newssting
BITING NEWS :
*కరోనా కట్టడిలో అన్ని వర్గాల కృషిని ప్రశంసించిన ప్రధాని మోడీ. మన్ కీ బాత్ లో పలు అంశాలను ప్రస్తావించిన మోడీ ఆత్మనిర్భర భారత్ ద్వారా ఆర్థికవ్యవస్థకు ఊతం *తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా 74, మరణాలు 77, మొత్తం కేసులు 2499 * జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం*మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 వ తేదీ నుంచి పునఃప్రారంభం..కర్ఫ్యూ సమయం కుదింపు..దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ*ఆదివారం మన్ కీ బాత్ లో పలు వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోడీ * మాల్స్, రెస్టారెంట్ల, దేవాలయాలు, చర్చిలు జూన్ 8 నుంచి ప్రారంభం *పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు ప్రారంభంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం *విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం*నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామక ఉత్తర్వులు వెనక్కి *ఏపీలో మొత్తం కేసులు 3461

సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్స్.. హోంమంత్రి మిస్సింగ్!

12-04-202012-04-2020 13:13:50 IST
Updated On 12-04-2020 13:29:16 ISTUpdated On 12-04-20202020-04-12T07:43:50.034Z12-04-2020 2020-04-12T07:43:38.588Z - 2020-04-12T07:59:16.298Z - 12-04-2020

సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్స్.. హోంమంత్రి మిస్సింగ్!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ రాజకీయాలలో ప్రస్తుతం హోంమంత్రి మహమూద్ అలీ హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. దీనికి కారణం సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్స్ లో వైద్యారోగ్య మంత్రి ఈటల, వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి లాంటి వాళ్ళతో సహా ముఖ్యనేతలు మాత్రమే ఉంటున్నారు కానీ హోంమంత్రి మహమూద్ అలీ కనిపించడం లేదు. మహమూద్ మిస్సింగ్ కారణాలేంటి? అంటూ ఇప్పుడు రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతుంది.

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతానికి ఎలాంటి రాజకీయ దుమారాలు లేవు. ప్రత్యర్థి పార్టీలు కూడా కరోనా సమయం కనుక రాజకీయాలు వద్దనుకున్నాయో లేక కరోనా వంక దొరికిందని సైలెంట్ అయ్యారో కానీ అంతా గప్ చుప్ కావడంతో ప్రస్తుతం అంతా వార్ వన్ సైడ్ నడుస్తుంది. రాష్ట్రంలో మీడియా సంస్థలు కూడా ఒకటీ రెండు మినహా మిగతా అన్ని ఛానెల్స్ కూడా కేసీఆర్ నామస్మరణే చేస్తున్నాయి.

పైగా మరో తెలుగు రాష్ట్రం ఏపీలో సీఎం కరోనా కట్టడిలో కన్ఫ్యూజన్, అక్కడి రాజకీయ పరిస్థితులతో సీఎం జగన్ పై వ్యతిరేకతతో ఇక్కడ సీఎం కేసీఆర్ కి కలిసి వస్తుంది. మొత్తంగా కేసీఆర్ వన్ మ్యాన్ షో నడిపిస్తున్నారు. ఇలాంటి అనుకూల పరిస్థితులలో రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి, హోంమంత్రి అయిన మహమూద్ అలీ వ్యవహారం ఇప్పుడు రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది.

సీఎం కేసీఆర్ శనివారం ప్రగతి భవన్లో క్యాబినెట్ సమావేశం నిర్వహించి రాష్ట్రంలో లాక్ డౌన్ పొడగింపు విషయంపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశానికి హోంమంత్రి మహమూద్ అలీ కూడా హాజరయ్యారు. వైద్యారోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్ తో కలిసి ప్రగతి భవన్ లోకి వచ్చిన హోంమంత్రి అయనతో ముచ్చటిస్తూనే సమావేశ మందిరానికి కూడా వెళ్లారు.

సుమారు మూడు గంటలు సీఎంతో భేటీలో పాల్గొన్నారు. క్యాబినెట్ భేటీ అనంతరం మంత్రులతో కలిసి సీఎం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. సీఎస్ సోమేశ్ కుమార్ తో సహా భేటీలో పాల్గొన్న మంత్రులందరూ ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఒక్క హోంమంత్రి మహమూద్ అలీ మాత్రం భేటీ అనంతరం మీడియా సమావేశానికి మధ్య సమయంలో అక్కడ నుండి వెళ్లిపోయారు.

క్యాబినెట్ సమావేశం నుండి మంత్రి ఈటలతో కలిసి మహమూద్ అలీ మీడియా సమావేశం జరిగే స్థలానికి కూడా వచ్చారు. కానీ సీఎం అక్కడకి వచ్చేలోపుగా అయన అక్కడ నుండి వెళ్లిపోయారు. ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాలలో ఆసక్తికరమైన చర్చగా మారింది. ఈనెల 1న ఇదే ప్రగతి భవన్ వద్దనే ఇదే కరోనా విషయంలో సమీక్షా సమావేశం జరుగుతుండగానే ఇలాంటి సంఘటనే జరిగింది.

ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరుగుతుండగా హోంమంత్రి మహమూద్ అలీ లోపలకి వెళ్లేందుకు వచ్చారు. అయితే ప్రగతి భవన్ సెక్యూరిటీ సిబ్బంది మహమూద్ అలీ కాన్వాయ్ ను అడ్డుకున్నారు. కొద్ది నిమిషాలు వేచిచూసిన కాన్వాయ్ అక్కడ నుండి వెళ్ళిపోయింది. అప్పుడే ఆ వ్యవహారంపై తీవ్రచర్చలు జరిగాయి.

అయితే, హోంమంత్రికి గవర్నరుతో భేటీ ఉన్నందునే అక్కడకి వెళ్లారని అనుకూల మీడియాలో కథనాలతో కవర్ చేశారు. మరి శనివారం భేటీలో ఉన్న హోంమంత్రి ప్రెస్ మీట్ సమయానికి అక్కడ నుండి వెళ్లిపోవడానికి ఏ కారణం చెప్తారన్నది చూడాల్సి ఉంది. జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఏదో జరుగుతుందన్న రాజకీయ వర్గాల అనుమానాలే బలమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి!

 

 

తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లలోనే లాక్‌డౌన్ ... అక్కడ షరతులు వర్తిస్తాయ్!

తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లలోనే లాక్‌డౌన్ ... అక్కడ షరతులు వర్తిస్తాయ్!

   2 hours ago


తెలంగాణలో కరోనా విజృంభణ.. ఒకేరోజు 6 గురు మృతి!

తెలంగాణలో కరోనా విజృంభణ.. ఒకేరోజు 6 గురు మృతి!

   6 hours ago


భక్తులకు శుభవార్త.. జూన్ 8 నుంచి తిరుమలలో దర్శనాలు

భక్తులకు శుభవార్త.. జూన్ 8 నుంచి తిరుమలలో దర్శనాలు

   9 hours ago


మోడీ మన్ కీ బాత్.. కరోనాపై యుద్ధానికి కొత్త దారులు వెతుకుదాం

మోడీ మన్ కీ బాత్.. కరోనాపై యుద్ధానికి కొత్త దారులు వెతుకుదాం

   9 hours ago


నిమ్మగడ్డ  ఎపిసోడ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు

నిమ్మగడ్డ ఎపిసోడ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు

   10 hours ago


మోడీ సరే.. మరి తెలంగాణ సీఎం వైఖరేంటో?

మోడీ సరే.. మరి తెలంగాణ సీఎం వైఖరేంటో?

   12 hours ago


యడ్డీ మెడపై రెబెల్స్ కత్తి.. వణుకుతున్న బీజేపీ

యడ్డీ మెడపై రెబెల్స్ కత్తి.. వణుకుతున్న బీజేపీ

   13 hours ago


‘‘ఓ తల్లి ఉసురు మీకు తగలక మానదు’’

‘‘ఓ తల్లి ఉసురు మీకు తగలక మానదు’’

   13 hours ago


తండ్రిని మించిన ఫైర్‌బ్రాండ్‌.. తెర‌పైకి జ‌యారెడ్డి

తండ్రిని మించిన ఫైర్‌బ్రాండ్‌.. తెర‌పైకి జ‌యారెడ్డి

   13 hours ago


డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ ఏం తేల్చబోతోంది?

డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ ఏం తేల్చబోతోంది?

   30-05-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle