newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సీఎం కేసీయార్‌కు ఎంపీ కోమటిరెడ్డి లేఖ

25-06-202025-06-2020 09:18:59 IST
Updated On 25-06-2020 11:08:39 ISTUpdated On 25-06-20202020-06-25T03:48:59.499Z25-06-2020 2020-06-25T03:47:05.551Z - 2020-06-25T05:38:39.953Z - 25-06-2020

సీఎం కేసీయార్‌కు ఎంపీ కోమటిరెడ్డి లేఖ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సిఎం కెసిఆర్‌ ‌కు లేఖ రాశారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి . ఎస్ఎల్బీసీ పనుల పెండింగ్‌తో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. ఎస్‌ఎల్బీసీ ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు మరో సంస్థకు కాంట్రాక్ట్ ఇవ్వాలన్నారు. ఉదయ సముద్రం ప్రాజెక్ట్‌ని త్వరగా పూర్తి చేయాలని కోమటిరెడ్డి లేఖలో కోరారు. బ్రహ్మణవెల్లంల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పూర్తయినా.. నిధులు లేక 6 కిలోమీటర్ల కాల్వల పనులు ఇంకా పూర్తి కాలేదన్నారు. జిల్లాలో పెండింగ్‌ ప్రాజెక్ట్‌ల పూర్తికి నిధులు కేటాయించాలని ఎంపీ కోమటిరెడ్డి తెలిపారు. 

ఎస్.ఎల్.బి.సి, ఉదయ సముద్రం ప్రాజెక్టుల పనితీరు గురించి ఎంపీ లేఖలో ప్రశ్నించారు. నల్గొండ ప్రగతి కోసం ఆనాటి సీఎం వైఎస్ ను ఒప్పించి ఎస్.ఎల్.బి.సి  ప్రాజెక్ట్ ను 2004 లో స్టార్ట్ చేశామని గుర్తు చేశారు. 13-08-2004 న పనులను జై ప్రకాష్ అనే సంస్థకు అప్పగించడం జరిగిందని..  సొరంగ మార్గం 44 కిలోమీటర్లు ఉంటే జై ప్రకాష్ అనే సంస్థ ఇప్పటి వరకు 15 ఏళ్లు పూర్తయినా 34 కిలోమీటర్లు మాత్రమే పూర్తి చేయగలిగిందన్నారు.  గుజరాత్ లోని సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ ని వారు నిర్మించారు… ఆ సంస్థకు మంచి పేరు ఉంది కాని..  ఇప్పుడు ఆ ఏజెన్సీ కష్టాల్లో ఉంది.. జై ప్రకాష్ సంస్థ సంక్షేభంలో కూరుకుపోయింది.

ప్రభుత్వం ఆ సంస్థకు ఎన్నిసార్లు అడ్వాన్స్ లు ఇచ్చినా పనులు చేయలేకపోతోందని ఎంపీ లేఖలో పేర్కొన్నారు. 44 కిలోమీటర్ల టన్నెల్ లో ఇంకా 10 కిలోమీటర్లు పని పెండింగ్ లో ఉంది. ఏజెన్సీ వైఫల్యం వల్లే జిల్లా ప్రజలు శ్రీశైలం రిజర్వాయర్ నుండి పూర్తి స్థాయిలో నీటిని ఉపయోగించుకోలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్.ఎల్.బి.సి పూర్తి కాక నల్గొండ ప్రజలు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కోమటిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ పనులను ఇప్పుడు ఉన్న సంస్థ కు కాకుండా వేరే గుర్తింపు పొందిన సంస్థకు ఇవ్వాలని కోమటిరెడ్డి కోరారు. దీని వల్ల ఎస్.ఎల్.బి.సి పెండింగ్ పనులు పూర్తి అయ్యి నల్గొండ జిల్లా ప్రజల సాగునీరు,తాగు నీరు సమస్య పరిష్కారామవుతుందని.. నల్లగొండ జిల్లా ససశ్యామలం అవుతుందని కోమటిరెడ్డి పేర్కొన్నారు.

అదేవిధంగా ఉదయ సముద్రం ప్రాజెక్ట్ ని త్వరగా పూర్తి చేయాలని ఆయన కోరారు. కరువు , ప్లోరైడ్ పీడిత ప్రాంతంగా ఉన్న నల్లగొండ జిల్లా ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ ని ఒప్పించి  ఈ ప్రాజెక్ట్ ని ప్రారంభించామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గుర్తు చేశారు. ఈ ప్రాజెక్ట్ తో నల్లగొండ, మునుగోడు , నకిరేకల్ నియోజకవర్గాల నీరు అందుతుంది.. బ్రహ్మణ వెల్లంల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పూర్తి అయింది… అయితే 6 కిలోమీటర్ల కాల్వల పనులు ఇంకా పూర్తి కాలేదు.. కాల్వల పనులు పూర్తి కాకపోవడంతో నీళ్లు వదలడం లేదు.

ఆర్థిక ఇబ్బంది కారణంగా 6 నెలల నుండి పనులు జరగటం లేదని తెలిపారు. ఇప్పటికి 4 కిలోమీటర్ల కాల్వల పనులు మాత్రమే పూర్తి అయ్యాయి.. సీఎం కేసీఆర్ వెంటనే జోక్యం చేసుకుని.. ఉదయ సముద్రం ప్రాజెక్ట్ ని త్వరగా పూర్తి చేయాలని.. ఈ ప్రాజెక్ట్ లో జాయింట్ వెంచర్ గా ఉన్న మెగా సంస్థకు పనులు అప్పగిస్తే పనులు వేగమంతం అవుతాయని ..  కాబట్టి వెంటనే  ఈ  ప్రాజెక్ట్ పనులను కూడా  పూర్తి చేసి నల్లగొండ, మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గాలకు నీటిని అందించాలని కోమటిరెడ్డి లేఖలో కోరారు. తన లేఖపట్ల వెంటనే స్పందించాలని ఎంపీ పేర్కొన్నారు. 

 

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

   39 minutes ago


తిరుపతి పార్లమెంట్  ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

   an hour ago


తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

   4 hours ago


మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

   2 hours ago


స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

   5 hours ago


టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   19 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   a day ago


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   20 hours ago


సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

సాక్షిపై సెటైర్లు వేసిన షర్మిల.. సముదాయించిన విజయమ్మ

   16-04-2021


కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

కొనసాగుతున్న షర్మిల దీక్ష.. ప్రభావం చూపేనా..!

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle