newssting
BITING NEWS :
*అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటన.. ఘనంగా స్వాగతం..సబర్మతి ఆశ్రమంలో మహాత్మాగాంధీ వినియోగించిన చరఖా తిప్పిన ట్రంప్ పంపతులు *సబర్మతి ఆశ్రమంలో ట్రంప్ దంపతులు... గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ట్రంప్, మోడీ *నేడు విజయనగరం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. జగనన్న వసతి దీవేన కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం*సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు.. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల తనిఖీలు.. ప్లాట్ ఫామ్‌లతో పాటు రైళ్లలోనూ క్షుణ్ణంగా తనిఖీ, పేలుడు పదార్థాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన

సమ్మెను ఎదుర్కొనేందుకు సన్నద్ధం.. మంత్రి పువ్వాడ పక్కాప్లాన్

16-10-201916-10-2019 09:01:48 IST
Updated On 16-10-2019 17:26:26 ISTUpdated On 16-10-20192019-10-16T03:31:48.622Z16-10-2019 2019-10-16T03:30:37.020Z - 2019-10-16T11:56:26.781Z - 16-10-2019

సమ్మెను ఎదుర్కొనేందుకు సన్నద్ధం.. మంత్రి పువ్వాడ పక్కాప్లాన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్టీసీ సమ్మె అతలాకుతలం చేస్తోంది. ప్రజారవాణా వ్యవస్థ పడకేసింది. హైకోర్టు సైతం సమ్మెపై తీవ్రంగా స్పందించింది. ఈ నేపథ్యంలో మంత్రి పువ్వాడ అధికారులకు స్పష్టమయిన ఆదేశాలు జారీచేశారు.

ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ, ఆర్టీసీకి చెందిన అద్దెబస్సులను అన్నింటినీ నడపాలని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ పరిధిలోని గరుడ, రాజధాని ఏసీ బస్సులు మినహా ప్రతి బస్సు నిర్దేశించిన రూట్లలో నడవాల్సిందే అని స్పష్టం చేశారు.

ఖైరతాబాద్‌లోని ట్రాన్స్‌పోర్ట్ భవన్ నుంచి ఆర్టీసీ రీజినల్ మేనేజర్లతో మంత్రి పువ్వాడ మంగళవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి డిపో నుంచి వెళ్తున్న బస్సుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మంగళవారం 60శాతం ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి.

వివిధ జిల్లాల పరిధిలో అత్యధికంగా 80శాతం వరకు కూడా బస్సులు నడిపినట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 60 శాతం బస్సులు నడిచాయని, ప్రయాణికుల ఇబ్బందులు చాలామటుకు పరిష్కారం అవుతున్నాయని మంత్రి చెబుతున్నారు. 

హైదరాబాద్ లో అనేక ప్రాంతాల్లో బస్సుల సంఖ్య బాగా పెరిగింది. అందుబాటులో ఉన్న శిక్షణ పొందినవారిని డ్రైవర్లుగా నియమించి బస్సులు నడిపేందుకు ప్రయత్నించాలని మంత్రి కోరారు. ప్రతి డిపో నుంచి ఎక్కువ బస్సులు ఆయా రూట్లలో బయటకు తీయాలని సూచించారు.

రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు, ఆర్టీసీ అద్దె బస్సుల్లో బుధవారం నుంచి టికెట్లు జారీచేయాలని మంత్రి పువ్వాడ ఆర్‌ఎంలకు సూచించారు. టికెట్ మిషన్లు ఇవ్వాలని, ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్లు షెడ్యూల్ ప్రకారం బస్‌డిపోలకు వెళ్లి కండక్టర్లను తీసుకునివెళ్లాలని ఆదేశించారు. గ్రామాలకు కూడా గతంలో ఉన్న షెడ్యూల్‌ను తిరిగి సిద్ధం చేసి, బస్సులు నడపాలని చెప్పారు. 

మరోవైపు  ఆర్టీసీ సమ్మె ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు మధ్య పోరాటంగా మారుతున్నట్లు కనిపించింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి చేసిన వ్యాఖ్యలను పలు పార్టీలు ప్రస్తావిస్తున్నాయి. కెసీఆర్ కు వ్యతిరేకంగా సమ్మె కుంపటి రాజేసే ధైర్యం టిఆర్ఎస్ పార్టీలో ఎవరికుందన్న చర్చ మొదలైంది.

సమ్మె చేస్తున్న కార్మిక సంఘాల నేతలు.. ముఖ్యమంత్రిపై ఘాటుఘాటు విమర్శలు చేస్తున్నారు. ఏది ఏమైనా.. ఆర్టీసీ సమ్మె వెనుక వున్న అధికార పార్టీ నేతలు ఎవరున్నారో తేల్చాలని జనం కోరుతున్నారు. హైకోర్ట్ సమ్మె విరమించి విధుల్లోకి వెళ్ళాలని కార్మికులు సూచించడం.. ప్రభుత్వం చర్చలు జరపాలని ఆదేశించడంతో పరిణామాలు మారే అవకాశం కనిపిస్తోంది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle