సిద్దిపేట ఘటనపై స్పందించిన మంత్రి కేటీయార్
17-08-202017-08-2020 12:58:58 IST
2020-08-17T07:28:58.618Z17-08-2020 2020-08-17T07:28:45.496Z - - 12-04-2021

తెలంగాణలో గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల అక్కడక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తాయి. రాబోయే మూడు, నాలుగు రోజుల పాటు కూడా భారీ అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. మరోవైపు వరంగల్ భారీవర్షాల కారణంగా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. భారీవర్షాల కారణంగా టీఆర్ఎస్ నేత కారుతో సహా వాగులో గల్లంతయిన ఘటనపై స్పందించారు మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్... సిద్ధిపేట కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడిన మంత్రి.. గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు జంగపల్లి శ్రీనివాస్ ఆదివారం రాత్రి ముగ్గురు స్నేహితులతో కలిసి వాహనంలో వెళ్తుండగా.. సిద్దిపేట జిల్లా దర్గాపల్లి వద్ద వాహనంతో సహా వాగులో పడిపోయారు.. స్థానికులు వెంటనే గమనించి ముగ్గురిని బయటకు తీయగా కారుతో పాటు శ్రీనివాస్ గల్లంతయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్... సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డితో ఫోన్లో మాట్లాడారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో సిద్ధిపేట ఆర్డీవో ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు మూసీలో చిక్కుకుని పోయిన ముగ్గురు యువకులను కాపాడారు. సూర్యాపేట మండలం కేటీ అన్నారం గ్రామ సమీపంలో గల మూసీ నదిలో చిక్కుకున్న ముగ్గురు యువకులను క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. ఆదివారం చివ్వెంల మండలం ఖాసీంపేటకు చెందిన షబ్బీర్, సోహెల్, కైఫ్‌లు వరదనీటిలో చిక్కుకొని కేకలు వేయగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఇతర అధికారులకు సమాచారం అందించి సంఘటనా స్థలానికి చేరుకొని మూసీ అధికారులతో మాట్లాడి వరద ఉధృతి తగ్గింపులో భాగంగా గేట్లను కొంత మేర కిందకు దించారు. దీంతో స్థానికులు, పోలీసులు రెస్క్యూ ఆపరేషన్‌లో భాగంగా ముగ్గురు యువకులను తాళ్ల సహాయంతో కాపాడి క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. వర్షాలు బాగా కురుస్తుండడంతో నదులు, వాగులు, నీటితో నిండి ప్రవహిస్తున్నాయని, ఈ సమయంలో నీటిలోకి వెళ్లడం ప్రమాదకరమన్నారు. ప్రజలు ప్రమాదాలకు దూరంగా ఉండాలని పోలీసులు, రెవిన్యూ అధికారులు సూచించారు.

జగన్ తిరుపతి పర్యటన రద్దు.. అచ్చెన్నాయుడు సెటైర్లు..!
9 hours ago

షర్మిల దీక్షలతో ఏం ఒరుగుతుంది
12 hours ago

కన్నుమూసిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి
15 hours ago

వాలంటీర్లపై పాత ప్రేమే కొత్తగా చూపించిన జగన్
6 hours ago

బెంగాల్ ఎన్నికల్లో హింస.. కాల్పుల్లో ఐదుగురి మృతి
16 hours ago

జనం ప్రేమ కాదు.. జడ్జిల దయతోనే జగన్ సీఎం అట
13 hours ago

పవన్ కి చంద్రబాబు సపోర్ట్
16 hours ago

కొత్తగా సెకండ్ డోస్ భయం.. తూర్పుకి తిరిగి దండం పెట్టాలా
16 hours ago

దేవినేని ఉమ.. చిక్కుల్లో పడ్డట్టేనా..?
10 hours ago

రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఈ తన్నుడు కామెంట్లు ఏంటో..?
19 hours ago
ఇంకా