newssting
BITING NEWS :
*గుజరాత్‌: సూరత్‌లో దారుణం.. కార్పొరేషన్ ట్రైనీ ఉద్యోగినులను గుంపులో నగ్నంగా నిలబెట్టి ఫిట్‌నెస్ పరీక్ష *నేడు తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... ఈ నెల 25న డైరెక్టర్ పదవులకు నామినేషన్లు, 29న ఛైర్మన్, ఉపాధ్యక్ష ఎన్నికలు *అమరావతి: వైఎస్ జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు.. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్ *హైదరాబాద్: బంజారాహిల్స్ లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. విదేశీయుల హల్చల్, పోలీసులతో వాగ్వాదం.. పాస్ పోర్టు, వీసా పత్రాలు చూపకపోవడంతో పోలీసులకు అప్పగింత *అమరావతి: నేడు 29 గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చిన రైతుల జేఏసీ.. మందడంలో పోలీసుల లాఠీఛార్జ్‌కి నిరసనగా బంద్, విద్యా, వ్యాపార సంస్థలను బంద్‌ పాటించాలని కోరిన జేఏసీ

సినీరంగంపై కేసీయార్ ఫోకస్..రంగంలోకి తలసాని

11-02-202011-02-2020 09:00:46 IST
2020-02-11T03:30:46.513Z11-02-2020 2020-02-11T03:30:13.664Z - - 22-02-2020

సినీరంగంపై కేసీయార్ ఫోకస్..రంగంలోకి తలసాని
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో సినీరంగం అభివృద్ధిపై సీఎం కేసీయార్ దృష్టి పెట్టారా? 

సినీ రంగ పెద్దలతో మంత్రి తలసాని భేటీలు అందుకేనా? 

ఒకవైపు ఇండస్ట్రీ.. మరో వైపు జీహెచ్ఎంసీ ఎన్నికల కోసమేనా? 

చిరంజీవి-నాగార్జునల భేటీ వెనుక ఆంతర్యం అదేనా? 

‘మా’ను ఎందుకు పట్టించుకోవడం లేదు?

తెలంగాణ సీఎం కేసీయార్ చాలా దూరం ఆలోచిస్తారు. తెలంగాణలో ఇప్పటికే అన్ని ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటుతూనే వుంది. తాజాగా జరిగిన మునిసిపల్ ఎన్నికల్లోనూ కారు జోరుకు, హోరుకు విపక్షాలు చెల్లాచెదురయ్యాయి. వచ్చే ఏడాది జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి.

ఈ నేపథ్యంలో కేసీయార్ సినిమాటోగ్రఫీ మంత్రి తలసానిని రంగంలోకి దింపారు. సినీ పరిశ్రమ సమస్యలను పరిష్కరించడం, సినీ రంగాన్ని తనవైపు లాక్కోవడం ఈ వ్యూహంలో భాగంగా చెబుతున్నారు. వివాదాల్లో వున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రతినిధులు మాత్రం ఇందులో పాల్గొనలేదు. 

టాలీవుడ్ అగ్రకథనాయకులు చిరంజీవి, నాగార్జున మరోసారి తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో సోమవారం భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. నాలుగురోజుల క్రితమే వీరంతా  సమావేశమైయ్యారు. తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి, కళాకారులకు సంక్షేమానికి చేపట్టాల్సిన పలు అంశాలపై వీరు కూర్చుని చర్చించారు. అన్నపూర్ణ స్టూడియోలో జరుగిన సమావేశంలో హోమ్, రెవెన్యూ, న్యాయశాఖ, కార్మిక శాఖ పలువురు అధికారులు కూడా పాల్గొనడం విశేషం. అంతకుమందు సమావేశం చిరంజీవి నివాసంలో జరిగిన సంగతి తెలిసిందే.

త్వరలో శంషాబాద్‌ పరిసరాల్లో ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌ ఏర్పాటుచేస్తామని సీఎం కేసీయార్ ఇంతకుముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు స్థలం సేకరించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ , కల్చరల్‌ సెంటర్‌ కేంద్రం కోసం అవసరమైన స్థలం సేకరించాలని సూచించారు. సినీ, టీవీ కళాకారులకు ఇళ్ల నిర్మాణానికి 10 ఎకరాల స్థలం అలాగే సింగిల్‌ విండో విధానంలో సినిమాల చిత్రీకరణకు అనుమతి ఇవ్వాలని చిరంజీవి, నాగార్జున ప్రభుత్వాన్ని కోరారు. 

సినిమా టికెట్ల ధరల విధానంలో మార్పు, సినీ టీవీ కళాకారులకు ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా గుర్తింపు కార్డులు కూడా మంజూరు చేయాలని అధికారులను కోరారు. సినిమాల్లో పైరసీ నివారణకు కూడా ఒక విధానం అమలుచేయాలని వీరు మంత్రిని కోరారు. హైదరాబాద్ లో షూటింగ్ లు ఎక్కువగా జరిగేలా చూడాలని చిరంజీవి, నాగార్జున కోరారు.దీనివల్ల పన్నులు, స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. 

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   2 hours ago


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   3 hours ago


మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

   4 hours ago


బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

   5 hours ago


రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

   5 hours ago


రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

   6 hours ago


ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

   7 hours ago


మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

   8 hours ago


పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

   8 hours ago


కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

   9 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle