newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సిరిసిల్లలో వ్యభిచార ముఠా గుట్టురట్టు.. మైనర్ బాలికకు విముక్తి

30-07-202030-07-2020 10:35:51 IST
Updated On 30-07-2020 10:41:51 ISTUpdated On 30-07-20202020-07-30T05:05:51.110Z30-07-2020 2020-07-30T05:05:46.287Z - 2020-07-30T05:11:51.270Z - 30-07-2020

సిరిసిల్లలో వ్యభిచార ముఠా గుట్టురట్టు.. మైనర్ బాలికకు విముక్తి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఓ వ్యభిచార గృహం నుంచి ఓ మైనర్ బాలికకు విముక్తికి లభించింది. ఆరేళ్లుగా వ్యభిచార కూపంలో చిక్కుకుపోయి నరకం అనుభవించిన ఆ బాలికను పోలీసుల సహాయంతో బంధువులు బయటకు తీసుకొచ్చారు. పట్టణంలో వ్యభిచార గృహాల నిర్వహణ యథేచ్చగా సాగుతున్నా... ఇన్నాళ్లు పోలీసులు,అధికారులు పట్టించుకోకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది.

మంత్రి కేటీఆర్ సొంత ఇలాఖాలో వెలుగుచూసిన ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం రేకెత్తిస్తోంది.మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన ఓ బాలిక చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయింది. ఆరేళ్ల క్రితం ఓరోజు శ్రీరాంపూర్‌లోని తన నానమ్మ వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో స్థానికంగా ఉండే శ్రీవాణి అనే మహిళతో పరిచయం ఏర్పడింది.

బాలిక అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని శ్రీవాణి ఆమెకు మాయ మాటలు చెప్పింది. నిన్ను నేనే చదివిస్తానని చెప్పి సిరిసిల్లకు తీసుకెళ్లి ఓ వ్యభిచార గృహంలో అమ్మేసింది. అప్పటినుంచి ఆ బాలిక అక్కడే చిక్కుకుపోయింది. బాలిక శ్రీవాణితో వెళ్లిన విషయం ఆమె నానమ్మకు గానీ బంధువులకు గానీ తెలియదు. దీంతో బాలిక కనిపించట్లేదంటూ ఆరేళ్ల క్రితం బెల్లంపల్లి పోలీస్ స్టేషన్‌లో బంధువులు ఫిర్యాదు చేశారు. అప్పటినుంచి ఆమె ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల ఓరోజు బాలిక మేనమామ రాజలింగుకు గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆ వ్యక్తి బాలిక గురించి సమాచారం ఇవ్వడంతో ఆమె బంధువులు బెల్లంపల్లి నుంచి సిరిసిల్లకు వెళ్లారు.

బాధిత బాలిక బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు వ్యభిచార గృహంపై దాడి చేసి ఆమెకు విముక్తి కల్పించారు. ఆరేళ్లుగా అక్కడ నరకం అనుభవించానని బాలిక పోలీసులతో వాపోయింది. భువనగిరి,సిద్దిపేటలకు చెందిన మరికొందరు అమ్మాయిలు వ్యభిచార గృహంలో మగ్గుతున్నట్లు బాధిత బాలిక వెల్లడించినట్లు తెలుస్తోంది.

నిజానికి ఇక్కడ వ్యభిచార గృహాల సంగతి స్థానికంగా అందరికీ తెలుసునని... అయినప్పటికీ ఏ అధికారి చర్యలు తీసుకోవట్లేదన్న విమర్శలున్నాయి. చిన్న పిల్లలను సైతం ఇక్కడి వ్యభిచార గృహాల్లో విక్రయిస్తుంటారన్న ప్రచారం ఉంది.ప్రస్తుతం అక్కడి వ్యభిచార గృహాల్లో మరో 10,15 మంది బాలికలు ఉండవచ్చునని సోషల్ మీడియాలో ప్రచారంలో జరుగుతోంది. వీరందరూ బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దింపబడ్డవారేనని చెబుతున్నారు.

కొంతమంది తమకు తాముగా వ్యభిచార వృత్తిలోకి దిగినవారు కూడా ఉన్నారని తెలుస్తోంది. తాజాగా ఎస్పీ రాహుల్ హెగ్దే ఆదేశాల మేరకు పోలీసులు వ్యభిచార గృహాలపై దాడులు చేశారు. అక్కడి బాలికల ఆధార్, జనన ధృవీకరణ పత్రాలను పరిశీలించారు. ఈ వృత్తిని మానేసి ఇకనైనా వేరే జీవనోపాధి చూసుకోవాలని నిర్వాహకులను హెచ్చరించారు.

గతంలో ఇదే సిరిసిల్లలోని ఎస్సీ హాస్టల్లో క్యాటరింగ్ కాంట్రాక్టర్ దేవయ్య విద్యార్థినులను లైంగికంగా వేధించిన ఘటన వెలుగుచూసిన సంగతి తెలిసిందే. డబ్బులిస్తానని చెప్పి తమను లైంగికంగా లొంగదీసుకోవాలని చూసేవాడని అతనిపై కొంతమంది బాలికలు ఫిర్యాదు చేశారు. దీంతో దేవయ్యతో పాటు అతనికి సహకరించిన మహిళా వార్డెన్‌ను కూడా పోలీసులు అప్పట్లో అరెస్ట్ చేశారు.

 

       040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle