newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సీఎం కేసీఆర్ మరో యాగం.. ముహూర్తం ఫిక్స్!

28-05-202028-05-2020 07:57:30 IST
Updated On 28-05-2020 09:21:12 ISTUpdated On 28-05-20202020-05-28T02:27:30.735Z28-05-2020 2020-05-28T02:27:28.743Z - 2020-05-28T03:51:12.807Z - 28-05-2020

సీఎం కేసీఆర్ మరో యాగం.. ముహూర్తం ఫిక్స్!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ సీఎం కేసీఆర్ హిందూ ఆచారాలు, సంప్రదాయాలు ఎంతగా పాటిస్తారో అందరికీ తెలిసిందే. అయన ఏదైనా ముఖ్యమైన పని చేయాలని తలిస్తే ముందుగా యజ్ఞాలు, యాగాలు నిర్వహించి పనిని మొదలు పెడతారని కూడా పేరుంది. ఇంకా చెప్పాలంటే కేసీఆర్ ఏ పని చేయాలని అనుకున్నా ముందుగా ముహుర్తాలు చూసుకొని మాత్రమే ఆ పని మొదలుపెడతారని కూడా రాజకీయ వర్గాలలో ప్రచారం ఒకటి ఉంది.

ఇప్పటికే అయన ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఎన్నో యజ్ఞాలు, యాగాలు నిర్వహించగా త్వరలోనే మరో భారీ యాగానికి శ్రీకారం చుట్టనున్నారని గత కొన్నాళ్ళుగా ప్రచారం జరుగుతుంది. నిజానికి కేసీఆర్ యాదాద్రి గుడి ఆధునీకరణ అనంతరం భారీ స్థాయిలో యాగాన్ని నిర్వహించాలని.. అందుకు ఇతర రాష్ట్రాల నుండి కూడా ముఖ్యులను ఆహ్వానించాలని కూడా తలచారు.

కానీ కరోనా లాక్ డౌన్ కారణంగా ఆలయ అభివృద్ధి పనులకు కొన్నాళ్ళు బ్రేక్ పడగా మరికొన్నాళ్లు జాప్యం జరుగుతుంది. ఈక్రమంలో ఆలయ అభివృద్ధి పూర్తయ్యేవరకు చాలా సమయం పడుతుంది కనుక ఈలోగా మరో యాగాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లుగా చెప్తున్నారు. అందుకే శుక్రవారం జరుగనున్న కొండపోచమ్మ సాగర్ ప్రారంభాన్నే యాగానికి ముహూర్తంగా పెట్టుకున్నట్లుగా తెలిసింది.

సీఎం కేసీఆర్ యాగాలు, యజ్ఞాలు నిర్వహించే ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి అతి చేరుకోవలోనే ఈ కొండపోచమ్మ సాగర్ కూడా ఉంది. అందుకే కేసీఆర్ బృందం యాగానికి పూనుకున్నట్లుగా తెలుస్తుంది. కాగా ఇప్పటికే గోదావరి జలాలు కొండపోచమ్మ సాగర్ కు వచ్చి చేరుతున్నాయి. శుక్రవారం ఉదయం పది గంటలకు ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు.

సాగర్ ప్రారంభానికి ముందుగానే అదే రోజు ఉద‌యం 7గంట‌ల‌కు పోచ‌మ్మ ఆల‌యంలో  మూడు యాగాలు చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఛండీయాగం, సుద‌ర్శ‌న‌యాగంతో పాటు గంగ‌మ్మ పూజ‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఛండీయాగం పుర్ణాహుతిలో కేసీఆర్ స‌తీస‌మేతంగా పాల్గొంటార‌ని తెలుస్తుండగా.. ఈ యాగాలను చినజీయర్ స్వామి పర్యవేక్షించనున్నారని చెప్తున్నారు.

కాగా సాగర్ ప్రారంభానికి ముందే శుక్ర‌వారం ఉద‌యం ఎర్ర‌వ‌ల్లి, మ‌ర్కూర్ మండ‌ల కేంద్రంలో రైతు వేదిక‌ల్లో పాల్గొననున్న సీఎం కేసీఆర్ అక్కడ రైతులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ కార్యక్రమం అనంతరమే ప్రాజెక్ట్ ప్రారంభం ఉండనుందట. మొత్తంగా శుక్రవారం రోజున సీఎం అటు యాగాలు, ప్రారంభాలు, రైతులతో కార్యక్రమాలతో బిజీగా ఉండనున్నారు.

కాగా, ఇక కేసీఆర్ ఇప్పటికే ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో రాజశ్యామల యాగం, చతుర్వేద పురస్సర మహారుద్ర సహిత సహస్ర చండీయాగం, చండీసహిత రుద్ర హోమం, చతుర్వేద పారాయణం, యాగశాల ప్రదక్షిణ , గోపూజ, గురుపూజ, నవగ్రహ పూజ, సప్తశతి చండీ పారాయణాలు, సహప్ర చండీ యాగం, చతుర్వేద మహాయాగం, సప్తశతి యాగం, రుద్ర మహాయాగం వంటి కార్యక్రమాలను నిర్వహించారు.

అందుకోసం ఇతర రాష్ట్రాల నుండి కూడా రుత్వికులు, పురోహితులను పిలిపించారు. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి పర్యవేక్షణలో, జగద్గురు శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థ తదితరులు అప్పుడు ఆ యాగాలను నిర్వహించారు. అయితే ఈసారి ఈ యాగాలను చినజీయర్ స్వామి నిర్వహించనున్నారని తెలుస్తుంది. ఇప్పటికే దీని కోసం కేసీఆర్ చినజీయర్ ను కలిశారు.

బుధవారం సాయంత్రం శంషాబాద్‌లోని ముచ్చింతల్‌ ఆశ్రమానికి వెళ్లిన సీఎం కేసీఆర్ కొండపోచమ్మ సాగర్ జలాశయం ప్రారంభోత్సవానికి చినజీయర్ స్వామిని ఆహ్వానించారు. యాదాద్రిలో జరపాలని అనుకున్న యాగాలను ఈయనతో జరిపించనున్నారని అప్పుడే వినిపించింది. కానీ అది ఆలస్యమవుతుండగా ఇప్పుడు ఈ యాగాల నిర్వహణను జీయర్ స్వామికి అప్పగించినట్లుగా కనిపిస్తుంది.

 

 

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

   an hour ago


తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

   an hour ago


తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

   2 hours ago


తిరుపతి పార్లమెంట్  ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

   2 hours ago


తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

   5 hours ago


మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

   4 hours ago


hi Prends.. ఎలా ఉన్నారు. ఊరికే చేశా.. స‌రే Prends ఉంటా

hi Prends.. ఎలా ఉన్నారు. ఊరికే చేశా.. స‌రే Prends ఉంటా

   17 minutes ago


స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

   7 hours ago


టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   20 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   16-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle