newssting
BITING NEWS :
*ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌..రాష్ట్రపతి భవన్‌ లో విందుకు హాజరుకానున్న సీఎం కేసీఆర్‌ *రెండవ రోజు భారత్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పర్యటన *దేవరకొండలో మంత్రి కేటీఆర్‌ పర్యటన. పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేయనున్న కేటీఆర్‌ *తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎన్‌ ఎన్నికల్లో నేడు నామినేషన్ల స్వీకరణ * కుప్పంలో రెండోరోజు పర్యటించనున్న చంద్రబాబు* ఏపీ స్థానికల రిజర్వేషన్లపై తీర్పు వెల్లడించనున్న ఏపీ హైకోర్టు ఫాలో అప్ *వివేకా హత్యకేసుపై తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు *ఇవాళ హైదరాబాద్ హౌస్ లో మోదీతో ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు *ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ గా రామ్‌ నివాస్‌ గోయల్ ఏకగ్రీవ ఎన్నిక*అమరావతి: 70వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళనలు, మందడం, వెలగపూడి, తుళ్లూరులో రైతుల ధర్నాలు*వికారాబాద్: కొడంగల్ సమీపంలో రోడ్డు ప్రమాదం. బీజాపూర్ - హైదరాబాద్ హైవేపై కారును ఢీకొట్టిన లారీ. భార్యాభర్తలకు తీవ్రగాయాలు. హాస్పిటల్ కు తరలింపు*భారతీయ సినిమాలు గ్రేట్.. దిల్‌వాలే దుల్హనియా, షోలే చిత్రాలు గొప్పవి-డొనాల్డ్ ట్రంప్

సీఎంగా కేటీయార్.. కేసీఆర్ టార్గెట్ పూర్తయిందా?

06-01-202006-01-2020 12:06:40 IST
Updated On 06-01-2020 12:20:04 ISTUpdated On 06-01-20202020-01-06T06:36:40.449Z06-01-2020 2020-01-06T06:36:06.975Z - 2020-01-06T06:50:04.320Z - 06-01-2020

సీఎంగా కేటీయార్.. కేసీఆర్ టార్గెట్ పూర్తయిందా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నీళ్లు, నిధులు, నియామకం కోసమే తెలంగాణ ఉద్యమం పుట్టిందని తెరాస నేతలు చెప్పే మాట. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలి ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కిన కేసీఆర్ కూడా ఇదే మాట చెప్పారు. గత ఆరేళ్ళుగా సీఎం కేసీఆర్ పల్లెలు, రైతులు, కుల వృత్తులు అంటూ ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కాళేశ్వరంతో పాటు మహా ప్రాజెక్టులని నిర్మిస్తున్నారు.

ఇక, నిధులు.. నియామకాల విషయంలో మాత్రం ఎంతవరకు పురోగతి వచ్చింది అంటే తెలంగాణ ప్రభుత్వం సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉందనే చెప్పుకోవాలి. రాష్ట్రం ప్రస్తుతానికి ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందులో ఉండగా కేసీఆర్ ఉద్యమం సమయంలో చెప్పిన ఉద్యోగాలలో పది శాతం కూడా ఈ ఆరేళ్లలో భర్తీ చేయలేదు. ఇక ఇంటికో ఉద్యోగం అసలు సాధ్యమయ్యేదేనా అనే రివర్స్ ప్రశ్నలు వేస్తున్న కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ గృహాలు ఇదిగో అదిగో అంటూనే ఉన్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతానికి అయితే గులాబీ ప్రభుత్వం రైతాంగం చుట్టూ తిరుగుతుంది. కానీ, మంత్రులు మాత్రం కేసీఆర్ లక్ష్యం పూర్తయింది కనుక అయన పక్కకి జరిగి పరిపాలన ఆయన కుమారుడు కేటీఆర్ కి ఇచ్చినా తమకి ఎలాంటి అభ్యంతరం లేదని పలువురు మంత్రులు అభిప్రాయపడడం ఇప్పుడు గత వారం రోజులుగా రాష్ట్రంలో హాట్ టాపిక్ అవుతుంది.

మొన్న శ్రీనివాస్ గౌడ్, నిన్న ఎర్రబెల్లి, ఈరోజు కొప్పుల.. ఇలా మంత్రులు వరుసపెట్టి కేటీఆర్ సీఎం ఎందుకు కాకూడదు అంటూ వ్యాఖ్యలు చేయడం ఆసక్తిగా మారింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేటీఆర్ సీఎం అయితే తమకి ఎలాంటి అభ్యంతరం లేదంటే.. మంత్రి ఎర్రబెల్లి కేటీఆర్ ఎందుకు సీఎం కాకూడదు.. కెసిఆర్ కుటుంబం రాష్ట్రం తెచ్చింది కనుక పాలించే అధికారం ఉంటుందని అభిప్రాయపడ్డారు.

ఇక తాజాగా మరోమంత్రి కొప్పుల ఈశ్వర్ అయితే సీఎం కేసీఆర్ దేనికోసం అయితే రాష్ట్రం కావాలని కొట్లాడారో ఆ లక్ష్యం పూర్తయిందని పేర్కొనడం విశేషం. ఇప్పుడు రాష్ట్రంలో రైతులకి కరెంట్, నీళ్లు వచ్చి పండగగా ఉందని.. సంక్షేమంలో దేశంలోనే అగ్రగామిగా ఉన్నామని.. ఇప్పుడు తెలంగాణ దేశానికే ఆదర్శ రాష్ట్రంగా అవతరించిందన్నారు. కెసిఆర్ ఎప్పుడు కేటీఆర్ ను సీఎంను చేసినా మేము మద్దతిస్తామన్నారు.

అంటే మంత్రి కొప్పుల కేసీఆర్ పని అయిపోయిందని అంటున్నారా? లక్ష్యం పూర్తయింది కనుక పక్కకి తొలగి కుమారుడికి అప్పగిస్తే తాము అండగా ఉంటామని చెప్పారా? అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాలలో చర్చగా మారింది. మంత్రుల వ్యాఖ్యలు చూస్తుంటే.. ప్రచారం జరుగుతున్నట్లుగానే మున్సిపల్ ఫలితాల అనంతరం కేటీఆర్ కి పట్టాభిషేకం జరిగినా ఆశ్చర్యం లేదనిపిస్తుంది.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle