newssting
BITING NEWS :
* సరిహద్దుల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో భారత్, చైనాల మధ్య సుదీర్ఘ చర్చలు. చైనా భూభాగంలోని మోల్డోలో ఉదయం 9 గంటల రాత్రి 9 గంటల వరకు ఆరవ విడత చర్చలు. * మహారాష్ట్ర థానే జిల్లా భివండీలో మూడంతస్తుల భవనం కూలిన ఘటనలో 17కి చేరిన మృతుల సంఖ్య. మృతుల్లో 14 ఏళ్లలోపు బాలలు, మహిళలు అధికం. * బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీకు సమాజ్‌వాదీ పార్టీ మద్ధతు. సమాజ్‌వాదీ పార్టీ అధికారిక ట్విట్టర్ ద్వారా సోమవారం రాత్రి ప్రకటన. * ముంబై నగరంతోపాటు పలు పరిసర నగరాల్లో మంగళవారం భారీవర్షాలు కురుస్తాయని హెచ్చరికలు. ముంబై, థానే, రాయగడ్, పూణే, సతార, సిందూర్గ్ ప్రాంతాల్లో మంగళవారం ఉరుముులు, మెరుపులతో కూడిన భారీవర్షాలు కురిసే అవకాశం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముంబై వాతావరణ శాఖ హెచ్చరికలు. రష్యా దేశంలో భారీ భూకంపం. రష్యాలోని ఇర్కుట్సు రీజియన్ ప్రాంతంలో సంభవించిన భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదు. భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రష్యన్ ఎమర్జెన్సీ మంత్రిత్వశాఖ వెల్లడి. భూకపంపంతో ప్రజలు భయాందోళనలు. విగత జీవిగా దొరికిన సరూర్ నగర్ తపోవన్‌కాలనీ వద్ద ఆదివారం రాత్రి వరదలో కొట్టుకుపోయిన నవీన్‌కుమార్‌. * కేంద్రంలో తెచ్చిన వ్యవసాయ బిల్లులతో రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీల మధ్య సాగుతున్న విమర్శ, ప్రతి విమర్శలు. * కేంద్ర బిల్లులతో రైతులకు మేలని బీజేపీ వర్గాలు, కొత్తగా తెచ్చిన బిల్లులతో రైతులను తీవ్ర నష్టమని టీఆర్ఎస్ నేతలు ఘాటు విమర్శలు. 280వ రోజుకు చేరుకున్న రాజధాని అమరావతి రైతుల ఉద్యమం. కొనసాగుతున్న శిబిరాల్లో రైతుల ఆందోళనలు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేసిన రైతులు. కరోనా సూచనలు పాటిస్తూ కొనసాగుతున్న అమరావతి ఉద్యమం. నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్మోహన్ రెడ్డి. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలతో భేటీ జరిగే అవకాశం. బుధవారం తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాల్సి ఉన్నా మంగళవారం ఆకస్మిక ఢిల్లీ పర్యటన పెట్టుకోవడం గమనార్హం. రాష్ట్రంలో అనూహ్యంగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మోదీ, షాలతో చర్చకు అవకాశం. మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు దర్యాప్తు వేగవంతం.

సీఎంగా కేటీఆర్.. మంత్రుల భజనేంటి సామీ..!

03-01-202003-01-2020 13:18:00 IST
2020-01-03T07:48:00.647Z03-01-2020 2020-01-03T07:47:54.658Z - - 22-09-2020

సీఎంగా కేటీఆర్.. మంత్రుల భజనేంటి సామీ..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడి ఇంకా పూర్తిగా మొదలు కాలేదు కానీ ఇప్పుడు ఇక్కడ రాజకీయాలలో బీభత్సంగా జరుగుతున్న ప్రచారం మాత్రం కేటీఆర్ నెక్స్ట్ సీఎం అని. ఇది బయట వాళ్లెవరో చేస్తున్న ప్రచారం కూడా కాదు. సాక్షాత్తు మంత్రులే ప్రచారం చేస్తుండడం విశేషం. పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికే చేస్తున్నారో లేక మీడియా వాళ్ళు అడిగితే చెప్తున్నారో కానీ రోజుకొకరు ఈ తరహా వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.

ఈ మధ్యనే రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, సాంస్కృతిక శాఖామంత్రి శ్రీనివాస్ గౌడ్ కెసిఆర్ తర్వాత కేటీఆర్ కాబోయే సీఎం అంటూ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యాలతో మున్సిపల్ ఎన్నికల తర్వాత కేటీఆర్ కు పట్టాభిషేకం జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కథనాలు వచ్చాయి. ఇంకొందరైతే మున్సిపల్ ఫలితాలను చూపించే కేటీఆర్ సత్తా ఉన్న నాయకుడని సీఎంను చేయనున్నారని రాసుకొచ్చారు.

వీటిపై స్పందించిన మంత్రికి కేటీఆర్ మాత్రం ఆ వ్యాఖ్యలను పక్కకు నెట్టేశారు. మరో పదేళ్లు కెసిఆర్ సీఎంగా ఉంటారని ఈ దశాబ్దం తెలంగాణదేనని.. దేశంలో తెలంగాణ టాప్ స్టేట్ గా ఉండబోతుందని చెప్పారు. సాక్షాత్తు ఆయనే మరో పదేళ్ల వరకు తనకి సీఎం పదవి ప్రస్తావనే ఉండదని చెప్పినా మంత్రులు మాత్రం భజన ఆపడం లేదు. నిన్నటి నిన్న మంత్రి ఎర్రబెల్లి మరోసారి అదే తరహా వ్యాఖ్యలు చేశారు.

కేటీఆర్ సమర్ధుడైన నాయకుడని.. అయన ముఖ్యమంత్రికి అన్ని విధాలా అర్హుడని చెప్పారు. అయితే సీఎంగా ఎప్పుడవుతారన్నది మాత్రం సీఎం కెసిఆర్ నిర్ణయిస్తారని చెప్పారు. అంతటితో ఆగని ఎర్రబెల్లి సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీలా.. చంద్రబాబు కుమారుడు లోకేష్ లా కేటీఆర్ అసమర్ధుడు కాదని.. ప్రభుత్వాన్ని నడిపించడంలో కేటీఆర్ సమర్థుడన్నారు.

అంతేకాదు.. స్వతంత్రం తెచ్చిన నెహ్రు కుటుంబం దేశాన్ని పరిపాలిస్తే లేని తప్పు.. రాష్టాన్ని తెచ్చిన కెసిఆర్ కుటుంబం రాష్ట్రాన్ని పరిపాలిస్తే తప్పేమిటన్నారు. అయితే కేటీఆర్ సమర్ధుడిని చేయడానికి రాహుల్-లోకేష్ లను అసమర్దులను చేయడంపై ఆయా పార్టీల నేతలు తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అయితే ఎర్రబెల్లి చెంచాగిరి అయన ఇష్టమని.. రాహుల్ గాంధీ అవాకులు పేలితే తాము నోరు విప్పాల్సి వస్తుందన్నారు.

కాగా, అసలు కేటీఆర్ స్వయంగా మరో పదేళ్ల పాటు సీఎం పదవిపై క్లారిటీ ఇచ్చినా మంత్రులు మాత్రం కేటీఆర్ భజన చేయడం వెనుక కారణమేంటి అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. కేటీఆర్ నిజంగా సమర్దుడేనా? లేక బలవంతంగా మంత్రులతో ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారా? అనే విశ్లేషణలు కొనసాగుతున్నాయి. మరి మంత్రులు భావాలకు అర్ధాలేమిటో?!

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle