newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సీఎం కేసీయార్‌కు మాజీ ఎంపీ వీహెచ్ లేఖ

27-07-202027-07-2020 09:16:12 IST
Updated On 27-07-2020 09:22:42 ISTUpdated On 27-07-20202020-07-27T03:46:12.250Z27-07-2020 2020-07-27T03:46:01.582Z - 2020-07-27T03:52:42.315Z - 27-07-2020

సీఎం కేసీయార్‌కు మాజీ ఎంపీ వీహెచ్ లేఖ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో కరోనా కేసులు ఉధృతంగా వున్నాయి. ప్రభుత్వం కట్టడి చర్యలు చేపట్టినా కేసులు పెరుగుతూనే వున్నాయి. తాజాగా సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు లేఖ రాశారు. కాంట్రాక్ట్‌ వైద్యులు, నర్సులను ప్రభుత్వం రెగ్యులరైజ్‌ చేయాలని వీహెచ్‌ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో భారీగా వైద్యులు, నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్ల ఖాళీలున్నాయని, కొత్తగా నియామాకాలు చేసే అంశంపై ప్రభుత్వం పునరాలోచించాలని సూచించారు.

గడిచిన అయిదేళ్లుగా రాష్ట్రంలో పని చేస్తున్న వేల సంఖ్యలో వైద్యులు, నర్సులు, ల్యాబ్‌ టెక్నిషియన్ల గురించి ప్రభుత్వం ఆలోచించాలని కోరారు. ఆ వైద్యులు, నర్సులు, ల్యాబ్‌ టెక్నిషియన్లు పూర్తి స్థాయిలో అనుభవం సంపాదించారని చెప్పారు. కరోనా వ్యాప్తి నివారణ నిమిత్తం చేపట్టే కార్యక్రమాలల్లో చురుగ్గా పాల్గొంటూ సమర్ధవంతంగా పని చేస్తున్నారని వారి సేవలను వీహెచ్ కొనియాడారు. 

రాష్ట్రంలో కొత్తగా నియామకాలు చేపట్టే బదులు.. ఇప్పటికే కాంట్రాక్ట విధానంలో పని చేస్తున్న వేలాది మంది క్రమబద్దీకరణకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద చూపాలన్నారు. కేసీఆర్‌, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌లు ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించాలని వీహెచ్ కోరారు. ఇటీవల గాంధీ ఆస్పత్రిలో వేలాదిమంది ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు నర్సులు, డాక్టర్లు, శానిటేషన్ సిబ్బంది ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. హనుమంతరావు ఈమధ్యే కరోనా వైరస్ బారిన పడి చికిత్స తీసుకుని కోలుకున్నారు. 

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   10 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   15 hours ago


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   12 hours ago


సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

   16 hours ago


కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

   14 hours ago


కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

కరోనా వల్ల తెలంగాణ మాజీ మంత్రి కన్నుమూత

   18 hours ago


ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

   18 hours ago


తిరుప‌తిలో  ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

తిరుప‌తిలో ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

   20 hours ago


ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

ష‌ర్మిల ప‌క్క‌నే విజ‌య‌మ్మ‌.. లాభ‌మా న‌ష్ట‌మా

   16 hours ago


ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   21 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle