newssting
BITING NEWS :
*గుజరాత్‌: సూరత్‌లో దారుణం.. కార్పొరేషన్ ట్రైనీ ఉద్యోగినులను గుంపులో నగ్నంగా నిలబెట్టి ఫిట్‌నెస్ పరీక్ష *నేడు తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... ఈ నెల 25న డైరెక్టర్ పదవులకు నామినేషన్లు, 29న ఛైర్మన్, ఉపాధ్యక్ష ఎన్నికలు *అమరావతి: వైఎస్ జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు.. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్ *హైదరాబాద్: బంజారాహిల్స్ లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. విదేశీయుల హల్చల్, పోలీసులతో వాగ్వాదం.. పాస్ పోర్టు, వీసా పత్రాలు చూపకపోవడంతో పోలీసులకు అప్పగింత *అమరావతి: నేడు 29 గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చిన రైతుల జేఏసీ.. మందడంలో పోలీసుల లాఠీఛార్జ్‌కి నిరసనగా బంద్, విద్యా, వ్యాపార సంస్థలను బంద్‌ పాటించాలని కోరిన జేఏసీ

సమాచార హక్కు చట్టం కమిషనర్లు వీరే... సర్కార్ ఉత్తర్వులు

11-02-202011-02-2020 08:44:52 IST
2020-02-11T03:14:52.558Z11-02-2020 2020-02-11T03:14:35.558Z - - 22-02-2020

సమాచార హక్కు చట్టం కమిషనర్లు వీరే... సర్కార్ ఉత్తర్వులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎట్టకేలకు సమాచార హక్కు చట్టానికి కమిషనర్ల నియామకం పూర్తయింది. సుదీర్ఘ మంతనాల అనంతరం కేసీయార్ ఐదుగురు సమాచార హక్కు చట్టం కమిషనర్లను నియమిస్తూ ఉత్తర్వులు వెలువరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమాచార హక్కు చట్టం కమిషనర్లను సోమవారం నియమించింది. అంతా భావించినట్టుగానే తనకు అనుకూలురైన వ్యక్తులకు పట్టం కట్టారు.

నమస్తే తెలంగాణ దినపత్రిక ఎడిటర్‌ కట్టా శేఖర్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ లీడర్ గుగులోతు శంకర్‌ నాయక్‌, టీన్యూస్‌ సీఈఓ ఎం నారాయణ రెడ్డి, న్యాయవాదులు సయ్యద్‌ ఖలీలుల్లా, మహ్మద్‌ అమీర్‌‌లను నియమిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్‌గా రాజా సదారాం, సభ్యుడిగా బుద్ధా మురళి ఇప్పటికే కొనసాగుతున్నారు. వీరితో పాటు మరో ఐదుగురిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.

ఆర్టీఐ కమిషనర్‌ పోస్టు కోసం వచ్చిన దరఖాస్తులను కమిటీ పరిశీలించింది. దరఖాస్తులు చేసుకున్న వారిలో నుంచి ఐదుగురిని ఎంపిక చేశారు. ఈ ఐదుగురి పేర్లతో జాబితాను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆమోదం కోసం పంపారు. ఆమె ఆమోదం తెలపడంతో ప్రక్రియ ముగిసింది. 

నమస్తే తెలంగాణ మాజీ ఎడిటర్‌ కట్టా శేఖర్‌రెడ్డి, టీన్యూస్‌ సీఈవో నారాయణరెడ్డి పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. వీరితోపాటు సయ్యద్‌ ఖలీలుల్లా, అమీర్‌, గుగులోత్‌ శంకర్‌నాయక్‌లకు కూడా ఆర్టీఐ కమిషనర్లుగా అవకాశం ఇచ్చారు. వీరిలో ఇద్దరు సీనియర్ పాత్రికేయులు వుండడం విశేషం. 

కట్టా శేఖర్‌ రెడ్డి: 2014 నుంచి ఈయన నమస్తే తెలంగాణ దినపత్రికకు ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. అంతకుముందు అంటే 2010 నుంచి 2014 వరకు నమస్తే తెలంగాణకు సీఈవోగా పని చేశారు. ఈయన నల్గొండ ప్రాంతానికి చెందినవారు.మంత్రి జగదీష్ రెడ్డికి ఈయన బంధువు. ఆంధ్రజ్యోతిలో సుదీర్ఘకాలం పనిచేశారు. ఆంధ్రజ్యోతి జర్నలిజం కాలేజీ ప్రిన్సిపాల్ గా ఎంతోమంది విద్యార్ధులకు జర్నలిజం పాఠాలు చెప్పారు. కేసీయార్ కు ఈయన అత్యంత సన్నిహితులు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. తాజా పరిణామాలను ఆయన ఎప్పటికప్పుడు నమస్తే తెలంగాణ ద్వారా పాఠకులకు అందించారు. 

ఎం నారాయణ రెడ్డి: మైడ నారాయణ రెడ్డి 2009 నుంచి టీ న్యూస్‌ ఎడిటర్‌, సీఈవోగా విధులు నిర్వహిస్తున్నారు. 1995లో వార్త పత్రికలో సబ్‌ ఎడిటర్‌గా తన కెరీర్ ని ప్రారంభించి ఆంధ్రజ్యోతి, సాక్షి, హెచ్‌ఎంటీవీలలో చేశారు. 2014 నుంచి 2019 వరకు ప్రెస్‌ అకాడమీ కమిటీ మెంటార్‌గా వ్యవహరించారు. ఈయన సిద్ధిపేట ప్రాంతవాసి. 

ఎండీ అమీర్‌: ఈయన వృత్తి రీత్యా న్యాయవాది .. ఫ్రీ మెడికల్‌ క్యాంపులు, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. పిల్లల హక్కులు, బాల కార్మిక వ్యవస్థ, విడాకులు పొందిన పేద మహిళల తరపున ఎంజీవోలతో కలిసి చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు. ఈయన హైదరాబాద్‌ ప్రాంతనికి చెందినవారు.

సయ్యద్‌ ఖలీలుల్లా : ఈయన 1990లో గుల్బర్గా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా తీసుకున్నారు. సిటీ క్రిమినల్‌ కోర్టులో లాయర్‌గా పనిచేశారు. ఈయన హైదరాబాద్‌ ప్రాంతానికి చెందినవారు. 

గుగులోతు శంకర్‌ నాయక్‌: ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీజీ, బీఈడీ చేశారు. గిరిజన విద్యార్థి సంఘం స్టేట్‌ ఫౌండర్‌ ప్రెసిడెంట్‌గా, తెలంగాణ స్టూడెంట్‌ జేఏసీ, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకుడిగా పని చేశారు... ఈయన మహబూబాబాద్‌ ప్రాంతానికి చెందినవారు. 

ప్రస్తుతం సమాచార హక్కు చట్టం కమిషనర్ గా మాజీ పాత్రికేయులు బుద్దా మురళి వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి సమాచార హక్కు కమిషనర్లుగా ముగ్గురు పాత్రికేయులు వ్యవహరిస్తున్నారు. దీంతో కమిషనర్ మరింత సమర్ధంగా పనిచేయడం ఖాయం అంటున్నారు. మైనారిటీ నేతలకు సమాచార కమిషన్ లో చోటు కల్పించడంలో ఎంఐఎం నేతలు తమవంతు కృషిచేశారు. 

ఆర్టీఐ కమిషనర్లు వీరేనా? గవర్నర్ చెంతకు లిస్ట్

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   6 hours ago


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   6 hours ago


మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

   7 hours ago


బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

   8 hours ago


రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

   9 hours ago


రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

   9 hours ago


ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

   11 hours ago


మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

   12 hours ago


పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

   12 hours ago


కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

   13 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle