newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సీఎం కేసీయార్ ఆరోగ్యంపై పిటిషన్... హైకోర్టు ఫైర్

11-07-202011-07-2020 10:40:09 IST
Updated On 11-07-2020 11:39:57 ISTUpdated On 11-07-20202020-07-11T05:10:09.495Z11-07-2020 2020-07-11T05:09:57.877Z - 2020-07-11T06:09:57.834Z - 11-07-2020

సీఎం కేసీయార్ ఆరోగ్యంపై పిటిషన్... హైకోర్టు ఫైర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో కరోనా కేసులు పెరిగిపోవడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. తాజాగా సీఎం కేసీయార్ ఎర్రవల్లి ఫాంహౌస్ కు వెళ్లిపోయారు. కేసీయార్ ఎక్కడ అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.  ఈనేపథ్యంలో కేసీయార్ ఆరోగ్యంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే ఈ పిటిషన్ పై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

రాజకీయ జిమ్మిక్కులకు హైకోర్టును వేదికగా మారనివ్వబోమని హైకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పింది. సీఎం కేసీఆర్‌ ఆరోగ్య వివరాలు కోరుతూ నవీన్‌కుమార్‌ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణకు హైకోర్టు నిరాకరించింది. శుక్రవారం ఉద యం కేసుల ప్రస్తావన సమయంలో తాము 8వ తేదీన పిటిషన్‌ దాఖలు చేశామని, ఇంకా విచారణకు రాలేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. 

ఈ పిటిషన్‌ను లంచ్‌ మోషన్‌లో విచారణకు స్వీకరించాలని చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ బీ విజయ్‌సేన్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. ‘ముఖ్యమంత్రి ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి. ఆయన ఆరోగ్యం గురించిన ఏదైనా సమాచారం ఉంటే అధికార వర్గాలు సమయానుగుణంగా తెలియజేస్తాయి.

ఈ అంశంలో అత్యవసరం ఏమున్నది? ’ అని ప్రశ్నించింది. ‘నా కోర్టును రాజకీయ జిమ్మిక్కులకు వేదిక కానివ్వను. ప్రస్తుతం అత్యవసర కేసులు నిబంధనల ప్రకారం లిస్ట్‌ అయితేనే విచారణ చేపడతాం’ అని చీఫ్‌ జస్టిస్‌ ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రి కనిపించక పోతే హెబియస్ కార్పస్ ధాఖలు చేసుకోవాలని పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది. సీఎం కేసీఆర్‌ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నవీన్‌కుమార్‌పై నారాయణపేట జిల్లా కోటకొండ గ్రామానికి చెందిన కావలి వెంకటేశ్‌ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నవీన్‌కుమార్‌ ఓ యూట్యూబ్‌ చానల్‌ను ప్రారంభించి ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌పై, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు.

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle