహ్రు కుటుంబం దేశాన్ని పాలిస్తే.. రాష్ట్రాన్ని తెచ్చిన కేటీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని పాలిస్తే తప్పేముంది? సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రిగా కేటీఆర్ ను రంగంలోకి దించితే తామందరం మద్దతిస్తాం.. ఇవి గత నెల రోజులుగా మంత్రులు చెప్తున్న మాటలు.

ఆ మధ్య పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా ఇదే తరహా కథనాలు వచ్చాయి. కేసీఆర్ ఢిల్లీ రాజకీయాలకి వెళ్తూ కుమారుడిని పీఠం మీద కూర్చోబెట్టనున్నారని ఊహాగానాలొచ్చాయి. అప్పుడు ఫలితాలు.. పరిణామాలు అందరికీ తెలిసిందే. ఇక, ఇప్పుడు మరోసారి కేటీఆర్ సీఎం అంటూ ఏకంగా మంత్రులే పెద్ద ఎత్తున ఊహాగానాలను ఆస్కారం ఇచ్చేలా మీడియాకు స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు.

ఇప్పటికే కేటీఆర్ అదే మీడియాకు ఇప్పటిలో ఆ ఉద్దేశ్యం లేదని కొట్టిపారేస్తున్నా రోజుల వ్యవధిలో మళ్ళీ పార్టీలో ముఖ్య నేతలు.. లేదా మంత్రులు సీఎం సీఎం అంటూ భజనలు మాత్రం ఆగడం లేదు. ఈ కథనాలపై మంత్రి కేటీఆర్ మరోసారి స్పష్టం చేశారు. సంక్రాంతి పండగ రోజున కూడా తెలంగాణ నేతలు మున్సిపల్ పోరులో పడి తీరిక లేకుండా ఉన్న సంగతి తెలిసిందే.

ఈక్రమంలో కేటీఆర్ కూడా మున్సిపల్ అభ్యర్థులు.. నేతలతో సమావేశాలు.. సమీక్షలు నిర్వహించారు. ఇక ఓ టీవీ చానెల్ తో మాట్లాడిన కేటీఆర్ మరో పదేళ్లు సీఎం కావాలనే ఆశ తనకి లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా కావాలనుకుంటున్నారని.. ఆ ప్రజలలో ఒకడిగా నేను ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నా అన్నారు.

అంతేకాదు తనకు తొలి నుండి పెద్ద పెద్ద పదవుల మీద ఆశ లేదని ఇప్పుడు కూడా సీఎం కావాలన్న ఆశ లేదన్నారు. ఇక ప్రజలు నన్ను కోరుకుంటున్నారని చెప్పినా.. ఇంకెవరో డిమాండ్లు చేస్తున్నారని చెప్పినా అది కరెక్ట్ అని తాను అనుకోవడం లేదన్నారు. వచ్చే పది.. పదిహేనేళ్ల పాటు కేసీఆర్ నాయకత్వంలోనే తెరాస పనిచేస్తుందని, పరిపాలిస్తుందని చెప్పారు.

ఇంతవరకు బాగానే ఉన్నా.. మరి మంత్రులు పదేపదే ఎందుకు కేటీఆర్ సీఎం అయితే చూడాలని ఉందని భజన చేస్తున్నారు. కేటీఆర్ కూడా కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో పరిపాలన అంటున్నారు కానీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా పరిపాలిస్తారని తాజా వ్యాఖ్యలలో కూడా ఎందుకు చెప్పడం లేదు? సొంత పార్టీ మంత్రులే కాదు అంటున్నా ఎందుకు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు? ఇది కూడా ఎన్నికలలో భాగమా? లేక నిజంగానే ఫలితాల అనంతరం పట్టాభిషేకమేనా?!

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle