newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సీఎం కేసీఆర్ ముందు హల్చల్.. ఎవరా యువకుడు?

03-06-202003-06-2020 07:02:15 IST
Updated On 03-06-2020 08:52:49 ISTUpdated On 03-06-20202020-06-03T01:32:15.428Z03-06-2020 2020-06-03T01:32:12.925Z - 2020-06-03T03:22:49.705Z - 03-06-2020

సీఎం కేసీఆర్ ముందు హల్చల్.. ఎవరా యువకుడు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. ఆ కార్యక్రమాలకు వెళ్లి వస్తున్న సీఎం కేసీఆర్ కాన్వాయ్ ను అడ్డుకున్న ఓ యువకుడు. సీఎం కాన్వాయ్ అంటే సామాన్య విషయం కాదు. హైలెవల్ సెక్యూరిటీ కేసీఆర్ కాన్వాయ్ సొంతం. అసలే ఒకపక్క కరోనా నిబంధనలతో పోలీసులు మరింత పగడ్బంధీగా ఉన్నారు. కానీ ఓ యువకుడు వీటన్నిటికీ దాటుకొని సీఎం కాన్వాయ్ ముందు హల్చల్ చేశాడు.

సీఎం కేసీఆర్ మంగళవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున అమ‌ర‌వీరుల‌కు నివాళి అర్పించి తిరిగి వెళ్లేందుకు కారు ఎక్కారు. పక్కనే పెద్దగా జై తెలంగాణ అంటూ నినాదాలు చేస్తూ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఎక్కడ అంటూ నినాదాలు చేశాడు. దీంతో పోలీసులు అత‌న్ని అదుపులోకి తీసుకున్నారు. అసలే ఆవిర్భావ దినోత్సవం, పైగా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించాలని నినాదాలతో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.

అయితే, ఇంతకీ ఎవరా యువకుడు? ఎక్కడ నుండి వచ్చాడు? అంత సెక్యూరిటీని తప్పించుకొని అక్కడ వరకు ఎలా వెళ్ళాడు? నినాదాలు ఎందుకు చేయాల్సి వచ్చింది అనే ఆరాలు మొదలమయ్యాయి. ఆ యువ‌కుడు న‌ల్గొండ జిల్లా దేవ‌ర‌కొండ‌కు చెందిన వ్య‌క్తిగా తెలుస్తోంది. దేవ‌ర‌కొండ మ‌ల్లేప‌ల్లి వ‌ద్ద చింత‌చెట్టు తండాకు చెందిన‌ 27 సంవ‌త్స‌రాల‌ జ‌క్కుల హ‌న్మంతు నాయ‌క్ గా పోలీసులు గుర్తించారు.

హన్మంతు తండ్రి హాస్లా జీహెచ్ఎంసీలోని డిజాస్ట‌ర్ మేనేజ్మెంట్ లో ప‌నిచేస్తుండగా యువకుడు చిన్నా చితకా పనులు చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు. తనకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కావాలని సీఎం కేసీఆర్ దృష్టిలో పడేందుకు ఈ ఘటనను సిద్ధమయ్యామని పోలీసులతో చెప్పినట్లుగా తెలుస్తుంది. ఆవిర్భావ దినోత్సవం రోజునైతేనే ఖచ్చితంగా సీఎం దృష్టికి వెళ్తుందని ఇందుకు సిద్దపడ్డాడట.

మరి ఘటన తర్వాత యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని వదిలిపెట్టారా లేదా అన్నది స్పష్టత లేకపోగా ప్రతిపక్షాలకు ఇది ఓ విమర్శనాస్త్రంగా మారింది. డబుల్ బెడ్ రూమ్ హామీ ఇచ్చి ఆరేళ్ళు గడిచినా ఇప్పటికీ ఇంకా హామీ అమలు చేయలేదని అందుకే సామాన్య ప్రజలు తిరగబడుతున్నారని ప్రతిపక్షాలు విమర్శలకు దిగుతున్నాయి.

తిరగబడిన ప్రజలను అధికారంతో అణచివేయడం టీఆర్ఎస్ పార్టీకి అలవాటుగా మారిందని.. రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఎంతమందికి ఇచ్చారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఆవిర్భావ దినోత్సవం రోజున రాష్ట్రంలో ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శలు దిగాయి. కేసీఆర్ అహంకారపూరిత, స్వార్థపూరిత రాజకీయాలకు సమాధి కట్టేందుకు ప్రజల పక్షాన పోరాడుదామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పిలుపిచ్చారు.

అమరుల ఆశయాలను నెరవేర్చేలా బిజెపి మలిదశ ఉద్యమం చేపట్టబోతోందని సంజయ్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోగా పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఏ చట్టం ప్రకారం కాంగ్రెస్‌ నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేశారని ఉత్తమ్ ప్రశ్నించారు. పోలీసులను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు.. ఆధారాలు చూపమంటే పైనుంచి ఆదేశాలు అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున రాజకీయాల నడుమే అమరవీరులకు నివాళి సమర్పణ జరిగింది.

 

 

 

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   10 minutes ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   an hour ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   2 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   3 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   4 hours ago


కేటీఆర్ కి అంత సీన్ లేదులే

కేటీఆర్ కి అంత సీన్ లేదులే

   6 hours ago


పెద్ద నాయకుడికి ఇబ్బందులు అంటూ స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు..!

పెద్ద నాయకుడికి ఇబ్బందులు అంటూ స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు..!

   6 hours ago


కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ

   21 hours ago


వివేకానంద రెడ్డి హత్యపై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!

వివేకానంద రెడ్డి హత్యపై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!

   21 hours ago


ఆ వీడియో వార్తలపై అచ్చెన్న ఫైర్..!

ఆ వీడియో వార్తలపై అచ్చెన్న ఫైర్..!

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle