newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సీఎం కేసీయార్ తీరుపై గాంధీ ఆస్పత్రి డాక్టర్ కామెంట్స్ వైరల్

09-07-202009-07-2020 20:08:28 IST
Updated On 10-07-2020 13:23:59 ISTUpdated On 10-07-20202020-07-09T14:38:28.933Z09-07-2020 2020-07-09T14:38:23.309Z - 2020-07-10T07:53:59.344Z - 10-07-2020

సీఎం కేసీయార్ తీరుపై గాంధీ ఆస్పత్రి డాక్టర్ కామెంట్స్ వైరల్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రత భయాందోళనలకు గురిచేస్తోంది. రోజూ రెండువేల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. సీఎం కేసీయార్ తీరుపై గాంధీ ఆస్పత్రి వైద్యురాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు కరోనా వల్ల సాధారణ ప్రజలు చనిపోతుంటే ప్రభుత్వం పాత సచివాలయం కూల్చివేయడం ఏంటని, అంత కొంపలేం మునిగిపోయాయని ... ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏంటని గాంధీ వైద్యురాలు విజయలక్ష్మి తీవ్రంగా ప్రశ్నించారు.

పాత సచివాలయాన్ని చక్కగా కరోనా పేషెంట్ల కోసం ఉపయోగించుకొని ఉంటే, అక్కడ కనీసం పది వేల వరకూ పడకలు ఏర్పాటుచేసి చక్కని వసతిగా ఉండేదని అన్నారు. కరోనా వల్ల విధించాల్సి వచ్చిన లాక్ డౌన్ ప్రభావంతో నిన్నమొన్నటి వరకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెబుతూ వచ్చిన ప్రభుత్వం అంత ఖర్చు పెట్టి కొత్త సచివాలయాన్ని ఎలా నిర్మించతలపెట్టిందని ప్రశ్నించారు. సచివాలయం వాస్తు బాగోలేకపోతే కేసీఆర్ ముఖ్యమంత్రి ఎలా అయ్యారని ప్రశ్నించారు.

అంతేకాక, తొలిసారి కేంద్రం నుంచి బృందం వస్తే కరోనా కట్టడికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించినప్పుడు గచ్చిబౌలి టిమ్స్‌ ఆస్పత్రిని గొప్పగా చూపారని, కానీ దాన్ని ఎందుకు వాడుకోవడంలేదని ఆమె ప్రశ్నించారు. కరోనా వచ్చిన కొందరు ప్రజాప్రతినిధులు ప్రైవేటు హస్పిటల్స్‌కు వెళుతున్నారని, ప్రైవేటుపై వున్న భరోసా, గాంధీ ఆస్పత్రిపై ఎందుకులేదన్నారు. ఈ వైద్యురాలు గత నెలలోనూ ప్రభుత్వ తీరును విమర్శిస్తూ ఓ వీడియో చేశారు. గత మూడు నెలలుగా కరోనా పేషెంట్లకు చికిత్స అందిస్తుండటంతో.. గాంధీ హాస్పిటల్‌లో పని చేసే డాక్టర్లపై తీవ్ర ఒత్తిడి పడుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

గాంధీ డాక్టర్లపై పని ఒత్తిడి తగ్గించాలని ప్రభుత్వానికి ఆమె సూచించారు. కరోనా టెస్టులు పెంచాలని చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, సీఎం కరోనా వైరస్ వ్యాప్తిని సీరియస్ గా తీసుకోవడం లేదని ఆమె విమర్శించారు. ఈ మేరకు ఆమె ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. దీంతో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. 

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   5 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   6 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   5 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   9 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   11 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   9 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   11 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   12 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   7 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   13 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle