newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సీఎం కేసీఆర్ కు ప్రాణహాని.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు

05-01-202005-01-2020 15:29:50 IST
Updated On 06-01-2020 12:54:21 ISTUpdated On 06-01-20202020-01-05T09:59:50.758Z05-01-2020 2020-01-05T09:59:24.253Z - 2020-01-06T07:24:21.662Z - 06-01-2020

సీఎం కేసీఆర్ కు ప్రాణహాని.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డికి తెలంగాణ రాజకీయాలలో ఫైర్ బ్రాండ్ గా పేరుంది. అంతకు మించి ఆయన దీనిపై మీడియా ముందుకి వచ్చినా పూర్తి సబ్జెక్టుతోనే వస్తారు. అందుకే అనర్గళంగా ఎదురుదాడి చేసి మాటలతో ఎదుటివాళ్ళని పడగొట్టేస్తారు. అయనతో పరిచయం ఉన్నవాళ్లు, జర్నలిస్టులు కూడా చెప్పే మాట ఇదే. అందుకే ప్రభుత్వం కూడా అయనని టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేస్తుంది.

కాగా, సీఎం కేసీఆర్, రేవంత్ రెడ్డికి మధ్య రాజకీయంగానే కాకుండా అంతకి మించి ఏదో పగ ఉన్నట్లుగా వీరి రాజకీయాలు కొనసాగుతుంటాయి. రేవంత్ కూడా కేసీఆర్ కుటుంబం మీద దూకుడుగా ఉంటారు. ఈ క్రమంలోనే అప్పుడప్పుడు మీడియా ముందు రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. గతంలో బావ-బావమరుదులైన హరీష్ రావు- కేటీఆర్ లపై వ్యాఖ్యలు చేస్తుండగా ఇప్పుడు తండ్రి కొడుకులపై రేవంత్ కామెంట్స్ సంచలనంగా మారాయి.

తాజాగా గడ్డి అన్నారం మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ దరిపల్లి రాజశేఖర్‌ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన సందర్భంగా కర్మన్‌ఘాట్‌లో సభ ఏర్పాటు చేశారు. ఈసభలో మాట్లాడిన ఎంపీ రేవంత్ 'పదవి కుటుంబసభ్యుల మధ్య కూడా చిచ్చు పెడుతుంది. ‘‘కేటీఆర్‌ను సీఎం చేయకపోతే అర్ధరాత్రి లేచి తండ్రిని మెత్తపెట్టి ఒత్తిండంటే ఏదైనా జరగరానిది జరగొచ్చు’’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల కాలంలో టీవీలో వార్తలు చూస్తుంటే సీఎం కేసీఆర్ ప్రాణాలకు ఏదో ముప్పు ఉన్నట్లుగా కనిపిస్తుందని.. ముందుగా కేటీఆర్‌ను ప్రగతి భవన్‌ నుంచి ఖాళీ చేయించాలని.. లేకపోతే మాట్లాడుకోడానికి ఏమీ మిగలదని రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయలలో హాట్ టాపిక్ గా మారింది. కొంతకాలం బావ-బావమరుదులు మధ్య పంచాయతీ అన్నారని.. ఇప్పుడు తండ్రీ కొడుకుల మధ్య పంచాయతీగా కనిపిస్తుందన్నారు.

కాగా, ఒకపక్క మంత్రులు ఎర్రబెల్లి దయాకర్, శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళు కేటీఆర్ సీఎం అయితే తప్పేంటి అంటున్నారంటే సీఎంగా కేసీఆర్ పై నమ్మకం కోల్పోయినట్లేనని అర్థమవుతుందన్నారు. మంత్రివర్గంలో కూడా స్పష్టమైన చీలిక కనిపిస్తుందని.. ఇక కేటీఆర్ ను సీఎం చేయకపోతే ఏదైనా జరగొచ్చని.. ముందుగా కేసీఆర్ జాగ్రత్త పడి కేటీఆర్ ను ప్రగతి భవన్ నుండి ఖాళీ చేయిస్తే మంచిదని సలహా ఇచ్చారు.

రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయాలలో దుమారం రేపుతోంది. ఒకపక్క మంత్రుల వ్యాఖ్యలకు తోడు రేవంత్ వ్యాఖ్యలు పార్టీలో ఏదో జరుగుతుందన్న అనుమానాలు కొందరు లేవనెత్తుతున్నారు. అయితే రేవంత్ వ్యాఖ్యలు వినడానికి ఆసక్తికరంగా, విశ్లేషణగానే ఉన్నా వాస్తవికత మాత్రం ఎక్కడా కనిపించడం లేదని విశ్లేషకుల అభిప్రాయంగా చెప్తున్నారు.

 

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   4 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   5 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   an hour ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   8 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   8 hours ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   27 minutes ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   2 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   8 hours ago


ఇక కేటీఆర్ టైం వ‌చ్చిన‌ట్లేనా

ఇక కేటీఆర్ టైం వ‌చ్చిన‌ట్లేనా

   10 hours ago


బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం

బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం

   18-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle