newssting
BITING NEWS :
* భారత్-అమెరికా మధ్య కుదిరిన ఐదు ఒప్పందాలు.. ట్రంప్‌తో నాకు ఇది ఐదో సమావేశం, ట్రంప్ సకుటుంబంగా భారత్‌కు రావడం సంతోషంగా ఉంది-ప్రధాని మోడీ*మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగింది, సహజవాయురంగంలో ఒప్పందం చేసుకున్నాం-డొనాల్డ్ ట్రంప్ *ఇండియాతో మాకు ప్రత్యేక అనుబంధం, ఈ టూర్ ఎప్పటికీ మర్చిపోలేను, రెండు దేశాలకు ఇది ఉపయోగకరమైన పర్యటన, ఇస్లాం తీవ్రవాదంపై కూడా చర్చించాం-ట్రంప్ * నిర్భయ దోషుల ఉరి శిక్షలో మరో ట్విస్ట్..! విచారణ 5వ తేదీకి వాయిదా *ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెన్షన్ రద్దుచేసిన క్యాట్.. కృష్ణకిషోర్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్‌ అనుమతి, కృష్ణకిషోర్‌పై కేసులను ప్రభుత్వం చట్టప్రకారం పరిశీలించుకోవచ్చన్న క్యాట్ *ఢిల్లీ సర్వోదయ స్కూల్‌లో అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్... హ్యాపిసెన్ క్లాస్‌లను పరిశీలించిన మెలానియా*రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. నోటిఫికేషన్‌ మార్చి 6, నామినేషన్లకు చివరి తేది మార్చి 13, నామినేషన్ల పరిశీలన మార్చి 16, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది మార్చి 18, మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ * సాయంత్రం మోడీ-ట్రంప్ విందుకు హాజరుకానున్న ప్రముఖులు. రాలేనని సందేశం పంపిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్

సమ్మెపై కేసీఆర్ మొండిపట్టుకు కారణమేంటి?

14-10-201914-10-2019 13:06:08 IST
Updated On 14-10-2019 15:24:26 ISTUpdated On 14-10-20192019-10-14T07:36:08.390Z14-10-2019 2019-10-14T07:36:06.496Z - 2019-10-14T09:54:26.826Z - 14-10-2019

సమ్మెపై కేసీఆర్ మొండిపట్టుకు కారణమేంటి?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ రోడ్డు రవాణా కార్పొరేషన్ ఉద్యోగులు, కార్మికులు సాగిస్తున్న సమ్మెపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఎందుకింత కఠినంగా మాట్లాడుతున్నారనేది సామాన్య ప్రజలకే కాకుండా సీనియర్ రాజకీయ విశ్లేషకులకు కూడా అంతుపట్టడం లేదు. ఒకవైపు తీవ్ర నిరాశా నిస్పృహలకు గురై ఆర్టీసీ సిబ్బంది బలవన్మరణాలకు పాల్పడుతున్నప్పటికీ మరోవైపు ముఖ్యమంత్రితోపాటు మంత్రులు కూడా ఆర్టీసీ సిబ్బందితో చర్చల ప్రసక్తే లేదని, ఉద్యోగాల్లోకి సమ్మెలో పాల్గొన్న సిబ్బందిని ఎట్టిపరిస్థితుల్లోనూ తీసుకోబోమని పదిరోజుల తర్వాత కూడా ప్రకటించడంలోని ఆంతర్యం ఏమిటన్నది తలపండిన మేధావులకు కూడా అర్థం కావడం లేదు. 

ఆర్టీసీ ఉద్యోగులతో చర్చల ప్రసక్తే లేదని తేల్చిపడేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ మరో రెండు మూడు రోజుల్లో నూటికి నూరు శాతం ఆర్టీసీ బస్సులు రాష్ట్ర రహదారులపై తిరిగేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ సిబ్బంది సాగిస్తున్న అక్రమమైన, చట్టవిరుద్ధమైన సమ్మెను ఏ పరిస్థితుల్లోనూ తాము గుర్తించబోమని కేసీఆర్ తేల్చి చెప్పారు.

సమ్మెలో పాల్గొంటున్న ఆర్టీసీ సిబ్బందితో చర్చలు జరిపే ప్రశ్నే లేదు. ఉద్యోగులు తమ ఇష్టప్రకారం సమ్మెకు దిగారు, విధులకు గైర్ హాజరయ్యారు కాబట్టే వారిని తిరిగి విధుల్లోకి తీసుకోబోమని కేసీఆర్ చెప్పారు. పైగా సమ్మెలో పాల్గొనకుండా విధులకు హాజరైన సిబ్బందికి మాత్రమే సెప్టెంబర్ వేతనాలు చెల్లించాలని అధికారులను ఆదేశించిన కేసీఆర్ అగ్నికి మరింత ఆజ్యం పోశారు.

కానీ కేసీఆర్ మర్చిపోతున్న విషయం ఏమిటంటే, ఎంతమంది డ్రైవర్లను, కండక్టర్లను కొత్తగా నియమించుకున్నా నూరు శాతం బస్సులు నడపడానికి సరిపోరన్నదే. ఎందుకంటే బస్సులు నడిపేది, టిక్కెట్లు తెంపేది డ్రైవర్లు, కండక్టర్లు మాతమే కావచ్చు కానీ ఆ బస్సుల నిర్వహణకు అవసరమైన సాంకేతిక సిబ్బంది లేకుంటే బస్సులు డిపోలనుంచి బయటకు రాలేవు. ప్రతిరోజూ బస్సుల బాగోగులను పట్టించుకునే మెకానిక్కులు లేకుంటే, బస్సులను నీట్‌గా, పరిశుభ్రంగా చేసే క్లీనింగ్ సిబ్బంది లేకుంటే, క్యాష్ రిజిష్టర్లు, లాగ్ బుక్స్ నిర్వహించే అకౌంటింగ్  స్టాఫ్ లేకుంటే ఆర్టీసీ బస్సు రోడ్డెక్కే ప్రశ్నే లేదు.

ఈ వాస్తవం తెలిసినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ నూరు శాతం బస్సులను నడిపించే బాధ్యతను ఆర్టీసీ అధికారులపై మోపడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇంతవరకు ఎలాగోలో ప్రైవేట్ బస్సు ఆపరేటర్లతో నెట్టుకొస్తున్న అధికారులు అన్ని బస్సులను రోడ్డెక్కించాలంటే అన్ని రకాల స్టాఫ్ సిబ్బందిని రంగంలో దింపాల్సి ఉంది.

ఒకవేళ కాంట్రాక్టు ప్రాతిపదికన సిబ్బందిని నియమించుకున్నా,  ప్రతి డిపో అవసరాలను అర్థం చేసుకోవడం వారికి సాధ్యం కాకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. 

ఏదేమైనా ఆర్టీసీ సమ్మెను కేసీఆర్ తన పరుపు ప్రతిష్టలకు సంబంధించన విషయంగా తీసుకోవడమే ప్రస్తుత సంక్షోభానికి కారణం. ఆర్టీసీ సిబ్బంది డిమాండ్లకు తాను తలొగ్గినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు, తదితరులపై తనకు నియంత్రణ లేకపోవచ్చని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక చోట వెనక్కు తగ్గితే అందరూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తారని కేసీఆర్ భావన. కానీ దీర్ఘకాలంలో చూస్తే కేసీఆర్ భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుందని విశ్లేషకుల భావన.

ఉద్యోగులను ఇబ్బంది పెట్టిన, వేధింపులకు గురి చేసిన, ప్రతీకార చర్యలు చేపట్టిన ప్రభుత్వాధినేతలు ఎవరూ బతికిబట్టకట్టిన చరిత్ర లేదు. ఎన్టీరామారావు, జయలలిత, చంద్రబాబు పరాజయ చరిత్ర దీన్ని స్పష్టంగా నిరూపిస్తోంది. 50 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను, వారి కుటుంబాలను దెబ్బతీసి కేసీఆర్ హుజూర్ నగర్‌ ఎన్నికల్లో ఎలా గెలుపు సాధిస్తారని రాజకీయ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle