newssting
Radio
BITING NEWS :
భారీ విధ్వంసం సృష్టిస్తూ బుధవారం అర్థరాత్రి పుదుచ్చేరి వద్ద తీరం దాటిన నివర్ తుఫాన్. తీరందాటే సమయంలో భీకర గాలుల ధాటికి నేలకూలిన భారీ వృక్షాలు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత. * నివర్ తుఫాన్ ప్రభావంతో చిగురుటాకులా వణికిపోతున్న తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు. గత అర్థరాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాలు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వాలు. ఇళ్లు సురక్షితం కాకుండా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచన. * తుఫాను సమయంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు. నెల్లూరు జిల్లా , తమిళనాడుకు చెందిన మత్స్యకారులు సేఫ్. శ్రీహరికోట తీరంలో తలదాచుకున్న మత్స్యకారులు. * ఎన్టీఆర్ ఘాట్ కూల్చాలన్న ఎంఐఎం వ్యాఖ్యల్ని ఖండించిన టీడీపీ నేతలు. ఎన్టీఆర్ పై అభిమానముంటే భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేసిన టీడీపీ నేతలు. * అక్బరుద్దీన్ కు గట్టి కౌంటరిచ్చిన బీజేపీ నేత బండి సంజయ్. దమ్ముంటే పీవీ నర్సింహారావు, ఎన్టీఆర్ ఘాట్లను కూల్చాలని సవాల్. వారి ఘాట్లను కూల్చిన వెంటనే దారుస్సలాంను కూల్చివేస్తామన్న బండి సంజయ్. * తెలంగాణలో కొత్తగా మరో 862 కరోనా కేసులు, ముగ్గురు మృతి. * సమ్మె చెేపట్టిన సింగరేణి కార్మికులు. కేంద్రం చేపట్టిన కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సమ్మె. సమ్మెలో పాల్గొన్న నాలుగు కార్మిక సంఘాలు. * 26/11 ముంబై ఉగ్రదాడులకు నేటితో 12 ఏళ్లు పూర్తి. ఉగ్రదాడుల్లో అమరులైన వారికి నివాళులర్పించిన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, గవర్నర్.

సింగరేణి గనులలో లే ఆఫ్.. ఎమర్జెన్సీ ఉద్యోగులకు మినహాయింపు

02-04-202002-04-2020 11:34:03 IST
Updated On 02-04-2020 12:23:53 ISTUpdated On 02-04-20202020-04-02T06:04:03.190Z02-04-2020 2020-04-02T06:03:57.218Z - 2020-04-02T06:53:53.146Z - 02-04-2020

సింగరేణి  గనులలో లే ఆఫ్.. ఎమర్జెన్సీ ఉద్యోగులకు మినహాయింపు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న వేళ అన్ని కంపెనీలు తమ ఉత్పత్తిని నిలిపివేశాయి. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. దీంతో ప్రజలు బయటకు రాకుండా ఇళ్లకే పరిమితమవుతున్నారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్నప్పటికీ సింగరేణి కార్మికులు కరెంటు ఉత్పత్తికి అవసరమైన బొగ్గును ఉత్పత్తి చేయడానికి తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులకు హాజరవుతున్నారు.

సింగరేణి సంస్థపై కూడా కరోనా ఎఫెక్ట్ పడింది. దీంతో బుధవారం సింగరేణి యాజమాన్యం అండర్‌ గ్రౌండ్‌ మైన్స్‌లో పనిచేస్తున్న కార్మికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. కార్మికులు విధులకు హాజరు కాకుండా ఉండేందుకు సింగరేణి యాజమాన్యం లాక్‌డౌన్‌కు బదులు లేఆఫ్‌ అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉపరిత గనులకు, మిషన్ మైన్స్ మినహా మిగతా భూగర్భ గనులను బుధవారం రెండవషిఫ్ట్ నుంచి మూసివేయాలని కేంద్ర కార్మిక శాఖ ఆదేశాలు జారీచేసిది. దీనికి అనుగుణంగా డైరెక్టర్ జనరల్ అఫ్ మైన్స్ సేఫ్టీ, చీఫ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ మైన్స్  డీకే సాహు ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణంగా భూగర్భ గనుల్లో పనిచేసే కార్మికులు సామాజిక దూరం పాటించలేని పరిస్థితిలో ఉంటారు. 

ఈ పరిస్థితుల్లో సింగరేణి యాజమాన్యం కార్మికుల ఆరోగ్యం, భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఏఎల్‌పీ, వీకే-7, శాంతి ఖని, జీడేకే-11ఏ ఇంక్లైన్‌, కొండాపూరం భూగర్భ గనులు మిషన్ మైన్స్ కాబట్టి వాటిని యథావిధిగా నడిపించనున్నారు. వాటితో పాటు అన్ని ఉపరితల గనులను యథావిథిగా నడపనున్నట్టు తెలిపింది యాజమాన్యం. వాటితో పాటుగానే మూసివేసిన గనుల్లో కూడా అవసరమైన విభాగాలకు చెందిన వారు మాత్రం హాజరుకావాల్సి ఉంటుందని చెప్పింది. లే ఆఫ్ సమయంలో విధులు నిర్వహించే కార్మికులకు ఫుల్ వేతనం, విధులకు హాజరుకాని కార్మికులకు సగం జీతం చెల్లించనుంది యాజమాన్యం. 

ఇటు తెలంగాణవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతోంది. కరోనా పాజిటివ్ కేసులు కూడా భారీగా పెరిగాయి. పెద్ద పల్లి జిల్లాకు ఇతర దేశాల నుండి వచ్చిన వారు 194మంది అని డీఎంహెచ్వో సుధాకర్ తెలిపారు. అలాగే, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 844 మంది అని వెల్లడించారు. వీరిలో 14 రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకున్న వారు 384 కాగా, ఢిల్లీ మర్కజ్ జమాతే కు వెళ్ళివచ్చిన వారు 8 మంది. వారు కాంటాక్ట్ అయిన వారు 38 మంది. సుల్తానాబాద్ మండలం గర్రెపెల్లి క్వారంటైన్ సెంటర్ కి వీరిని తరలించారు. జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కరోనా పాజిటివ్ నమోదు కాలేదని సుధాకర్ తెలిపారు. 

మహిళా ఖైదీలకు శుభ‌వార్త చెప్పిన జ‌గ‌న్ స‌ర్కార్‌

మహిళా ఖైదీలకు శుభ‌వార్త చెప్పిన జ‌గ‌న్ స‌ర్కార్‌

   9 hours ago


ప్ర‌చారం చివ‌రి రోజున భాగ్య‌న‌గ‌రానికి వ‌స్తున్న మోదీ.. మ‌త‌ల‌బేంటీ..?

ప్ర‌చారం చివ‌రి రోజున భాగ్య‌న‌గ‌రానికి వ‌స్తున్న మోదీ.. మ‌త‌ల‌బేంటీ..?

   9 hours ago


అమూల్ చేతికి సహకార డైరీలు.. అసలు రహస్యం ఇదే?! (పార్ట్-1)

అమూల్ చేతికి సహకార డైరీలు.. అసలు రహస్యం ఇదే?! (పార్ట్-1)

   10 hours ago


బండ్ల గ‌ణేశ్ కు ఇంట్లో బ్యాండుమేళం..!

బండ్ల గ‌ణేశ్ కు ఇంట్లో బ్యాండుమేళం..!

   11 hours ago


అబ్బో.. బీజేపీ మేనిఫెస్టో బందోబ‌స్తుగ‌నే ఉంది..!

అబ్బో.. బీజేపీ మేనిఫెస్టో బందోబ‌స్తుగ‌నే ఉంది..!

   12 hours ago


'కాపీ కొట్టడానికి కూడా తెలివి ఉండాలె' కేటీఆర్ సెటైర్లు

'కాపీ కొట్టడానికి కూడా తెలివి ఉండాలె' కేటీఆర్ సెటైర్లు

   12 hours ago


మొన్న స‌ర్జిక‌ల్, నిన్న కూల్చివేతలు, రేపేంటి..?

మొన్న స‌ర్జిక‌ల్, నిన్న కూల్చివేతలు, రేపేంటి..?

   13 hours ago


పంప‌కాల్లో తేడాలు.. వైసీపీలో గొడ‌వలు

పంప‌కాల్లో తేడాలు.. వైసీపీలో గొడ‌వలు

   13 hours ago


పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణసంకటం.. ఇదీ ఏపీలో ఉద్యోగుల పరిస్థితి!

పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణసంకటం.. ఇదీ ఏపీలో ఉద్యోగుల పరిస్థితి!

   13 hours ago


తెలంగాణ‌లో ఎంత మంది మంత్రి ప‌ద‌వులు ఊడ‌తాయో..!

తెలంగాణ‌లో ఎంత మంది మంత్రి ప‌ద‌వులు ఊడ‌తాయో..!

   14 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle