newssting
Radio
BITING NEWS :
ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రోత్సవాలు. నాల్గవరోజు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తోన్న దుర్గమ్మ. * పెచ్చులూడుతోన్న బెజవాడ కనకదుర్గా ఫ్లై ఓవర్. సోమవారం రాత్రి ఏపీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ రాంబాబుపై పడిన ఫ్లై ఓవర్ పెచ్చులు. తీవ్రగాయాలు కావడంతో రాంబాబును ఆస్పత్రికి తరలించిన సిబ్బంది. భారీ వర్షాల కారణంగానే ఇలా జరిగి ఉంటుందంటున్న అధికారులు. * తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,486 కేసులు, ఏడుగురు మృతి. యాక్టివ్ గా ఉన్న 20,686 కేసులు. * తెలంగాణ ప్రయాణికులకు సర్కార్ శుభవార్త. దసరా సందర్భంగా ఈ నెల 24 వరకూ రాష్ట్రంలో వివిధ జిల్లాలకు 3000 స్పెషల్ బస్సులు. ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్‌పల్లి, ఎస్సార్ నగర్, అమీర్‌పేట, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్డు, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల నుంచి నడవనున్న స్పెషల్ బస్సులు. * మహబూబాబాద్ వీడియో జర్నలిస్ట్ కొడుకు కిడ్నాప్. రూ.45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న కిడ్నాపర్లు. పోలీసులకు ఫిర్యాదు చేసిన జర్నలిస్ట్. * ఏపీకి భారీ వర్షసూచన. నేడు కృష్ణా, గుంటూరు, తూ.గో., ప.గో జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం.

సింగరేణిలో గులాబీ హవాకు కమలం చెక్

10-10-201910-10-2019 08:57:38 IST
Updated On 10-10-2019 16:01:28 ISTUpdated On 10-10-20192019-10-10T03:27:38.092Z10-10-2019 2019-10-10T03:22:07.057Z - 2019-10-10T10:31:28.910Z - 10-10-2019

సింగరేణిలో గులాబీ హవాకు కమలం చెక్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సింగరేణిలో గులాబి హవాకు కమలం చెక్ పెట్టనుందా? సింగరేణిలో పాగా వేయడానికి బీజేపీ గతంలో ఎన్నడూ లేనంతగా ప్రయత్నాలు సాగిస్తోంది. కేంద్ర మంత్రి హోదాలో కిషన్ రెడ్డి సింగరేణి ప్రాంతంలో పర్యటించిన సందర్భంగా ఆయన అధికార టీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

సింగరేణి నష్టాలకు తెరాస సర్కార్ కారణమని ఆరోపణలు గుప్పించారు. సింగరేణిలో తిరుగులేని పట్టు సంపాదించిన తెరాసను సైతం కలవరపెట్టే విధంగా కమలనాధుల వ్యూహాలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. టీఆర్ఎస్ సింగరేణిలో పాగా వేయడానికి సింగరేణి కార్మికులకు గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా పలు వరాలు కురిపించింది. 

బోనస్ లు ఇచ్చింది. వేతనాలను పెంచింది. సింగరేణి కార్మిక సంఘాలలో తిరుగులేని పట్టు సంపాదించింది. ఇక సింగరేణిలో గులాబీ హవాకు తిరుగు ఉండదని అందరూ భావిస్తున్న సమయంలో బీజేపీ వ్యూహాత్మకంగా సింగరేణిలో బలపడేందుకు అడుగులు వేస్తున్నది. ఆ బాధ్యతలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భుజానికెత్తుకున్నారు.

సింగరేణిలో  కార్మిక సంఘ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ వ్యూహాలకు పదును పెడుతున్నది. టీఆర్ఎస్ కార్మిక సంఘం నుంచే కాకుండా కాంగ్రెస్, వామపక్ష సంఘాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్మిక నేతల వలసల ప్రోత్సాహం జరుగుతోంది. బీఎంఎస్ బలోపేతమే లక్ష్యంగా కిషన్ రెడ్డి పకడ్బందీగా వ్యూహాలను అమలు చేస్తున్నారు.

ఇప్పటికే మాజీ ఎంపీ గడ్డం వివేక్ తో పాటు మాజీ ఎమ్మెల్యే సోమారపు, మాజీ కార్పొరేటర్లు కమలం గూటికి చేరారు. ఇప్పుడు ఇక ఆ పార్టీ కార్మిక నాయకులపై దృష్టి సారించింది.

తెలంగాణ రాష్ట్ర సమితి అనుబంధ బొగ్గు గని కార్మిక సంఘానికి చెందిన సీనియర్ నేత బీఎంఎస్ లోనికి చేరేందుకు రంగం సిద్ధమయ్యిందని, ఆయనతో పాటు పలువురు పలువురు కార్మికులు బీజేపీ అనుబంధ కార్మిక సంఘం తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారన్న ప్రచారం జరుగుతున్నది.

ఈ నేపథ్యంలో అప్రమత్తమైన టీఆర్ఎస్ బుజ్జగింపుల పర్వానికి తెరలేపిందని చెబుతున్నారు. ఇందుకోసం టిఆర్ఎస్ ఆ ప్రాంతానికి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలను రంగంలోనికి దించింది.

రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి కార్మిక సంఘంపై పట్టు సాధిస్తే ఆ ప్రభావం దాదాపు ఆరు జిల్లాలపై ఉంటుంది. అందుకోసమే రాజకీయ పార్టీలు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలలో తమ అనుబంధ సంస్థ గెలవడం కోసం సర్వశక్తులూ ఒడ్డుతాయి. గత ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రచారం చేసి హడావుడి చేసిన సంగతి విదితమే.

తెలంగాణ ఉద్యమంలో గులాబీ దళానికి తెలంగాణ కార్మికులంతా అండగా నిలిచిన సంగతి తెలిసిందే. 2014 సార్వత్రిక ఎన్నికలలో ఒక్క ఖమ్మం వినా...మిగిలిన అన్ని అన్ని జిల్లాల్లోనూ టీఆర్ఎస్ విజయకేతనం ఎగుర వేసింది. అలాగే 2017 సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలలోనూ కేసీఆర్ వ్యేహాత్మకంగా రంగంలోనికి దిగడడంతో టిబీజీకేఎస్ విజయబావుటా ఎగురవేసింది.

సింగరేణి బెల్ట్ లో గులాబీకి గట్టి పట్టు ఉన్నప్పటికీ...బీజేపీ పట్టుదలతో అమలు చేస్తున్న కార్యాచరణ బీఎంఎస్ కు ఏ మేరకు సానుకూల పవనాలు వీచే అవకాశాలునన్నాయన్న భావన టీఆర్ఎస్ శ్రేణుణలోనే వ్యక్తమౌతుండటం గమనార్హం.

ఈ నేపథ్యంలోనే పట్టు నిలుపుకోవడానికి టీఆర్ఎస్, బలోపేతం కావడానికి బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతుండడటంతో...గుర్తింపు సంఘం ఎన్నిక రసవత్తరంగా  జరిగే అవకాశాలు ఉన్నాయి.

ఏపీలో స్కూల్స్ ఓపెన్.. ఏర్పాట్ల‌లో స‌ర్కార్

ఏపీలో స్కూల్స్ ఓపెన్.. ఏర్పాట్ల‌లో స‌ర్కార్

   7 hours ago


గతపాలకులదే పాపమంటే ప్రజలు ఊరుకుంటారా!

గతపాలకులదే పాపమంటే ప్రజలు ఊరుకుంటారా!

   8 hours ago


కమ్మేస్తోంది.. కుమ్మేస్తోంది.. మళ్లీ వర్షంతో వణుకుతున్న హైదరాబాద్

కమ్మేస్తోంది.. కుమ్మేస్తోంది.. మళ్లీ వర్షంతో వణుకుతున్న హైదరాబాద్

   10 hours ago


విడ‌ద‌ల ర‌జ‌నీకి మంత్రి ప‌ద‌వి ఫిక్సా..?

విడ‌ద‌ల ర‌జ‌నీకి మంత్రి ప‌ద‌వి ఫిక్సా..?

   11 hours ago


అన్ని పరీక్షలు వాయిదా..!

అన్ని పరీక్షలు వాయిదా..!

   11 hours ago


తెలంగాణా సీఎం రిలీఫ్ ఫండ్ కి టాలీవుడ్ స్టార్స్ విరాళాలు

తెలంగాణా సీఎం రిలీఫ్ ఫండ్ కి టాలీవుడ్ స్టార్స్ విరాళాలు

   12 hours ago


లక్షాధిపతులను బిక్షాధిపతులను ఏకం చేసిన వరద

లక్షాధిపతులను బిక్షాధిపతులను ఏకం చేసిన వరద

   12 hours ago


కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతుల విషయంలో ఉల్లంఘనలు జరిగాయి: ఎన్జీటీ

కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతుల విషయంలో ఉల్లంఘనలు జరిగాయి: ఎన్జీటీ

   12 hours ago


లంకాదినకర్ సస్పెన్షన్ తో బీజేపీ ఇస్తున్న సంకేతాలేంటి..?

లంకాదినకర్ సస్పెన్షన్ తో బీజేపీ ఇస్తున్న సంకేతాలేంటి..?

   12 hours ago


విజయ్‌ సేతుపతి కుమార్తెనూ రేప్ చేస్తారంట.. మండిపడ్డ కనిమొళి

విజయ్‌ సేతుపతి కుమార్తెనూ రేప్ చేస్తారంట.. మండిపడ్డ కనిమొళి

   13 hours ago


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle