newssting
BITING NEWS :
*న్యూస్ స్టింగ్ వీక్షకులకు, శ్రేయోభిలాషులకు మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు *మాతృభాషాదినోత్సవ శుభాకాంక్షలు *నేడు మహాశివరాత్రి... శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు.. శివనామస్మరణతో మర్మోగుతున్న ఆలయాలు *వేములవాడ రాజన్న ఆలయానికి హెలికాప్టర్ సేవలు *శ్రీశైలంలో రాత్రి 10 గంటలకు లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలంకరణ, అమ్మవార్ల కల్యాణోత్సవం *పంచాయితీరాజ్ చట్టంలో సవరణలపై ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ. గత కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వ్యవధిని తగ్గించిన ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఆర్డినెన్స్ *వైఎస్ వివేకా హత్యకేసు విచారణను సీబీఐకి ఇవ్వాలన్న పిటిషన్ పై విచారణ. సిట్ విచారణను సీల్డ్ కవర్ లో అందజేసిన ఏజీ. సిట్ విచారణ దాదాపుగా పూర్తి కాబోతుందని, ఈ సమయంలో సీబీఐ విచారణ అవసరం లేదన్న ఏజీ.కేసు జనరల్ డైరీ, కేసు డైరీ ఫైల్స్ ను సోమవారానికి సమర్పించాలని ఏజీని ఆదేశించిన ఏపీ హైకోర్టు*అమరావతి: చంద్రబాబు, లోకేష్ అత్యంత అవినీతిపరులు. సమస్యలను పక్కదారి పట్టించేందుకే ఆస్తుల ప్రకటన-ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి *తిరుపతి: రుయా హాస్పిటల్ లో ఆవరణలో సైకోల వీరంగం. రుయా సెక్యూరిటీ సిబ్బందితో సైకోల వాగ్వాదం. బ్లేడులతో గాయపరుచుకున్న నలుగురు సైకోలు. భయంతో పరుగులు తీసిన నర్సులు *నేతలపై దాడులు చేస్తే ఎవరైనా వస్తారా..? పెట్టుబడులు వస్తాయా..? రైతుల ముసుగులో టీడీపీ గుండాలు నాపై దాడి చేసే ప్రయత్నం చేశారు-వైసీపీ ఎమ్మెల్యే రోజా

సమ్మె నుంచి బయటకొచ్చినా ఫలితం దక్కని ఆర్టీసీ సిబ్బంది

14-11-201914-11-2019 12:18:14 IST
Updated On 14-11-2019 17:53:43 ISTUpdated On 14-11-20192019-11-14T06:48:14.447Z14-11-2019 2019-11-14T06:47:46.083Z - 2019-11-14T12:23:43.832Z - 14-11-2019

సమ్మె నుంచి బయటకొచ్చినా ఫలితం దక్కని ఆర్టీసీ సిబ్బంది
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రెంటికీ చెడ్డ రేవడి అనే సామెత ప్రస్తుతం ఆర్టీసీ కార్మికుల సమ్మె నుంచి వైదొలగి ప్రభుత్వం కోరిన ప్రకారం డ్యూటీలో చేరుతున్నట్లు లేఖ రాసి ఇచ్చిన 200 పైగా తెలంగాణ ఆర్టీసీ సిబ్బందికి అటు ఉద్యోగమూ దక్కలేదు. ఇటు పరువూ మిగల్లేదు. దీంతో సమ్మెలో ఉండి తిరిగి విధుల్లో చేరిన ఆర్టీసీ కార్మికుల్లో కొందరి పరిస్థితి అయోమయంలో పడింది. 

ఈనెల ఐదవ తేదీ అర్ధరాత్రి లోపు విధుల్లో చేరినవారినే ఆర్టీసీ ఉద్యోగులుగా పరిగణిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు పెట్టిన గడువుకు 495 మంది విధుల్లో చేరేందుకు ఆసక్తి చూపుతూ లేఖలు ఇచ్చారు. వారిలో 220 మందే ఇప్పుడు విధులకు హాజరవుతున్నారు. మిగిలిన 275 మందిని సమ్మెలో ఉన్నట్టుగానే అధికారులు పరిగణిస్తున్నారు. వీరు సమ్మెలోకి వెళ్లకుండా విధుల్లో చేరేందుకు ఆసక్తి చూపిస్తుండగా.. అధికారులనుంచి పిలుపు రాకపోవటంతో వీరి పరిస్థితి గందరగోళంగా మారింది. 

అసలు విషయం ఏమిటంటే.. వీరు విధుల్లో చేరుతున్నట్లు సమర్పించిన లేఖలు తమకు అందలేదని డిపో మేనేజర్లు చెబుతున్నారు. ఇప్పటికే రెండు నెలల నుంచి వేతనాల్లేక ఇబ్బంది పడుతున్నందున, ఇప్పుడు డ్యూటీలో లేనట్టుగా అధికారులు పరిగణిస్తే ప్రస్తుత నెల వేతనం కూడా అందదన్న ఆందోళనతో ఉన్నారు.  

ఈనెల 2న సీఎం కేసీఆర్‌ ఇచ్చిన గడువు ప్రకటనకు తొలి రెండ్రోజులు కార్మికుల నుంచి స్పందనలేదు. పనిచేస్తోన్న డిపోలోనే కాకుండా ఏ డిపోలో లేఖ ఇచ్చినా స్వీకరిస్తామని, కలెక్టరేట్లు, పోలీసు స్టేషన్లు, ఆర్డీఓ కార్యాలయాలు..ఇలా కొన్ని ప్రత్యామ్నాయ కార్యాలయాలను ప్రకటించారు. దాంతో చివరిరోజు ఎక్కువ మంది కార్మికులు ఆయా ప్రత్యామ్నాయ కార్యాలయాల్లో అందజేశారు. ఈ లేఖల్లో కొన్ని మాత్రమే సంబంధిత డిపోలకు చేరగా, మిగతావి అందలేదు. ఇప్పుడదే ఈ గందరగోళానికి కారణమైంది.  

సమ్మె నుంచి బయటకొచ్చి ధైర్యం చేసి లేఖలిచ్చినా, అధికారులకు చేరకపోవటంతో వారు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు. తమకు గడువులోపు లేఖలు అందినవారినే విధుల్లోకి తీసుకున్నామని, లేఖలిచ్చి విధులకు రాని వారిని, లేఖలు ఇవ్వనివారిని సమ్మెలోనే ఉన్నట్టుగా పరిగణిస్తామని ఓ అధికారి పేర్కొన్నారు. 

అటు తోటి కార్మికుల వద్ద విలువా పోయింది. ఇటు ఆర్టీసీ యాజమాన్యం ఉద్యోగాల్లోకి చేర్చుకోను అంటోంది. నిజంగానే సకాలంలో లేఖలు ఇవ్వలేకపోయారంటున్న ఆ 200 మంది ఆర్టీసీ సిబ్బంది ఇప్పుడు త్రిశంకు స్వర్గంలో ఉంటున్నట్లే మరి.

 

 

భారత్ ధర్మ సత్రం కాదు.. పౌరసత్వం అంగడి సరుకుకాదు: స్వామి

భారత్ ధర్మ సత్రం కాదు.. పౌరసత్వం అంగడి సరుకుకాదు: స్వామి

   6 hours ago


గ్రామాలతోనే అభివృద్ధి.. సిరిసిల్ల రోల్ మోడల్

గ్రామాలతోనే అభివృద్ధి.. సిరిసిల్ల రోల్ మోడల్

   7 hours ago


చేను మేసిన కంచె.. చిత్తూరు కో ఆపరేటివ్ బ్యాంకులో భారీ స్కాం

చేను మేసిన కంచె.. చిత్తూరు కో ఆపరేటివ్ బ్యాంకులో భారీ స్కాం

   9 hours ago


వైఎస్ వివేకా కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. విచారణ వాయిదా

వైఎస్ వివేకా కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. విచారణ వాయిదా

   9 hours ago


గ్రేటర్‌ హైదరాబాద్‌కు ముందస్తు ఎన్నికలు?

గ్రేటర్‌ హైదరాబాద్‌కు ముందస్తు ఎన్నికలు?

   10 hours ago


ఉగాదికే ముహూర్తం.. రాజధాని తరలింపు ఖాయం

ఉగాదికే ముహూర్తం.. రాజధాని తరలింపు ఖాయం

   11 hours ago


‘‘రామ మందిరానికి ట్రస్ట్.. మరి మసీదు నిర్మాణం సంగతేంటి?’’

‘‘రామ మందిరానికి ట్రస్ట్.. మరి మసీదు నిర్మాణం సంగతేంటి?’’

   14 hours ago


ట్రంప్ కోసం యమునా నదికి సొగసులు

ట్రంప్ కోసం యమునా నదికి సొగసులు

   14 hours ago


శివనామస్మరణతో మారుమ్రోగుతున్న ఆలయాలు

శివనామస్మరణతో మారుమ్రోగుతున్న ఆలయాలు

   15 hours ago


వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు.. భక్తుల్లో ఆనందం

వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు.. భక్తుల్లో ఆనందం

   16 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle