newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సరూర్‌నగర్లో ఘనంగా ఉమెన్స్ డే ఉత్సవాలు

08-03-202008-03-2020 09:29:02 IST
2020-03-08T03:59:02.432Z08-03-2020 2020-03-08T03:55:34.594Z - - 16-04-2021

సరూర్‌నగర్లో ఘనంగా ఉమెన్స్ డే ఉత్సవాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హైదరాబాద్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథులుగా తెలంగాణ హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ,తెలంగాణ విద్యా శాఖ మంత్రి  సబితా ఇంద్రారెడ్డి,, తెలంగాణ డైరెక్టర్ జనరల్  ఆఫ్ పోలీసు మహేందర్ రెడ్డి,రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ మురళీధర్ భగవత్  సుమారు 2,500 మంది విద్యార్దిని విద్యార్థులు,, మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఐటీ సంస్థలు, కాలేజీల నుండి, 25 జిల్లాల పరిషత్ పాఠశాలలు నుంచి విద్యార్ధులు విచ్చేశారు. ఆనాడు మహాత్మాగాంధీ  చెప్పినట్లు గా ఒక మహిళ  అర్ధరాత్రి నడిస్తే స్వతంత్రం వచ్చినట్లు. ఆ మాట రాచకొండ కమిషనరేట్ పరిధి లో చూడాలని అన్నారు. ఎక్కడ మహిళలు పూజంపబడతారో అక్కడ దేవతలు ఉంటారని రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ అన్నారు. షీ టీం అనేది భయం వీడు నేను ఉన్నానని అభయం ఇచ్చేదన్నారు.  42 లక్షల జనాభా గల రాచకొండ కమిషనరేట్ మహిళల రక్షణలో ముందుందన్నారు. 

షీ టీం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో లింగ నిర్దారణ,  బాల్య వివాహాలను ఆరికట్టిందని. ప్రతి ఆడపిల్ల లకు మేము ఉన్నామని అభయం ఇస్తూ ముందు ఉంటుందని అన్నారు. హాజిపూర్ నుండి  విద్యనభ్యసించే విద్యార్థినులకు 6 కిలోమీటర్లు నడిచి వెళ్లే  విద్యార్థులకు మేము ఉన్నామని  లైన్స్ క్లబ్ ముందు కొచ్చి సైకిళ్లు  పంపిణీ చేసిన వారికి  ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్. 

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాచకొండ  కమిషనరేట్లో గత 7 రోజులుగా వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్న  కమిషనర్‌ను హృదయ పూర్వకంగా అభినందించారు తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు మహేందర్ రెడ్డి. గత  ఐదారేళ్ళ క్రితం తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఎలాంటి ఇబ్బందులు  పడకుండా ఉండేందుకు  షీ టీం ను ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. మహిళల భద్రతే  ప్రామాణికంగా షీ టీం అని, గత అరేళ్లలో మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నామని, రాచకొండ కమిషనరేట్ లో మార్గదర్శక కార్యక్రమాన్ని చేస్తున్నామని అన్నారు. 

అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం ఎంతో సంతోషకరం అని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళల పట్ల ఎంతో శ్రద్ద కనబరుస్తున్నారన్నారు. దానికి ఉదాహరణ  షీ టీమ్స్ అన్నారు తెలంగాణ హోంమంత్రి మహమ్మద్ అలీ. తెలంగాణ పోలీసులు దేశంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు తెస్తున్నారు. లా అండ్ ఆర్డర్ ఎక్కడ అయితే బాగుంటుందో అక్కడ పెట్టుబడులు వస్తాయి. కాబట్టి మన ముఖ్యమంత్రి పోలీసు విభాగానికి చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారు అని తెలిపారు.

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ మహిళల సమస్యలపై ఎక్కువగా స్పందించే వ్యక్తి రాచకొండ సీపీ మహేష్ భగవత్ అన్నారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్రంలో షీ టీమ్స్ ను తీసుకొని వచ్చి మహిళల రక్షణకు ఎంతో  ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. దేశంలోనే తలెత్తుకునే విధంగా పని చేస్తున్న తెలంగాణ పోలీసులను ఆమె అభినందించారు. మహిళలు ముఖ్యంగా విద్యార్ధినులు సమర్థులుగా, ధైర్యవంతులుగా అన్ని పాత్రలలో మమేకం కావాలని ఆమె ఆకాంక్షించారు. 

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   10 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   6 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   8 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   11 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   13 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   15 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   16 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   17 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   18 hours ago


ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

   19 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle