newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సమాంతర నిఘా లేకుంటే కొత్త చట్టానికీ తూట్లు తప్పవు!

12-09-202012-09-2020 14:48:07 IST
2020-09-12T09:18:07.188Z12-09-2020 2020-09-12T09:18:05.068Z - - 20-04-2021

సమాంతర నిఘా లేకుంటే కొత్త చట్టానికీ తూట్లు తప్పవు!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భూ అక్రమాలు, కబ్జాలు, అవినీతి, అవకతవకలకు చరమగీతం అంటూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తీసుకువచ్చిన కొత్త రెవెన్యూ చట్టం నుంచి దాదాపు అన్ని వర్గాల వారి నుంచీ హర్ష్యామోదాలు వ్యక్తం అవుతున్నాయి. అదే సమయంలో భూ పంచాయతీల విషయంలో పలు సందేహాలు, అనుమానాలూ ముప్పిరిగొంటున్నాయి.

ఎందుకంటే భూ రికార్డుల ప్రక్షాళన అనంతరం కూడా పెద్ద ఎత్తున భూ వివాదాలు వెలుగులోనికి వచ్చాయి. వివాదాల పరిష్కారం కోసం ప్రత్యేక ట్రైబ్యునళ్ల డిమాండూ వినిపించింది. ప్రక్షాళన అనంతరం భూ యాజమాన్య హక్కుల విషయంలో సమస్యలు పెద్దఎత్తున బయటకు వచ్చాయి. భూ లావాదేవీల సరళీకరణ, కంప్యూటరీకరణ అన్నది పారదర్శకంగా సాగేలా సమాంతరంగా నిఘా వ్యవస్థ పని చేయాలి.

గతంలో భూమి యజమానికి టైటిల్‌ డీడ్‌, వారు సాగు చేస్తున్న విస్తీర్ణానికి పాసుపుస్తకం ఇచ్చేవారు. ఇప్పుడు ఆ రెండిటినీ కలిపి కేవలం 'టైటిల్‌ డీడ్‌ కమ్‌ పాసు పుస్తకం'గా మార్పు చేశారు. ఇక నుంచి భూమికి ఒకరే హక్కుదారు. ఈ సంస్కరణను విప్లవాత్మకంగానే పరిగణించాల్సి ఉంటుంది తెలంగాణ భూమి హక్కులు, పాసుపుస్తకాల బిల్లు – విషయంలో అన్ని విధాలుగా తార్కికంగా ఆలోచించి సమస్యలు రాకుండా ఉండే విధంగా రూపొందించినట్లు కనిపిస్తున్నది.

అయితే  రిజిస్టే షన్‌, పట్టా జారీ అధికారాలను తహశీల్దారు చేతిలో పెట్టడం, రెవెన్యూ కోర్టుల స్థానంలో టైబ్యునళ్లను ఏర్పాటు చేయడం, భూమి రికార్డులను ఎలక్టా నిక్ రూపంలో నవెూదు చేయడానికి, భద్రపరచడానికి, మార్పులు చేయడానికి, జారీ చేయడానికి చట్టబద్ధత కల్పించడం, టైటిల్‌ డీడ్‌ పట్టా పాసుపుస్తకం జారీ పక్రియ సమయాన్ని తగ్గించడం వంటివి సానుకూల మార్పులుగా భావించాల్సి ఉంటుంది. 

అయితే  రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తన సంకల్పాన్ని ప్రకటించినా అది అనుకున్న ఫలితం సాధించలేదనడానికి ఆ తరువాత తెరపైకి వచ్చిన తగాదాలే నిదర్శనం. వాస్తవంగా చెప్పాలంటే  రికార్డుల ప్రక్షాళన జరిగిన తరువాతే అవినీతి మరింత పెచ్చరిల్లింది. పాసుపుస్తకాల జారీ అధికారంతోనే తహశీల్దార్లు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తుండగా, ఇప్పుడు రిజిస్టే షన్‌ అధికారం కూడా వారికే కట్టబెట్టడం వల్ల అవినీతి మరింత పెరుగుతుందన్న విపక్షాల సందేహాలు పూర్తిగా కొట్టిపారేయలేం. 

సామాన్యులు రోజువారీగా తమ భూమి ఉందో లేదో కంప్యూటర్లలో, స్మార్ట్‌ఫోన్లలో తనిఖీ చేసుకోరు. కేవలం భూమి సాగు చేసుకుంటూ ఉంటారు. కాని వాళ్ల భూమికి కంప్యూటర్లలోనే రెక్కలు వచ్చి ఎగిరిపోతే సర్కార్‌ సంకల్పం నెరవేరదు. తమ భూమి తమది కాదన్న విషయం వాళ్లకు తెలిసేసరికి వేరేవారి పేరు విూద పట్టాలు లేకపోగా వివాదాలతో మళ్లీ కోర్టు గడపలు తొక్కాల్సి వస్తుంది. ఇంక వాటిని అధిగమించి తమ భూమిని కాపాడుకోవడం వాళ్లకు ఒక జీవన్మరణ పోరాటమే అవుతుంది. అందుకే కొత్త చట్టం పకడ్బందీగా అమలు కావాలంటే...పటిష్టంగా సమాంతర నిఘా ఉండాలి. సీఎం ఆ దిశగా ఆలోచన చేయాలి.

 

 

ఏపీలో స్కూల్స్ బంద్

ఏపీలో స్కూల్స్ బంద్

   13 hours ago


వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

   13 hours ago


జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   17 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   19 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   14 hours ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   21 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   21 hours ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   14 hours ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   15 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   21 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle