newssting
BITING NEWS :
* నేను తెలంగాణను కించ పర్చేలా మాట్లాడలేదు.. తెలంగాణలోని ప్రధాన పట్టణాలకు రైల్ కనెక్టివిటీ లేదని చెప్పాలన్నదే నా ఉద్దేశ్యం.. ఆంధ్ర పాలకుల హయాంలో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందని చెప్పా-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి *కాంగ్రెస్‌ ఎంపీ అహ్మద్‌పటేల్‌కు ఐటీశాఖ నోటీసులు.. రూ.400 కోట్ల హవాలా మనీ కేసులో సమన్లు.. ఫిబ్రవరి 11నే నోటీసులు జారీ చేసిన ఐటీశాఖ.. హాజరుకాకపోవడంతో మరోసారి నోటీసులు*కోవిడ్‌-19 బారిన పడి వుహాన్‌ వుచాంగ్‌ హాస్పిటల్‌ డైరక్టర్‌ మృతి.. కరోనాపై ఫస్ట్‌ హెచ్చరిక జారీ చేసిన లియూ చిమింగ్‌... ఆయన మృతికి సంతాపం ప్రకటించిన చైనా వాసులు*ధాన్యం కొనుగోలు కోసం నిధులను కేటాయించారా.. లేదా?, కేటాయిస్తే ఆ నిధులు ఎటుపోయాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలి-పవన్ కల్యాణ్ *ఎన్నికల వరకే రాజకీయం.. ఆ తర్వాత ప్రభుత్వ పథకాలే ముఖ్యం, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే రేపటి నాయకులు-కేసీఆర్* భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం... ట్రంప్ పర్యటన నేపథ్యంలో కీలక నిర్ణయాలు *పాకిస్థాన్‌లో ముస్లింల సంఖ్య 23 శాతం తగ్గిందట.. మరి వాళ్లంతా ఏమయ్యారు, చనిపోయి ఉండాలి.. ఇస్లామిక్‌లోనైనా కలిసి ఉండాలి లేదా భారత్‌లో చొరబడి స్థిరపడి ఉండాలి!-పీయూష్ గోయల్

సమ్మెపై స్పందించకపోతే బంద్‌కి రెడీ

09-10-201909-10-2019 15:44:44 IST
2019-10-09T10:14:44.938Z09-10-2019 2019-10-09T10:14:41.683Z - - 19-02-2020

సమ్మెపై స్పందించకపోతే బంద్‌కి రెడీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెపై పట్టువీడడంలేదు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో అఖిలపక్ష పార్టీల నేతలతో ఆర్టీసీ జేఏసీ భేటీ అయింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికుల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి సంచలన ప్రకటన చేశారు.

ప్రభుత్వం దిగిరాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పాటిస్తామని హెచ్చరించారు. ఆర్టీసీ సమ్మెకు ఉద్యోగ సంఘాలు కూడా మద్దతు ఇవ్వాలని కోరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగ సంఘాలన్నీ ఎంతో పోరాటం చేశాయని.. ఆ స్ఫూర్తితోనే తాము ఇప్పుడు ఆర్టీసీని కాపాడుకునేందుకు సమ్మె చేస్తున్నామన్నారు.

ఆర్టీసీ విషయంలో ప్రభుత్వం పట్టువీడకపోతే త్వరలో అఖిలపక్షం, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, కుల సంఘాలతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తామని అశ్వథామరెడ్డి ప్రకటించారు. సమ్మెపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుండటంతో... సర్కార్‌పై పోరాటం చేసేందుకు ఆర్టీసీ కార్మికులు సిద్ధమవుతున్నారు. సమ్మెపై ఏ విధంగా ముందుకు వెళ్లాలి, న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా పోరాడటానికి ఏం చేయాలనే దానిపై అఖిలపక్ష సమావేశంలో చర్చించారు.

అప్పుల్లో ఉన్న ఆర్టీసీనీ ప్రయివేటీకరణ చేస్తానని చెబుతున్న సీఎం కేసీఆర్‌.. మరి అప్పుల్లో ఉన్న ప్రభుత్వాన్ని ప్రయివేట్‌ వ్యక్తులకు అప్పగించగలరా అంటూ జస్టిస్‌ చంద్రకుమార్‌ ప్రశ్నించారు. కేసీఆర్‌ ప్రభుత్వానికి ఎయిర్‌బస్‌పై ఉన్న ప్రేమ ఎర్రబస్సుపై లేదని టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు.  ప్రస్తుతం ఆర్టీసీలో 1200 మంది ఉద్యోగులే ఉన్నారన్న కేసీఆర్‌ ప్రకటన రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఆర్టీసీని ప్రైవేట్‌ చేస్తే.. కేసీఆర్‌కు తగిన బుద్ధి చెప్తామని.. కర్రు కాల్చి వాత పెట్టే సందర్భం వస్తుందని రావుల హెచ్చరించారు.ఆర్టీసీ సమ్మెకు సీపీఎం పూర్తి మద్దతిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు.

ఆర్టీసీ సమ్మె వ్యవహారంలో కార్మికులకు జర్నలిస్టు సంఘాలతో పాటు సీపీఐ తన మద్దతు ప్రకటించింది. సమ్మె వ్యవహారంపై కోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో... ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేయాలని కార్మిక సంఘాల నేతలు భావిస్తున్నట్టు సమాచారం.

మరోవైపు ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే అంశం కూడా ఆసక్తికరంగా మారింది. ఈ అంశంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జోక్యం చేసుకుని ప్రభుత్వాన్ని వివరణ కోరే అవకాశం లేకపోలేదనే చర్చ కూడా సాగుతోంది.

ఇప్పటికే తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెపై గవర్నర్ ద్వారా కేంద్రం ఆరా తీసినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో... ఈ అంశంపై గవర్నర్ ఏ రకంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

అఖిలపక్ష భేటీలో సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, తెలంగాణ జన సమితి నేత కోదండరాం, టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి, మంద కృష్ణ మాదిగ, బిసి సంక్షేమ సంఘం నేత ఆర్.కృ‌ష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. మరోవైపు.ఆర్టీసీ సమ్మె వ్యవహారంలో జోక్యం చేసుకోవాల్సిందిగా కార్మికల సంఘాల నేతలు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఎలాంటి మలుపు తిరుగుతుందో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle