newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సమగ్ర చర్చతోనే కొత్త చట్టానికి పదును..

11-09-202011-09-2020 06:45:18 IST
2020-09-11T01:15:18.464Z11-09-2020 2020-09-11T01:15:15.916Z - - 23-04-2021

సమగ్ర చర్చతోనే కొత్త చట్టానికి పదును..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం అందరికీ భరోసా దక్కుతుందని సిఎం చేసిన ప్రకకటన మేరకు కొత్త చట్టం రాబోతున్నది. దీనిపై రేపు అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. ఈ దశలో కొత్త చట్టంపై సమగ్ర చర్చ జరగాలి. అందులో లోటుపాట్లను చర్చించేందుకు సభలో అవకాశం ఇవ్వాలి. లోపాలను సవరించుకునే అవకాశం ఉండాలి. ప్రభుత్వం సభలో సమగ్ర చర్చ జరిగేందుకు అవకాశం ఇచ్చిందన్న విశ్వాసం ప్రజలలో కలగాలి.

అయితే పెండింగు కేసుల కోసం ఏర్పాటు చేసే ట్రిబ్యునళ్లు పర్మినెంట్‌ చేయాల్సిన అవసరం ఉంది. ట్రిబ్యునల్‌కు వెళ్ళిన పేదవారికి ఉచితంగా న్యాయసహాయం అందించే వెసలుబాటు ఉండాలి. వ్యవసాయ భూమైనా, వ్యవసాయేతర భూమైనా ప్రజల చేతుల్లోకి వచ్చే పట్టాకు ప్రభుత్వమే బాధ్యత వహించేలా చట్టంలో ప్రొవిజన్ ఉండాలి. పాస్‌పోర్టు కోసం స్లాట్‌ బుక్ చేసుకున్నట్టుగానే ప్రజలకు వీలైన స్లాట్‌ బుక్ చేసుకుని వెళ్ళి రిజిస్టే షన్‌ చేసుకొనే సదుపాయం కొత్త చట్టంలో కల్పించడం మంచి పరిణామం.

ఆర్వోఆర్‌ చట్టం కింద ఉన్న వివాదాలు, తప్పులను సరిదిద్దడమనే అధికారాలను రెవెన్యూ అధికారుల నుంచి తొలగించి ఆ కేసులన్నింటినీ ట్రిబ్యునళ్లకు అప్పగించడం వల్ల నిర్ణీత సమయంలో కేసులు పరిష్కారమవుతాయన్న భరోసా వచ్చింది. మొత్తంగా కొత్త చట్టం ప్రకారం రాష్ట్రంలో భూ సమస్యలన్నింటికీ పరిష్కారంగా ధరణి పోర్టల్‌ పనిచేస్తుంది. ఇదే దశలో ధరణి పోర్టల్‌ పూర్తి పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. అన్నింటికీ మూలం ఇదే అనుకున్నప్పుడు సాంకేతికంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. బ్యాకప్‌ మెకానిజం, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నాలజీలో ఉండాలి.

ఇది మన రాష్ట్ర మొత్తం భూభాగం అనే విధంగా ధరణి పోర్టల్ లో పటిష్టం చేస్తే అంతకన్నా అదృష్టం ఉండదు. ప్రభుత్వ భూములు, గ్రామకంఠం అని క్యాటగిరీలు ఉంటాయి. పట్టణాల కింద ఉండే భూమి, పబ్లిక యుటిలిటీస్‌ పేరిట భూమి అనేక రూపాల్లో ఉంటుంది. మొత్తం విూద ఒకటి వ్యవసాయ భూమి, రెండు అటవీ భూమి, మూడు వ్యవసాయేతర భూమిగా మొత్తం భూమి ధరణిలో ఉండటం ద్వారా అక్రమాలు, ఆక్రమణలకు చెక్ పడుతుందన్న విశ్వాసం కలుగుతోంది. అయితే విపక్షాల సూచనలను పరిగణనలోనికి తీసుకునే విధంగా సభలో సమగ్ర చర్చకు అవకాశం ఉంటేనే సార్థకత ఉంటుంది.

కోవిడ్  వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

   3 hours ago


మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

   4 hours ago


ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు

ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు

   an hour ago


గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

   4 hours ago


ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

   5 hours ago


క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

   6 hours ago


క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

   6 hours ago


 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   a day ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   22-04-2021


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   22-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle