newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

సిద్ధాంతాలు మ‌రిచి.. విలువ‌లు వ‌దిలేసి..!

28-01-202028-01-2020 12:39:37 IST
Updated On 28-01-2020 14:48:13 ISTUpdated On 28-01-20202020-01-28T07:09:37.402Z28-01-2020 2020-01-28T07:09:32.948Z - 2020-01-28T09:18:13.083Z - 28-01-2020

సిద్ధాంతాలు మ‌రిచి.. విలువ‌లు వ‌దిలేసి..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ‌లో మున్సిప‌ల్ ఎన్నిక‌లు రాజ‌కీయాల్లో దిగ‌జారుతున్న విలువ‌లకు అద్దం ప‌ట్టాయి. అధికార‌యావ‌తో పార్టీలు సిద్దాంతాల‌ను తుంగ‌లో తొక్కాయి. గెలుపే ల‌క్ష్యంగా రాజ‌కీయ నేత‌లు ప్ర‌జ‌ల న‌మ్మ‌కాల‌ను వ‌మ్ము చేసి అధికారాన్ని ద‌క్కించుకున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ స‌హా అన్ని పార్టీలూ ఇదే వైఖ‌రిని అవ‌లంభించాయి. అధికారం కొసం అర్రులు చాస్తూ విలువ‌ల‌ను కాల‌రాశాయి.

అన్ని మున్సిపాలిటీల‌ను ద‌క్కించుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్న టీఆర్ఎస్ పార్టీ ఇందుకు త‌గ్గ‌ట్లుగానే వ్యూహాలు పన్నింది. హంగ్ ఏర్ప‌డ్డ మున్సిపాలిటీల‌తో పాటు కాంగ్రెస్‌, టీఆర్ఎస్‌కు మెజారిటీ సీట్లు వ‌చ్చిన మున్సిపాలిటీల‌ను కూడా ద‌క్కించుకుంది. ఇందుకు ఎదుటి పార్టీ నుంచి గెలిచిన వారిని ఆక‌ర్షించ‌డంతో పాటు ఎక్స్ అఫీషియో ఓట్ల‌ను ఉప‌యోగించుకుంది.

ఎక్స్ అఫీషియో ఓట్ల‌ను ఉప‌యోగించుకోవ‌డం నిబంధ‌న‌ల ప్ర‌కారం స‌రైన‌దే అయినా ఒక జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ మ‌రో జిల్లాలోని మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో స‌భ్యుడిగా ఓటు వేయ‌డం మాత్రం స‌మంజ‌సంగా లేదు.

ఉదాహ‌ర‌ణ‌కు వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ క‌డియం శ్రీహ‌రి కాంగ్రెస్‌కు మెజారిటీ వ‌చ్చిన యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలోని యాద‌గిరిగుట్ట‌లో ఎక్స్అఫీషియోగా ఓటు వేశారు. అదే వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన మ‌రో ఎమ్మెల్సీ బోడ‌కంటి వెంక‌టేశ్వ‌ర్లు కాంగ్రెస్‌కు మెజారిటీ ఉన్న సూర్యాపేట జిల్లా నేరేడుచ‌ర్ల‌లో ఓటు న‌మోదు చేసుకున్నారు.

బీజేపీకి మెజారిటీ ఉన్న తుక్కుగూడ‌లో ఆ మున్సిపాలిటీకి, జిల్లాకు సంబంధం లేని ఎంపీ కేశ‌వ‌రావు, ఎమ్మెల్సీ నాయిని న‌ర‌సింహారెడ్డి ఓట్లు వేసి టీఆర్ఎస్ ఛైర్మ‌న్‌ను గెలిపించుకున్నారు.

నిబంధ‌న‌ల ప్ర‌కారం ఎమ్మెల్యే, గ‌వ‌ర్న‌ర్ కోటా ఎమ్మెల్సీలు రాష్ట్రంలో ఎక్క‌డైనా ఓటు వేసే అవ‌కాశం ఉంది. కాక‌పోతే సంబంధం లేని మున్సిపాలిటీలో, క‌నీసం త‌న జిల్లా కూడా కానీ మున్సిపాలిటీకి వెళ్లి ఎమ్మెల్సీలు త‌మ ఎక్స్ అఫీషియో ఓట్ల‌ను వినియోగించుకోవ‌డం మాత్రం స‌రైన‌ది కాదనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

కాంగ్రెస్ కూడా ఈ విష‌యంలో త‌క్కువేమీ లేదు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన రాజ్య‌స‌భ స‌భ్యుడు కేవీపీ రామ‌చంద్ర‌రావును సూర్యాపేట జిల్లా నేరేడుచ‌ర్ల‌లో ఓటు వేయించ‌బోతోంది. విభ‌జ‌న స‌మ‌యంలో ఆయ‌న‌ను తెలంగాణ స‌భ్యుడిగా గుర్తించింది.

అయితే, ఎక్స్అఫీషియో ఓట్ల‌ను వినియోగించుకోవ‌డాన్ని టీఆర్ఎస్ స‌మ‌ర్థించుకుంది. ఈ విధానం టీడీపీ హ‌యాంలో మొద‌లైంద‌ని, కాంగ్రెస్ కూడా ఉపయోగించుకుంద‌ని గుర్తు చేస్తోంది ఆ పార్టీ. ఇక‌, మున్సిప‌ల్ పీఠాల‌ను దక్కించుకోవ‌డానికి టీఆర్ఎస్ పార్టీ మ‌రోసారి ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ను ప్ర‌యోగించింది.

ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఆరు నెలల్లోనే అధికార పార్టీలో చేరిపోతున్న ఈ రోజుల్లో తామెందుకు నిజాయితీగా ఉండాల‌ని అనుకున్నారో ఏమో కానీ కౌన్సిల‌ర్లు గెలిచిన రెండు రోజుల‌కే అధికార పార్టీలో చేరిపోయారు.

కాంగ్రెస్‌కు ద‌క్కాల్సిన‌ పెద్దఅంబ‌ర్‌పేట‌లో న‌లుగురు కాంగ్రెస్ కౌన్సిల‌ర్లు టీఆర్ఎస్‌కు మ‌ద్ద‌తు ఇచ్చారు. వీరిలో ఒక‌రు వైస్ ఛైర్మ‌న్ ప‌ద‌విని పొందారు. బ‌డంగ్‌పేట్‌లో కాంగ్రెస్ నుంచి గెలిచిన పారిజాత టీఆర్ఎస్‌కు మ‌ద్ద‌తు ప‌లికి ఏకంగా మేయ‌ర్ ప‌ద‌వినే పొందారు. కాంగ్రెస్‌కు మెజారిటీ సీట్లు వ‌చ్చిన ఆదిభ‌ట్ల‌లో ఆ పార్టీ కౌన్సిల‌ర్ హార్ధికను టీఆర్ఎస్ పార్టీ చేర్చుకొని ఛైర్‌ప‌ర్స‌న్ ప‌ద‌వినే క‌ట్ట‌బెట్టి ఈ మున్సిపాలిటీని త‌మ ఖాతాలోకి వేసుకుంది.

చౌటుప్ప‌ల్‌లో కాంగ్రెస్ కూట‌మి త‌ర‌పున గెలిచిన ముగ్గురు సీపీఎం ఎమ్మెల్సీలు టీఆర్ఎస్‌కు మ‌ద్ద‌తు ప‌లికారు. దీంతో ఆగ్ర‌హించిన కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు వారి ఇళ్ల‌పై రాళ్ల దాడి చేశారు.

మున్సిపాలిటీల్లో గెలుపే ల‌క్ష్యంగా పెట్టుకున్న పార్టీలు సిద్ధాంతాల‌కు విరుద్ధంగా పొత్తులు పెట్టుకున్నాయి. మ‌ణికొండ‌లో కాంగ్రెస్‌కు బీజేపీ మ‌ద్ద‌తు ఇచ్చి వైస్ ఛైర్మ‌న్ ప‌ద‌విని పొందింది. మ‌క్త‌ల్‌లో బీజేపీకి కాంగ్రెస్ మ‌ద్ద‌తు ఇచ్చింది.

న‌ల్గొండ‌లో టీఆర్ఎస్‌కు ఎంఐఎం పార్టీ మ‌ద్ద‌తు ఇవ్వ‌గా, బీజేపీ త‌ట‌స్థంగా ఉండి టీఆర్ఎస్‌కు స‌హ‌క‌రించింది. ఇందుకు గానూ వైస్ ఛైర్మ‌న్ ప‌ద‌విని పొందింది. ఇలా, అధికార‌మే ల‌క్ష్యంగా పార్టీలు పావులు క‌ద‌ప‌గా పార్టీని చూసి ఓటేసిన ఓట‌రు తెల్ల‌మొహం వేయాల్సి వ‌చ్చింది.

 

ఏపీలో మాల్స్, జ్యూయలరీ, ఫుడ్ టేక్ అవేలకు అనుమతి

ఏపీలో మాల్స్, జ్యూయలరీ, ఫుడ్ టేక్ అవేలకు అనుమతి

   an hour ago


రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు

రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు

   2 hours ago


ఆన్ లైన్లో మహానాడు.. జూమ్ యాప్ ద్వారా 14వేలమందికి అవకాశం

ఆన్ లైన్లో మహానాడు.. జూమ్ యాప్ ద్వారా 14వేలమందికి అవకాశం

   2 hours ago


కరువు సీమకు నీటిని ఇస్తామంటే ఇంతవివాదమా.. జగన్ ప్రశ్న

కరువు సీమకు నీటిని ఇస్తామంటే ఇంతవివాదమా.. జగన్ ప్రశ్న

   2 hours ago


లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక నిర్ణయం

లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక నిర్ణయం

   3 hours ago


కన్నాపై మంత్రి వెల్లంపల్లి హాట్ కామెంట్స్

కన్నాపై మంత్రి వెల్లంపల్లి హాట్ కామెంట్స్

   3 hours ago


ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై బండి సంజ‌య్ ఆశ‌లు నెర‌వేరేనా..?

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై బండి సంజ‌య్ ఆశ‌లు నెర‌వేరేనా..?

   3 hours ago


హైకోర్టు ఆగ్రహం.. 49 మంది వైసీపీ నేతలకు నోటీసులు!

హైకోర్టు ఆగ్రహం.. 49 మంది వైసీపీ నేతలకు నోటీసులు!

   4 hours ago


తెలంగాణలో వైరస్ ఉధృతి.. టెస్టులు తక్కువ.. కేసులు ఎక్కువ!

తెలంగాణలో వైరస్ ఉధృతి.. టెస్టులు తక్కువ.. కేసులు ఎక్కువ!

   4 hours ago


ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

   17 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle