newssting
BITING NEWS :
* భారత్-అమెరికా మధ్య కుదిరిన ఐదు ఒప్పందాలు.. ట్రంప్‌తో నాకు ఇది ఐదో సమావేశం, ట్రంప్ సకుటుంబంగా భారత్‌కు రావడం సంతోషంగా ఉంది-ప్రధాని మోడీ*మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగింది, సహజవాయురంగంలో ఒప్పందం చేసుకున్నాం-డొనాల్డ్ ట్రంప్ *ఇండియాతో మాకు ప్రత్యేక అనుబంధం, ఈ టూర్ ఎప్పటికీ మర్చిపోలేను, రెండు దేశాలకు ఇది ఉపయోగకరమైన పర్యటన, ఇస్లాం తీవ్రవాదంపై కూడా చర్చించాం-ట్రంప్ * నిర్భయ దోషుల ఉరి శిక్షలో మరో ట్విస్ట్..! విచారణ 5వ తేదీకి వాయిదా *ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెన్షన్ రద్దుచేసిన క్యాట్.. కృష్ణకిషోర్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్‌ అనుమతి, కృష్ణకిషోర్‌పై కేసులను ప్రభుత్వం చట్టప్రకారం పరిశీలించుకోవచ్చన్న క్యాట్ *ఢిల్లీ సర్వోదయ స్కూల్‌లో అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్... హ్యాపిసెన్ క్లాస్‌లను పరిశీలించిన మెలానియా*రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. నోటిఫికేషన్‌ మార్చి 6, నామినేషన్లకు చివరి తేది మార్చి 13, నామినేషన్ల పరిశీలన మార్చి 16, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది మార్చి 18, మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ * సాయంత్రం మోడీ-ట్రంప్ విందుకు హాజరుకానున్న ప్రముఖులు. రాలేనని సందేశం పంపిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్

సమ్మెపై సర్కార్ సమ్మెట- ప్రజాస్వామ్య హక్కుల సమాధి!

14-10-201914-10-2019 07:35:41 IST
Updated On 14-10-2019 12:25:30 ISTUpdated On 14-10-20192019-10-14T02:05:41.910Z14-10-2019 2019-10-14T02:05:29.133Z - 2019-10-14T06:55:30.406Z - 14-10-2019

సమ్మెపై సర్కార్ సమ్మెట- ప్రజాస్వామ్య హక్కుల సమాధి!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కక్ష సాధింపు ధోరణి అవలంబిస్తున్నారు. సమ్మెకు బయట నుంచి ప్రభుత్వోద్యోగుల మద్దతు లభించకుండా వారిపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. అదే సమయంలో చర్చల ద్వారా సమ్మె పరిష్కారానికి ఉన్న అవకాశాలను ఇసుమంతైనా పరిశీలించడం లేదు.

సమ్మె సాకుతో ఆర్టీసీ కార్మకులను మూకుమ్మడిగా డిస్మిస్ చేసిన తెలంగాణ సర్కార్...తాత్కాలిక ఉద్యోగుల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేయడం ద్వారా సమ్మెలో ఉన్న కార్మికులలో అభద్రతా భావాన్నీ, ఆందోళననూ పెంచే వ్యూహాన్ని ఆర్టీసీ అనుసరించింది. డిమాండ్ల సాధన కోసం సమ్మె అన్నది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు.

ఈ హక్కును సంపూర్ణంగా వినియోగించుకోవడం ద్వారానే కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ సాధన ఉద్యమం సుదీర్ఘంగా సాగి విజయం సాధించింది. సకల జనుల సమ్మె, వంటా వార్పూ వంటి ఆందోళనా రూపాలలో అప్పట్లో ఆర్టీసీ కార్మికులుల కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నారు. తెలంగాణ సాధన కోసం అప్పట్లో ఆర్టీసీ కార్మికుల కృషిని, అంకిత భావాన్ని కేసీఆర్ బహుదా ప్రశంసించారు.

ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత తన పాలనలో డిమాండ్ల సాధన కోసం గొంతెత్తడాన్ని ఆయన సహించలేకపోతున్నారు.  తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాడు సకల జనులు రోడ్లపైకి వచ్చి ఆందోళనా కార్యక్రమాలలో భాగస్వామ్యులైనది నిరంకుశ తెలంగాణ కోసం కాదు.

ప్రజాస్వామ్య తెలంగాణ కోసం. అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు. ఎన్జీవోలు హఠాత్తుగా సమస్య ఆర్టీసీ కార్మికులది, మాది కాదు...మద్దతు ఇవ్వం అని ప్రకటించడం రాష్ట్ర ప్రభుత్వ విభజించు- పాలించు విధానానికి నిలువెత్తు నిదర్శనంగానే చూడాల్సి ఉంటుంది.

కార్మికుల డిమాండ్ల పట్ల ఇంత కఠినంగా, ఇంత దుర్మార్గంగా వ్యవహరించడాన్ని ప్రజాస్వామ్య వాదులెవరూ హర్షించరు. 50 వేల మంది  ఆర్టీసీ కార్మికులకు ఉద్వాసన చెప్పి...తాత్కాలిక నియామకాలు చేపట్టి సంస్థను లాభాల బాటలో నడుపుతాననడం కేసీఆర్ కే చెల్లింది. తాత్కాలిక ఉద్యోగులతో... ఇవ్వకుండా ట్రక్కులూ లారీలు నడిపిన అనుభవం ఉన్న వారి చేతికి  ప్రజా రవాణా వ్యవస్థను  అప్పగించడమంటే ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టడం తప్ప మరొకటి కాదు.

తెలంగాణ ఉద్యమం కోసం ఆత్మబలిదానం చేసిన అమరుల్లాగే...ఇప్పుడు ఆర్టీసీ పరిరక్షణ కోసం కార్మికులు ఆత్మబలిదానాలకు సిద్ధమౌతున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఖమ్మం జిల్లాకు చెందిన ఆర్టీసీ కార్మికుడు శనివారం నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన తరువాతైనా సీఎం ధోరణి మారకపోవడం విచారకరం. ఇటువంటి సంఘటనలు మరిన్ని జరిగితే బాధ్యత కచ్చితంగా ప్రభుత్వానిదే అవుతుంది. ఈ విషయాన్ని సీఎం గుర్తించకపోవడం ఎంత మాత్రం సమంజసం కాదు.

ఇంతకీ కార్మికులు అడుగుతున్నవి గొంతెమ్మ కోర్కెలు కావు. మొత్తం రాష్ట్ర బడ్జెట్ లక్షా 46 వేల కోట్ల రూపాయలు అయితే...అందులో ఆర్టీసీ నుంచి ప్రభుత్వానికి పన్నుల రూపేణా వస్తున్నది ఏడాదికి అక్షరాలా ఏడువందల ఏభై కోట్లు. ఇప్పుడు కార్మికులు కోరుతున్నది సంస్థకు పన్ను రాయితీగా వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించాలని మాత్రమే.

ఇదేమీ కోరరాని కోరిక కానేకాదు.  మొత్తం బడ్జెట్ లో ఒక శాతం కంటే తక్కువ. ఇది కూడా ముఖ్యమంత్రిగారికి అడగరానిదిగా తోస్తున్నది. ఆర్టీసీ ఉద్యోగుల కాలిలో ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తానని చెప్పిన ముఖ్యమంత్రికి ఇప్పుడు వారు సంస్థ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరడం కంటగింపుగా మారింది. స్వయంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని ఇచ్చిన హామీని ఆయన ఉద్దేశ పూర్వకంగా విస్మరించి...దానిని గుర్తు చేస్తున్న కార్మికులపై కక్ష సాధింపుతో వ్యవహరిస్తున్నారు. 

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఈ తీరుతో వ్యవహరించడం తగదు. ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం విషయంలో పట్టు విడుపులతో వ్యవహరించాలి. చర్చలతో పరిష్కారం కాని సమస్య ఉండదు. ఆ దిశగా కేసీఆర్ అడుగులు వేయకుంటే సమస్య మరింత జటిలమయ్యే అవకాశం ఉంది.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle