newssting
BITING NEWS :
*అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటన.. ఘనంగా స్వాగతం..సబర్మతి ఆశ్రమంలో మహాత్మాగాంధీ వినియోగించిన చరఖా తిప్పిన ట్రంప్ పంపతులు *సబర్మతి ఆశ్రమంలో ట్రంప్ దంపతులు... గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ట్రంప్, మోడీ *నేడు విజయనగరం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. జగనన్న వసతి దీవేన కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం*సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు.. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల తనిఖీలు.. ప్లాట్ ఫామ్‌లతో పాటు రైళ్లలోనూ క్షుణ్ణంగా తనిఖీ, పేలుడు పదార్థాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన

సత్తా చాటిన సైదిరెడ్డి..రౌండ్ రౌండ్ కి పెరిగిన మెజారిటీ

24-10-201924-10-2019 12:40:20 IST
Updated On 24-10-2019 14:09:17 ISTUpdated On 24-10-20192019-10-24T07:10:20.051Z24-10-2019 2019-10-24T07:10:15.982Z - 2019-10-24T08:39:17.003Z - 24-10-2019

సత్తా చాటిన సైదిరెడ్డి..రౌండ్ రౌండ్ కి పెరిగిన మెజారిటీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఓటమి నుంచి విజయం అందుకుని హుషారుగా ఉన్నారు టీఆర్ఎస్ నేత, హుజూర్ నగర్ అభ్యర్ధి సైదిరెడ్డి. ఉప ఎన్నిక ప్రకటన నుంచి ఫలితాల వరకూ ఆయన విజయం ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ఎదురైన పరాజయం పరాభవం నుంచి తేరుకున్నారు. అంది వచ్చిన ఉప ఎన్నిక అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకున్నారు. 

హుజుర్‌నగర్‌ ఉప ఎన్నికల ఫలితాల్లో సత్తా చాటుతుందని భావించిన కాంగ్రెస్‌ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. ప్రతి రౌండ్‌లోనూ టీఆర్‌ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డి ముందంజలో కొనసాగారు. . శానంపూడి సైదిరెడ్డికి తొలి రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ 2,467 ఓట్లు, రెండో రౌండ్‌లో 4 వేల మెజార్టీతో, మూడో రౌండ్‌లో 6,777 ఓట్లు, నాలుగో రౌండ్‌లో 9,356, ఐదో రౌండ్‌లో 11 వేలు, ఆరో రౌండ్‌లో 12,356, ఏడో రౌండ్‌లో 14,300, ఎనిమిదో రౌండ్‌లో 17,400, తొమ్మిదో రౌండ్‌లో 19,200 ఓట్ల మెజార్టీ లభించింది.

పదో రౌండ్‌ పూర్తయ్యేసరికి టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి 20,100 ఓట్ల మెజార్టీ సాధించారు. 11వ రౌండ్ లో 21,618 ఓట్లు, 12 వ రౌండ్ లో 23,821 ఓట్ల మెజారిటీ సాధించారు. 13వ రౌండ్ లో 25366 ఓట్ల మెజారిటీ లభించింది. 14వ రౌండ్ లో సైదిరెడ్డికి 27,353 ఓట్ల మెజారిటీ వచ్చింది. బీజేపీ, టీడీపీలు అయితే చతికిలపడిపోయాయి. కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయాయి. ఈ ఎన్నికల్లో తాము నాలుగైదు వేలు ఓట్లు సాధిస్తామని అటు బీజేపీ, టీడీపీ ధీమా వ్యక్తం చేశాయి. కానీ చివరాఖరికి ఆ రెండు పార్టీలకు ఘోర పరాభవం తప్పలేదు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle