newssting
BITING NEWS :
*కరోనా కట్టడిలో అన్ని వర్గాల కృషిని ప్రశంసించిన ప్రధాని మోడీ. మన్ కీ బాత్ లో పలు అంశాలను ప్రస్తావించిన మోడీ ఆత్మనిర్భర భారత్ ద్వారా ఆర్థికవ్యవస్థకు ఊతం *తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా 74, మరణాలు 77, మొత్తం కేసులు 2499 * జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం*మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 వ తేదీ నుంచి పునఃప్రారంభం..కర్ఫ్యూ సమయం కుదింపు..దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ*ఆదివారం మన్ కీ బాత్ లో పలు వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోడీ * మాల్స్, రెస్టారెంట్ల, దేవాలయాలు, చర్చిలు జూన్ 8 నుంచి ప్రారంభం *పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు ప్రారంభంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం *విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం*నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామక ఉత్తర్వులు వెనక్కి *ఏపీలో మొత్తం కేసులు 3461

సముద్రం పాలయ్యే నీళ్లు సీమకు తరలిస్తే తప్పేంటి.. కేసీఆర్ ప్రశ్న

19-05-202019-05-2020 15:54:28 IST
Updated On 19-05-2020 17:22:19 ISTUpdated On 19-05-20202020-05-19T10:24:28.352Z19-05-2020 2020-05-19T10:24:24.634Z - 2020-05-19T11:52:19.754Z - 19-05-2020

సముద్రం పాలయ్యే నీళ్లు సీమకు తరలిస్తే తప్పేంటి.. కేసీఆర్ ప్రశ్న
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సముద్రం పాలయ్యే నీళ్లు సీమకు తరలించడంలో తప్పేం లేదని, రాయలసీమకు నీళ్లు ఎందుకు పోవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రశ్నించారు. తెలిసీ తెలియక మాట్లాడేవారి గురించి తాను పట్టించుకోనన్నారు. నీటి వాటాలకు సంబంధించి తనకు స్పష్టమైన అవగాహన ఉందని పేర్కొన్నారు. 

సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అందరికి మంచి జరగాలన్నదే మా ఆశ.  ప్రజల అవసరాల కోసం నీళ్లు తీసుకోవటంలో తప్పులేదు. బేసిన్‌లు లేవు.. భేషజాలు లేవు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు పొరుగు రాష్ట్రాలతో ఘర్షణ పడినా ఒక్క టీఎంసీ కూడా సాధించలేదు. ఘర్షణ వాతావరణం ఏ రాష్ట్రానికి అవసరం లేదు. మాకు రెండు నాల్కలు లేవు. గోదావరిలో మిగులు జలాలు ఎవరు వాడుకున్నా అభ్యంతరం లేద’’ని స్పష్టం చేశారు.

‘‘రాయలసీమకు గోదావరి జలాలను మళ్లించుకోవచ్చు. ఎవరు మిగులు జలాలు వాడుకోవాలన్నా గోదావరిలో నీళ్లు ఉన్నయ్‌. ఎవరు తీసుకెళ్లినా మాకు అభ్యంతరం లేదు’’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. కానీ కృష్ణా జలాల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగితే ఒక్క క్షణం కూడా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. 

‘‘బేసిన్లు లేవు... భేషజాలు లేవు.. బ్రహ్మాండంగా నీళ్లు వాడుకోండి... మేం వాడుకుంటాం.. మీరూ వాడుకోండి. ఇరురాష్ట్రాలకు సరిపోను ఇంకో 1,000 టీఎంసీలున్నాయి’’ అని ఏపీ ప్రభుత్వానికి చెప్పానని కేసీఆర్‌ తెలిపారు. పిచ్చి కొట్లాట అనవసరమని తెలిపామన్నారు. 

పైగా ఏపీ సీఎం జగన్‌తో తమకు ఎలాంటి వివాదాలు లేవని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. పోతిరెడ్డిపాడుపై రెండు రాష్ట్రాల్లో జలవివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ స్పందించారు. జగన్‌తో దోస్తీ ఎప్పటికీ ఉంటుందని చెప్పారు. ఇప్పటివరకూ అన్యోన్యంగా కలిసే ఉన్నామని, కలిసే ఉంటామని కేసీఆర్ స్పష్టం చేశారు. అదేసమయంలో తెలంగాణ ప్రయోజనాల విషయంలో వెనక్కి తగ్గేది లేదని చెప్పారు. జలాల పంపిణీపై మంచి మాట చెబుతామన్నారు. వింటే వింటారని.. లేకుంటే లేదని.. తమకొచ్చిన నష్టమేమీ లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. 

పోతిరెడ్డిపాడు వ్యవహారంలో చొరవ తీసుకోమని కేంద్రాన్ని కోరతారా.. అని ఓ విలేకరి అడగబోగా.. ‘నీకేదో కిరికిరి, పంచాయతీ పెట్టాలని కోరిక ఉన్నట్లుంది.. అదేం జరగదు. మీదారిన మీరు ఉండమని ఏపీకి చెబుతున్నం. ఉంటే మంచిమాట. లేదు.. కొట్లాటంటే కొట్లాట’ అని కేసీఆర్‌ ఫైనల్‌గా బదులిచ్చారు.

తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లలోనే లాక్‌డౌన్ ... అక్కడ షరతులు వర్తిస్తాయ్!

తెలంగాణలో కంటైన్మెంట్ జోన్లలోనే లాక్‌డౌన్ ... అక్కడ షరతులు వర్తిస్తాయ్!

   7 hours ago


తెలంగాణలో కరోనా విజృంభణ.. ఒకేరోజు 6 గురు మృతి!

తెలంగాణలో కరోనా విజృంభణ.. ఒకేరోజు 6 గురు మృతి!

   12 hours ago


భక్తులకు శుభవార్త.. జూన్ 8 నుంచి తిరుమలలో దర్శనాలు

భక్తులకు శుభవార్త.. జూన్ 8 నుంచి తిరుమలలో దర్శనాలు

   15 hours ago


మోడీ మన్ కీ బాత్.. కరోనాపై యుద్ధానికి కొత్త దారులు వెతుకుదాం

మోడీ మన్ కీ బాత్.. కరోనాపై యుద్ధానికి కొత్త దారులు వెతుకుదాం

   15 hours ago


నిమ్మగడ్డ  ఎపిసోడ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు

నిమ్మగడ్డ ఎపిసోడ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు

   16 hours ago


మోడీ సరే.. మరి తెలంగాణ సీఎం వైఖరేంటో?

మోడీ సరే.. మరి తెలంగాణ సీఎం వైఖరేంటో?

   17 hours ago


యడ్డీ మెడపై రెబెల్స్ కత్తి.. వణుకుతున్న బీజేపీ

యడ్డీ మెడపై రెబెల్స్ కత్తి.. వణుకుతున్న బీజేపీ

   18 hours ago


‘‘ఓ తల్లి ఉసురు మీకు తగలక మానదు’’

‘‘ఓ తల్లి ఉసురు మీకు తగలక మానదు’’

   18 hours ago


తండ్రిని మించిన ఫైర్‌బ్రాండ్‌.. తెర‌పైకి జ‌యారెడ్డి

తండ్రిని మించిన ఫైర్‌బ్రాండ్‌.. తెర‌పైకి జ‌యారెడ్డి

   18 hours ago


డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ ఏం తేల్చబోతోంది?

డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ ఏం తేల్చబోతోంది?

   30-05-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle