newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సాగు, తాగునీటి ఇబ్బందులకు స్వస్తి

25-02-202025-02-2020 09:51:05 IST
2020-02-25T04:21:05.573Z25-02-2020 2020-02-25T04:20:31.429Z - - 15-04-2021

సాగు, తాగునీటి ఇబ్బందులకు స్వస్తి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగు రాష్ట్రాల్లో నీటి కష్టాలు తప్పేలా లేవు. వర్షాలు తగ్గిపోవడం, వివిధ నదుల్లో నీటిమట్టాలు తగ్గిపోవడంతో నీటిని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఏపీ, తెలంగాణల్లో అయితే తాగు,సాగునీటికి అవ‌స‌ర‌మ‌య్యే నీటి జ‌లాల పంపిణీపై కృష్ణా నది యాజ మాన్య బోర్డు పలు సూచ‌న‌లు చేసింది. ఈ మేర‌కు తెలుగు రాష్ట్రాల నీటి పారుద‌ల శాఖ‌ల ఇంజ‌నీర్ల‌తో స‌మావేశ‌మై ప‌లు సూచ‌న‌లు జారీ చేసింది.సాగర్‌ జలాశయానికి శ్రీశైలం జలాశయం నుం చి నీటిని విడుదల చేయాలని బోర్డు ఆదేశించింది. అయితే, రానున్న రోజుల్లో తెలుగు రాష్ర్టాల అవసరాలను తీర్చేందుకు శ్రీశైలం జల విద్యుత్తు ద్వారా సాగర్‌కు నీటిని విడుదల చేయాలని బోర్డు ఆదేశించింది.

ప్రస్తుతం శ్రీశైలంలో 65.639 టీఎంసీలు, సాగర్‌లో 69.601 టీఎంసీల నీరు ఉంది. భవిష్యత్తు అవసరాల కోసం శ్రీశైలం నుంచి ఏపీకి 9.285 టీ ఎంసీలు, తెలంగాణకు 9.583 టీఎంసీల వంతున నీరు అవసరం. అదేవిధంగా నాగార్జునసాగర్‌ జలాశయం నుంచి ఏపీకి 31,113 టీఎంసీలు, తెలంగాణకు 83.334 టీఎంసీల వంతున మొత్తం 114.447 టీఎంసీల నీరు అవ‌స‌రం.

ఈ నేప‌ధ్యంలో తాగునీరు, వ్యవసాయ అవసరాలు తీర్చేలా ఇరు రాష్ర్టాలు సమన్వయంతో వ్యవహరించి నీటి పంప‌కాలు చేసుకోవాల‌ని బోర్డు ఆదేశించింది. రెండు రాష్ట్రాల అధికారులు నీటి వినియోగం విషయంలో పరస్పర సహకారంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle