newssting
BITING NEWS :
ఎన్డీయేతో బంధం తెంచుకున్న అకాలీదళ్. కేంద్రం తీసుకొచ్చిన బిల్లులకు వ్యతిరేకంగా అకాలీదళ్ నిర్ణయం. ఈ బిల్లుల ప్రభావం రైతులు, దళితులు, రైతు కూలీల అందరిపై పడిందని తెలిపిన అకాలీదళ్ చీఫ్ సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ప్రకటన. శనివారం పార్టీ నిర్వహించిన మూడు గంటల ఎమర్జెన్సీ కోర్ కమిటీ సమావేశం అనంతరం నిర్ణయం. 23 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ బంధాన్ని తెగతెంపులు చేసుకున్న అకాలీదళ్ * బాలీవుడ్‌ వివాదాస్పద నటి కంగనా రనౌత్‌పై కర్ణాటకలోని తుమకూరు కోర్టులో కేసు దాఖలు. కేంద్ర ప్రభుత్వ రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులను ఉగ్రవాదులతో పోల్చుతూ ట్వీట్‌ చేయడాన్ని తప్పుబడుతూ తుమకూరు జేఎంఎఫ్సీ కోర్టులో రమేశ్‌ నాయక్‌ అనే న్యాయవాది పిటిషన్‌ దాఖలు * అత్యంత ప్రతిష్టాత్మకమైన ఢిల్లీలోని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఎన్‌ఎల్‌యూ వైస్‌ చాన్సలర్‌గా వరంగల్‌ జిల్లాకు చెందిన ప్రొఫెసర్‌ పి.శ్రీకృష్ణదేవరావు నియామకం. ప్రస్తుత వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ రణబీర్‌ సింగ్‌ పదవీ విరమణ చేయడంతో శ్రీకృష్ణదేవరావు నియామకం. దేశంలోని పలు విశ్వవిద్యాలయాలలో కీలక బాధ్యతలు నిర్వహించిన శ్రీకృష్ణదేవరావు న్యాయ విద్యలో మార్పులు తీసుకువచ్చేందుకు యూజీసీ నియమించిన నిపుణుల కమిటీలో కూడా ఆయన సభ్యుడిగా కూడా పనిచేశారు * శివసేన నేత, లోక్ సభ సభ్యుడు సంజయ్‌ రౌత్‌, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఓ స్టార్ హోటల్ లో రహస్యంగా భేటీ అయినట్టు గుప్పుమన్న వార్తలు. ఓ లగ్జరీ హోటల్‌ లో సుమారు గంటన్నర పాటు వీరిమధ్య చర్చలు జరిగినట్టు సమాచారం. దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన ఈ సమావేశం వార్తలు. ఈ సమావేశం నిజమేనని, దీని వెనుక రాజకీయ కారణాలు లేవని స్పష్టం చేసిన బీజేపీ * అమెరికాలోని హిందూఆధ్యాత్మిక గురువు స్వామి ప్రత్యాగ్‌బోధానంద కన్నుమూత. పెన్సిల్వేనియాలో అర్ష విద్యా గురుకులానికి ఉపాధ్యక్షులుగా ఉన్న ప్రత్యాగ్‌బోధానంద వయసు 69 సంవత్సరాలు. గురుకులం 34వ వార్షిక ఉత్సవాల్లో పాల్గొన్న తర్వాత తీవ్రమైన గుండెపోటు రావడంతో ఈనెల 20తేదీన తుదిశ్వాస విడిచినట్టు తెలిపిన ఆయన శిష్యులు. ప్రత్యాగ్‌బోధానంద పార్థివదేహాన్ని భారత్‌కు తరలింపుకు ప్రయత్నాలు * పార్లమెంటు ఆమోదించిన మూడు వ్యవసాయ బిల్లులకి వ్యతిరేకంగా పంజాబ్‌లో కొనసాగుతున్న రైల్‌ రోకో ఆందోళన. గత మూడు రోజులుగా రైతులు రైలు పట్టాలపై కూర్చొని నిర్వహిస్తున్న రైల్‌ రోకో. తొలుత కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్ష్ కమిటీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తే, ఆ తర్వాత మద్దతు ప్రకటించిన వివిధ సంఘాలు * బాలీవుడ్‌ పరిశ్రమలో కలకలం సృష్టిస్తున్న డ్రగ్స్‌ వ్యవహారం. దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్‌, సారా అలీఖాన్‌ నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో ఎదుట శనివారం హాజరు. వేర్వేరుగా ఐదు గంటలకు పైగా కొనసాగిన విచారణ. నటీమణుల వాగ్మూలాన్ని రికార్డు చేసిన ఎన్సీబీ * ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రలలో పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలు శుక్రవారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు కురిసిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో అక్కడక్కడా నిలిచిన రాకపోకలు. పలుచోట్ల నీటమునిగిన పంట పొలాలు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా నందిగామలో 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు * అక్టోబరు 1 నుంచి సినిమా థియేటర్లు తెరిచేందుకు అనుమతినిచ్చిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం. ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా తెలియజేసిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. పరిస్థితులను గాడిలో పెట్టేందుకు అక్టోబరు 1 నుంచి సినిమా థియేటర్ల తెరిచేందుకు అనుమతినిస్తున్నామని, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, మ్యాజిక్ షోలు నిర్వహించేందుకు కూడా అనుమతినిస్తున్నామని ట్వీట్ * నెల్లూరు జిల్లాలో ఇటీవల జరిగిన రౌడీషీటర్ దారుణ హత్య మరువక ముందే చోటు చేసుకున్న మరో ఘటన. చిల్లకూరు మండలం కలవకకొండలో చేజర్ల సుబ్రహ్మణ్యం(38) అనే వ్యక్తి దారుణ హత్య. ఆదివారం ఉదయం అతి కిరాతకంగా చంపేసిన గుర్తు తెలియని వ్యక్తులు. సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు * సంగారెడ్డిలో వాగు దాటుతున్న వ్యక్తి వరద నీటిలో గల్లంతు. భారీ వర్షాలకు వాగు దాటుతున్న ముగ్గరు వ్యక్తులు గల్లంతవ్వగా ఇద్దరు వ్యక్తులను ఒడ్డుకు చేర్చిన స్థానికులు. కంగ్టి మండలం జంగి బికి చెందిన 55 ఏళ్ల మంగలి మారుతి కాకి వాగు వరద ఉధృతిలో గల్లంతు. మారుతి ఆచూకీ కోసం మండల రెవెన్యూ అధికారుల గాలింపు చర్యలు.

సమ్మె చేయడం, విధుల్లో చేరటం మీ ఇష్టమేనా... ఆర్టీసీ ఎండీ

26-11-201926-11-2019 11:00:11 IST
Updated On 26-11-2019 15:30:26 ISTUpdated On 26-11-20192019-11-26T05:30:11.187Z26-11-2019 2019-11-26T05:30:08.440Z - 2019-11-26T10:00:26.547Z - 26-11-2019

సమ్మె చేయడం, విధుల్లో చేరటం మీ ఇష్టమేనా... ఆర్టీసీ ఎండీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గత 52 రోజులుగా సమ్మెబాట పట్టి ప్రభుత్వానికి చివరివరకు సవాల్ విసిరిన ఆర్టీసీ కార్మికులకు కల్లో కూడా ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. తక్షణం సమ్మెనుంచి వైదొలుగుతున్నామని మంగళవారం ఉదయం నుంచి విధుల్లో చేరతామని ప్రకటించిన ఆర్టీసీ కార్మికులకు యాజమాన్యం మొండి చేయి చూపింది. సమ్మె చేయడం, తిరిగి మానడం, విధుల్లో చేరతామనడం మీ ఇష్టమేనా.. కుదరదు కాక కుదరదు... హైకోర్టు సూచన ప్రకారం లేబర్‌ కమిషనర్‌ నిర్ణయం తీసుకునేవరకు ఆర్టీసీ సిబ్బంది వేచి చూడాల్సిందేనని ఆర్టీసీ యాజమాన్యం తేల్చిచెప్పింది.

బేషరతుగా సమ్మె నిలిపివేస్తున్నామని, మంగళవారం నుంచి విధుల్లో చేరతామని ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రకటించిన దరిమిలా సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో కేసీఆర్ ఆర్టీసీ సిబ్బంది ఏకపక్ష ప్రకటనపై మండిపడ్డట్టు తెలిసింది. సిబ్బంది చేతులెత్తేసినా సరే.. వారిని పట్టించుకోవద్దని, రెండు వారాల్లోపు లేబర్ కమిషనర్ ఆర్టీసీ సమ్మెపై తుది నిర్ణయం తీసుకునేవరకు ఏ ఒక్కరినీ విధుల్లో చేర్చుకోవద్దని సీఎం కఠినంగా ఆదేశింఛినట్లు సమాచారం.

ముఖ్యమంత్రితో సమీక్ష అనంతరం ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ సునీల్ శర్మ చేసిన పత్రికా ప్రకటన ఆర్టీసీ సిబ్బందిపై పిడుగుపాటులా పడింది. ఇష్టానుసారం సమ్మె చేసి తాజాగా ఆర్టీసీ జేఏసీ తీసుకున్న నిర్ణయం హాస్యాస్పదంగా ఉందని సునీల్‌ శర్మ పేర్కొన్నారు. కార్మికులు పండగ సమయాల్లో అనాలోచితంగా సమ్మె చేసి.. ప్రజలకు తీవ్రమైన అసౌకర్యం కలిగించారని విమర్శించారు. ఇష్టమొచ్చినప్పుడు సమ్మె చేసి.. ఇప్పుడు వచ్చి విధుల్లో చేరతామంటే కుదరదని అన్నారు. 

అదే సమయంలో ఇన్నాళ్లుగా విధుల్లో పాల్గొంటున్న తాత్కాలిక డ్రైవర్లను అడ్డుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సునీల్‌ శర్మ  హెచ్చరించారు. రేపు డిపోల వద్ద శాంతి భద్రతల సమస్య సృష్టించవద్దని కార్మికులకు సూచించారు. అన్ని డిపోల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి.. పరిస్థితులను సమీక్షిస్తామని తెలిపారు. 

ఆర్టీసీ యాజమాన్యం కానీ, ప్రభుత్వం కానీ కార్మికులకు సమ్మె చేయమని చెప్పలేదని వ్యాఖ్యానించారు. కార్మికులు యూనియన్ల మాటలు విని ఇప్పటికే  నష్టపోయారు.. ఇక ముందు వారి మాటలు విని నష్టాలు కోరి తెచ్చుకోవద్దని అన్నారు. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే ఆర్టీసీ యాజమాన్యం క్షమించదని తెలిపారు. హైకోర్టు సూచించిన ప్రకారం లేబర్‌ కమిషనర్‌ నిర్ణయం తీసుకునేవరకు వేచి చూడాలని కార్మికులకు సూచించారు. ఆ నిర్ణయం ప్రకారం ఆర్టీసీ యాజమాన్యం తదుపరి చర్యలు తీసుకుంటుందని.. అప్పటివరకు సంయమనం పాటించాలని కోరారు. 

సమ్మె విరమణ ప్రకటనను కూడా సునీల్ శర్మ తీవ్రంగా తప్పుపట్టారు. ఓవైపు పోరాటం కొనసాగుతుందని చెబుతూనే.. మరోవైపు సమ్మె విరమణ అంటున్నారని మండిపడ్డారు. కార్మికులు ఇష్టమొచ్చినట్లు విధులకు గైర్హాజరై.. ఇష్టమొచ్చినప్పుడు మళ్లీ విధుల్లోకి చేరుతారా? అని ప్రశ్నించారు. ఆర్టీసీ గానీ, ప్రభుత్వం గానీ సమ్మె చేయమని చెప్పలేదన్నారు. కార్మికులు చట్ట విరుద్ధమైన సమ్మెలో ఉన్నారని అన్నారు. దీనిపై కార్మికశాఖ కమిషనర్ సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. అంతా చట్ట ప్రకారం, పద్ధతి ప్రకారం జరుగుతుందన్నారు.

ఇన్నాళ్ల సమ్మె తర్వాత కూడా తమను డిపోల్లోకి రావద్దని ప్రభుత్వం తీవ్ర నిర్ణయం తీసుకోవడం  ఆర్టీసీ సిబ్బందిని వణికిస్తోంది. విధులకు హాజరుకాని సిబ్బంది సెల్ఫ్ డిస్మిస్ అయినట్లేనని ముఖ్యమంత్రి కేసీఆర్ గత నెల మొదటివారం చేసిన హెచ్చరిక ఇప్పటికీ అమలవుతున్నట్లే లెక్క. రెండు నెలలుగా జీతాలు లేక కుటుంబాలను పస్తులు పెట్టి తాము సాధించిందేమిటన్న వ్యధ కార్మికులకు మిగలగా ఏమీ జరగదని, ఆందోళన చెందవద్దని యూనియన్లు చెబుతున్న మాటలు సిబ్బందిలో నమ్మకాన్ని పెంచలేకపోతున్నాయి.

 

చేతులు మారుతున్న ఏపీలో పోర్టులు..  కాకినాడ పోర్టు అరబిందో కైవ‌సం?!

చేతులు మారుతున్న ఏపీలో పోర్టులు.. కాకినాడ పోర్టు అరబిందో కైవ‌సం?!

   8 hours ago


గ్రేటర్ వరద ప్రాంతాలలో రేవంత్ పర్యటన.. కారుని ఢీ కొడతారా?

గ్రేటర్ వరద ప్రాంతాలలో రేవంత్ పర్యటన.. కారుని ఢీ కొడతారా?

   9 hours ago


ఏపీకి మ‌ద్యం అక్ర‌మ ర‌వాణాలో కొత్త పుంత‌లు

ఏపీకి మ‌ద్యం అక్ర‌మ ర‌వాణాలో కొత్త పుంత‌లు

   10 hours ago


యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కలిసిన 'రవికిషన్'

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కలిసిన 'రవికిషన్'

   10 hours ago


బీజేపీలో పురందేశ్వ‌రికి కీల‌క ప‌ద‌వి... సామాజిక స‌మీక‌ర‌ణే ఎజెండా

బీజేపీలో పురందేశ్వ‌రికి కీల‌క ప‌ద‌వి... సామాజిక స‌మీక‌ర‌ణే ఎజెండా

   11 hours ago


అంబటి భూకబ్జా లీకులు.. సొంత పార్టీ నేతలే టార్గెట్ చేశారా?

అంబటి భూకబ్జా లీకులు.. సొంత పార్టీ నేతలే టార్గెట్ చేశారా?

   11 hours ago


ఎన్‌డీఏకు అకాలీదళ్‌ గుడ్‌బై.. రైతు వ్యతిరేక బిల్లులపై విభేదం

ఎన్‌డీఏకు అకాలీదళ్‌ గుడ్‌బై.. రైతు వ్యతిరేక బిల్లులపై విభేదం

   12 hours ago


డీకే అరుణకి జాతీయ పదవి.. రెడ్డి సామాజికవర్గంపై బీజేపీ టార్గెట్?

డీకే అరుణకి జాతీయ పదవి.. రెడ్డి సామాజికవర్గంపై బీజేపీ టార్గెట్?

   12 hours ago


ఏపీని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. పంటనష్టం

ఏపీని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. పంటనష్టం

   14 hours ago


తెలంగాణలో ఆడపిల్లను లక్ష్మిలా కొలుస్తున్నారు.. మంత్రి హరీష్ రావు

తెలంగాణలో ఆడపిల్లను లక్ష్మిలా కొలుస్తున్నారు.. మంత్రి హరీష్ రావు

   15 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle