newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో కేంద్ర-రాష్ట్ర మంత్రుల మాటల యుద్ధం!

19-02-202019-02-2020 13:58:03 IST
2020-02-19T08:28:03.406Z19-02-2020 2020-02-19T08:28:01.609Z - - 15-04-2021

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో కేంద్ర-రాష్ట్ర మంత్రుల మాటల యుద్ధం!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో కేంద్ర-రాష్ట్ర మంత్రుల మధ్య మాటలు కాకపుట్టించాయి. దక్షణాది ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని.. తెలంగాణతో సహా సహా దక్షిణ రాష్ట్రాలలో కొత్త ప్రాజెక్ట్‌లు మొదలుపెట్టాలని తెలంగాణ రాష్ట్రమంత్రి తలసాని యాదవ్ కేంద్రమంత్రులకు చురకలు వేస్తే.. కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ కూడా తమకు అన్ని ప్రాంతాలు సమానమే అంటూ అందుకు ఘాటుగానే స్పందించారు. ఈ మాటల యుద్దానికి చర్లపల్లిలో శాటిలైట్‌ రైల్వేస్టేషన్‌ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం వేదికైంది.

మంగళవారం హైదరాబాద్లో కేంద్ర, రాష్ట్రాల మంత్రులు పలు అభివృద్ధి పథకాలను ప్రారంభించారు. అందులో భాగంగానే చర్లపల్లిలో రూ.221 కోట్లతో శాటిలైట్‌ రైల్వేస్టేషన్‌ నిర్మాణం మొదలు పెట్టగా పీయూష్‌ గోయల్‌ శంకుస్థాపన చేశారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 427 రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫై సేవలను ప్రారంభించారు. యర్రగుంట్ల - నంద్యాల సెక్షన్‌ విద్యుదీకరణకు, గుంతకల్లు - కల్లూరు సెక్షన్‌ రెండో మార్గం జాతికి అంకితం కార్యక్రమాలను సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి రిమోట్‌ లింక్‌ ద్వారా ప్రారంభించారు.

అయితే, ఈ కార్యక్రమంలో మాట్లాడిన మంత్రులు ఒకరి ప్రభుత్వంపై మరొకరు నిందలు.. చురకలు వేసుకుంటూ ఆద్యతం ఆసక్తిగా మారింది. దక్షణాదిపై కేంద్రం వివక్ష చూపిస్తుందనేలా మంత్రి తలసాని మొదలు పెట్టిన మాటలకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఘాటుగా స్పందించారు. సబ్‌ కా సాత్‌ సబ్‌ కా వికాస్ తమ నినాదమని.. ఒక్క తెలంగాణలోనే రైల్వేల అభివృద్దికి ఎన్డీయే హాయంలో 2602 కోట్లు కేటాయించామంటూ గట్టి సమాధానమిచ్చారు.

అంతేకాదు, కేంద్రం ప్రభుత్వం, పార్లమెంట్ చేసిన చట్టాలను రాష్ట్రాలు వ్యతిరేకించలేవంటూ సిఏఏపై మాట్లాడుతూ ఒవైసీ మెప్పుకోసం కేసీఆర్ మత రాజకీయాలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. రాజకీయాల కోసమే ముస్లింలకు కేసీఆర్ 12శాతం రిజర్వేషన్లు ఇస్తామంటున్నారని, ప్రజలను అసదుద్దీన్ ఒవైసీ భయబ్రాంతులకు గురిచేస్తున్నారని, కేసీఆర్ కూతురు కవితను ఓడించటం ద్వారా ప్రజలు టీఆర్ఎస్‌కు గట్టి సంకేతం పంపారంటూ పక్కా రాజకీయ వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్ర మంత్రి కేటీఆర్ కేవలం కేంద్రాన్ని నిందించే పనిలోనే ఉన్నారని.. ఇది కేవలం అవగాహనా లోపం మాత్రేమనని కేటీఆర్ పై విమర్శలు చేశారు. ఇక ఇదే వేదిక నుండి రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా గట్టి వ్యాఖ్యలే చేశారు. ఐదేళ్లలో తెలంగాణలో అభివృద్ధి అంటూ జరిగిందంటే అది కేవలం కేంద్రం సహకారం వలనేనని.. ఆ విషయాన్ని రాష్ట్రప్రభుత్వంతో చర్చలకు కూడా తాము సిద్ధమేనంటూ సవాళ్లు విసిరారు.

ఈ సభలోనే కిషన్ రెడ్డి యాదగిరి గుట్ట వరకు ఎంఎంటీఎస్ రైల్వే లైన్ ను పొడిగించడంలో రాష్ట్రప్రభుత్వమే అడ్డంకిగా ఉందని ఆరోపించడంతో పాటు మొన్నటి మెట్రో కారిడార్ 2 ప్రారంభానికి ప్రోటో కాల్ ప్రకారం అందని ఆహ్వానాన్ని కూడా గుర్తు చేశారు. ఇందుకు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ తనకు కూడా చివరి నిమిషం వరకు ఆహ్వానమే లేదంటూ నిట్టూర్చడం విశేషం కాగా మొత్తంగా రైల్వేప్రారంభం కాస్త పక్కా రాజకీయ సభలా హాట్ హాట్ గా సాగదని చెప్పుకోవాలి.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle