newssting
BITING NEWS :
పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో గురువారం ఉదయం సంభవించిన భూకంపం. పాకిస్థాన్ దేశంలోని ఇస్లామాబాద్ నగరానికి పశ్చిమాన 40 కిలోమీటర్ల దూరంలో ఉదయం 5.46 గంటలకు భూ ప్రకంపనలు. భూకంప ప్రభావం రిక్టర్ స్కేలుపై 4.3 అని సీస్మోలజీ శాస్త్రవేత్తల ప్రకటన. ఆఫ్ఘనిస్థాన్ దేశంలోని కాబూల్ నగరానికి ఈశాన్యంలోని 237 కిలోమీటర్ల దూరంలో ఉదయం 5.33 గంటలకు భూకంపం. రిక్టర్ స్కేలుపై 4.2గా నమోదు * గుజరాత్‌లో గురువారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం. సూరత్‌లోని హజీరా ఆధారిత ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) ప్లాంట్‌లో తెల్లవారుజామున 3:30 గంటలకు ప్రమాదం. ఓఎన్‌జీసీ ప్లాంట్‌లోని రెండు టెర్మినల్స్ వద్ద పేలుడుతో భారీ ఎత్తున చెలరేగిన మంటలు * ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాల్లో 12 వేల పందులను మట్టుబెట్టాలని అసోం ప్రభుత్వం ఆదేశం. ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూను అరికట్టే చర్యల్లో భాగంగా నిర్ణయం. పందులను చంపేందుకు యజమానులకు పరిహారం. రాష్టంలోని 14 జిల్లాలలో స్వైన్ ఫ్లూ ప్రభావం,స్వైన్ ప్లూ కారణంగా ఇప్పటి వరకూ రాష్ట్రంలో 18 వేలకు పైగా పశువులు మృతి * ముంబైలో మరోసారి రికార్డు స్థాయిలో వర్షాలు. సెప్టెంబర్‌ నెలలో ఇంతటి స్థాయిలో వర్షాలు కురవడం గత 26 ఏళ్లలో ఇది నాల్గోసారి. మంగళవారం, బుధవారం 24 గంటలలో ఏకంగా 286.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు. 1994 తర్వాత సెప్టెంబర్‌ నెలలో కురిసిన భారీ వర్షమిదే. 1974 నుంచి 2020 కాలంలో సెప్టెంబర్‌లో ఇంత భారీ వర్షం నమోదు కావడం ఇది నాల్గోసారి * ఢిల్లీలో కరోనా వైరస్ మరోసారి విజృంభణ. కరోనా బాధితులలో 11.55 శాతం మంది వెంటిలేటర్ సపోర్టుతో చికిత్స. కొద్దిరోజులుగా అంతకంతకూ పెరుగుతున్న ఢిల్లీలో వెంటిలేటర్‌పై ఉంటున్న రోగుల సంఖ్య. ఢిల్లీలో స్థానిక కోవిడ్ బాధితుల కోసం రిజర్వ్ చేసిన 62 శాతం వెంటిలేటర్ బెడ్లు ఫుల్ * కరోనాతో మృతి చెందిన కర్ణాటక బీజేపీ ఎంపీ, రైల్వే శాఖ సహాయ మంత్రి సురేశ్‌ అంగడి(65). మూడు రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఢిల్లీ ఎయిమ్స్‌ ఆసుపత్రి ట్రామా సెంటర్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన సురేష్ అంగడి. కరోనా వల్ల చనిపోయిన తొలి కేంద్ర మంత్రి ఈయనే * భద్రాద్రి కొత్తగూడెం చెన్నాపురం అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు. ముగ్గురు మావోయిస్టుల మృతి చెందగా అందులో ఇద్దరు మహిళలు. అయితే కాల్పులు జరిగిన ప్రదేశం నుండి రైఫిల్, పేలుడు సామాగ్రి స్వాధీనం చేసుకున్న పోలీసులు. మరికొంత మంది మావోయిస్టుల కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు * హైదరాబాద్ నగర శివారులో రోడ్డెక్కిన సిటీ బస్సులు. రాజేంద్రనగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, బండ్లగూడ శివారు ఆర్టీసీ డిపోల నుంచి బస్సు సర్వీసులు ప్రారంభం. ప్రతి డిపో నుంచి 12 బస్సులను నడుపుతున్న ఆర్టీసీ * కరోనాకు మరో ప్రముఖ నటుడు బలి. తెలుగు కమెడియన్ నటుడు కోసూరి వేణుగోపాల్ కరోనా కారణంగా కన్నుమూత. గత 22 రోజులుగా గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి. కరోనా నెగిటివ్ వచ్చాక కూడా అనారోగ్యం నుంచి కోలుకోలేకపోయిన కమెడియన్ * శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న భారీ వరద ప్రవాహం. జలాశయం 8 గేట్లను 10 అడుగుల మేర ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల * చిత్తూరు జిల్లాలోని కుప్పంలో ఏనుగులు బీభత్సం. పంట పొలాలకు కాపలాగా ఉన్న వారిపై ఏనుగులు దాడి. ఒకరు మృతి చెందగా మరికొందరికి గాయాలు. ఏనుగుల బీభత్సంతో భయాందోళనలు వ్యక్తం చేసున్న గ్రామస్థులు * పశ్చిమ మధ్యప్రదేశ్‌ పరిసరాల్లో కొనసాగుతున్న అల్పపీడనం. అల్పపీడనానికి అనుబంధంగా 5.8 కి.మీ ఎత్తున ఆవరించిన ఉపరితల ఆవర్తనం. గురు, శుక్రవారాలలో ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురిసే అవకాశం. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం.

సీఎం జగన్ కేసులు సబితా మంత్రి పదవికి ఎసరు?

13-01-202013-01-2020 10:39:16 IST
2020-01-13T05:09:16.045Z13-01-2020 2020-01-13T05:09:13.575Z - - 24-09-2020

సీఎం జగన్ కేసులు సబితా మంత్రి పదవికి ఎసరు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులలో అయనతో పాటు ప్రస్తుత వైసీపీలో ద్వితీయ స్థానంగా చెప్పుకుంటున్న విజయసాయి రెడ్డితో పాటు ఆ సమయంలో మంత్రులుగా ఉన్న ధర్మాన, సబితా ఇంద్రారెడ్డి తదితరులు, అప్పుడు వివిధ హోదాలలో ఉన్న ఐఏఎస్ అధికారులు కూడా ఉన్న సంగతి తెలుగు రాష్ట్రాల ప్రజలకి అందరికీ తెలిసిందే. ఈ కేసులలో ఐఏఎస్ శ్రీలక్ష్మి కొన్నాళ్ళు పాటు జైలులో కూడా ఉన్నారు.

కాగా తాజాగా సీఎం హోదాలో తొలిసారి సీఎం జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టుకి హాజరైన సమయం మంత్రి ధర్మానతో పాటు మరికొందరు కూడా హాజరయ్యారు. అయితే అప్పుడు ప్రస్తుతం తెలంగాణ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి మాత్రం విచారణకి హాజరుకాలేదు. కానీ జనవరి 17న జరిగే విచారణకు సబితా ఇంద్రారెడ్డి కూడా హాజరుకావాలని సిబిఐ కోర్టు ఇప్పటికే నోటీసులు జారీచేసింది.

తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ఉంటూ కోర్టు విచారణకు హాజరుకావడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో చర్చగా మారింది. అవినీతి కేసులలో విచారణ ఎదుర్కొనే వాళ్ళను క్యాబినెట్ లో కొనసాగిస్తారా? అంటూ ప్రతిపక్షాలు మాటల దాడికి దిగే అవకాశం ఉండడంతో ఇప్పుడు తెరాస పార్టీలో ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. గతంలో ఈ కేసులతో సబితా ఒకసారి మంత్రి పదవిని కోల్పోయారు.

సీఎం జగన్ ఆస్తులు కేసుల్లో పెన్నా సిమెంట్స్ కేసు కూడా ఒకటి. పెన్నా సిమెంట్స్ కి అనంతపురం జిల్లాలో కొన్ని భూములు, తాండూరు పరిధిలో కొన్ని గనులను లీజుకు ఇవ్వడంలో అవకతవకలు జరిగాయనీ మంత్రితోపాటు కొంతమంది అధికారులపై సీబీఐ ఛార్జ్ షీటు దాఖలు చేసింది. అప్పట్లో ఈ కేసు మీద కోర్టు విధించిన స్టే, ఈ మధ్యనే ఎత్తేయడంతో మళ్లీ విచారణకు వచ్చింది.

వైఎస్ మరణానంతరం కాంగ్రెస్ పార్టీలో జరిగిన పరిణామాల క్రమంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అయన హయంలో ఈ కేసుల కారణంగానే సబితా ఇంద్రారెడ్డిని మంత్రి పదవికి తొలగించారు. ఇప్పుడు కూడా అవినీతి ఆరోపణలలో ఓ మంత్రి కోర్టు విచారణకి హాజరవడం రాష్ట్రానికే అవమానమని డిమాండ్లు చేస్తూ ప్రతిపక్షాలు దాడులకు సిద్ధమవుతున్నాయి.

అధికార తెరాస పార్టీలో కూడా కొందరు తొలి నుండి పార్టీ కోసం పనిచేసి పదవులు దక్కని వాళ్ళు ఈ వ్యవహారాన్ని అడ్వాంటేజ్ గా మార్చుకొనే అవకాశం కనిపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా విచారణకి హాజరైనా అది ఆయన వ్యక్తిగత కేసు కాగా కేసులతో ఎలాంటి సంబంధం లేని తెరాస పార్టీకి ఎందుకు మచ్చ రావాలని.. ఆరోపణలు భరించాల్సిన అవసరం పార్టీకి లేదాని తెరాస పార్టీలో కొందరి వాదన. మరి సబితా ఈ వివాదాన్ని ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి!

 

అవినీతి తిమింగలం.. చెట్లకు నీరు పోసేవాడు కూడా బినామీనే..

అవినీతి తిమింగలం.. చెట్లకు నీరు పోసేవాడు కూడా బినామీనే..

   35 minutes ago


రెండుసార్లు శ్రీవారిని దర్శించుకున్న సీఎం.. ఆశ్చర్యపోతున్న భక్తులు

రెండుసార్లు శ్రీవారిని దర్శించుకున్న సీఎం.. ఆశ్చర్యపోతున్న భక్తులు

   3 hours ago


టెస్టింగ్, ట్రేసింగ్ ఇదేనా మంత్రం – కరోనా కట్టడిపై మోడీ సర్కార్ నిస్సహాయత

టెస్టింగ్, ట్రేసింగ్ ఇదేనా మంత్రం – కరోనా కట్టడిపై మోడీ సర్కార్ నిస్సహాయత

   3 hours ago


కర్ణాటక ఎమ్మెల్యేల జీతాల తగ్గింపు.. మరి మిగతా రాష్ట్రాల సంగతేమిటి?

కర్ణాటక ఎమ్మెల్యేల జీతాల తగ్గింపు.. మరి మిగతా రాష్ట్రాల సంగతేమిటి?

   5 hours ago


మోదీ-షాల‌కు కొడాలి కౌంట‌ర్‌...  ఇంత ధైర్యం ఎలా వ‌చ్చింద‌బ్బా?

మోదీ-షాల‌కు కొడాలి కౌంట‌ర్‌... ఇంత ధైర్యం ఎలా వ‌చ్చింద‌బ్బా?

   5 hours ago


వ్యవసాయ బిల్లులపై ఎవరికి లాభం.. ఎవరికి నష్టం..?

వ్యవసాయ బిల్లులపై ఎవరికి లాభం.. ఎవరికి నష్టం..?

   6 hours ago


పొలిటికల్ ఎంట్రీ పై స్పందించిన పీపుల్ స్టార్.!

పొలిటికల్ ఎంట్రీ పై స్పందించిన పీపుల్ స్టార్.!

   7 hours ago


ఇంటినుంచి పనే భేషుగ్గా ఉంది... హైదరాబాద్ ఐటీ ఉద్యోగులు

ఇంటినుంచి పనే భేషుగ్గా ఉంది... హైదరాబాద్ ఐటీ ఉద్యోగులు

   9 hours ago


ఏపీలో తగ్గుతున్న కేసులు.. పెరుగుతున్న రికవరీ రేటు

ఏపీలో తగ్గుతున్న కేసులు.. పెరుగుతున్న రికవరీ రేటు

   9 hours ago


ఇంటర్ సిలబస్ కుదింపు ఉంది.. లేదు.. తెలంగాణ బోర్డు గందరగోళం

ఇంటర్ సిలబస్ కుదింపు ఉంది.. లేదు.. తెలంగాణ బోర్డు గందరగోళం

   10 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle