newssting
Radio
BITING NEWS :
హైదరాబాద్ వాసులను వెంటాడుతున్న వరద భయం. రానున్న మూడ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఏ క్షణాన వరద ముంచెత్తుతుందోనని కంటిమీద కునుకులేకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న లోతట్టు ప్రాంతాల ప్రజలు. * హైదరాబాద్ ను ఆదుకునేందుకు కదిలిన టాలీవుడ్ తారాగణం. సీఎం రిలీఫ్ ఫండ్ కు చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేష్ కోటి రూపాయల విరాళం. చెరో 50 లక్షలు ఇచ్చిన ఎన్టీఆర్, రామ్ చరణ్. * విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా పోలీస్ సంస్మరణ దినోత్సవ వేడుకలు. కరోనాతో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం వైసీపీనే అన్న మంత్రి సుచరిత. * ఏపీ - తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఇంకా కుదరని ఆర్టీసీ ఒప్పందం. ప్రభుత్వాల మొండి వైఖరితో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. ఆర్టీసీ అలసత్వాన్ని క్యాష్ చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్. ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచిన ప్రైవేట్ బస్సులు. ప్రతి ఏటా ఆర్టీసీకి లాభాలు తెచ్చిపెడుతున్న దసరా. * స్కందమాతగా దర్శనమిస్తోన్న బాసర సరస్వతీ దేవి. * పూర్తిగా నిండిన గండిపేట చెరువు. ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తి నీరు విడుదల చేసే అవకాశం. లోతట్టుప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు.

సడలింపు కాదు.. రాత్రిపూట కర్ప్యూ కూడా అమలు చేస్తాం.. తే్ల్చిచెప్పిన కేసీఆర్

19-04-202019-04-2020 08:38:10 IST
Updated On 19-04-2020 10:00:30 ISTUpdated On 19-04-20202020-04-19T03:08:10.522Z19-04-2020 2020-04-19T03:08:08.443Z - 2020-04-19T04:30:30.802Z - 19-04-2020

సడలింపు కాదు.. రాత్రిపూట కర్ప్యూ కూడా అమలు చేస్తాం.. తే్ల్చిచెప్పిన కేసీఆర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మే 3 దాకా రాష్ట్రంలో లాక్ డౌన్‌ను అత్యంత కఠినంగా అమలు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చి చెప్పారు. అటు దేశంలో, ఇటు రాష్ట్రంలో కరోనా  వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టే సూచనలు కలికానిక్కూడా కనిపించకపోవడంతో ఏప్రిల్ 20నుంచి దశలవారీగా లాక్ డౌన్‌ని సడలిస్తామని గతంలో చేసిన ప్రకటనకు ముఖ్యమంతి పూర్తిగా మంగళం పలకనున్నారని సమాచారం. హైదరాబాద్‌లో ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదవుతుండటం, కంటైన్మెంట్లలో కూడా పరిస్థితి ఆశాజనకంగా కనిపించకపోవడంతో ఉదారంగా వ్యవహరిస్తే కొంపలంటుకుపోవడం ఖాయమని సీఎం కేసీఆర్ స్థిరనిర్ణయానికి వచ్చేశారు. 

లాక్‌డౌన్‌ను మే 3 దాకా ఇదివరకటి మాదిరే పకడ్బందీగా కొనసాగించాలని సర్కారు నిర్ణయించింది. వచ్చే నెల 3వ తేదీ వరకు దేశవ్యాప్త లాక్‌డౌన్‌లో భాగంగా ‘కంటైన్మెంట్‌’లో లేని ప్రాంతాలకు సోమవారం నుంచి పలు మినహాయింపులు ఇస్తూ కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల నమోదు తగ్గకపోవటం, లాక్‌డౌన్‌కు సడలింపు ఇస్తే వైరస్‌ వ్యాప్తి నియంత్రణ సాధ్యంకాదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్రం ప్రకటనతో మినహాయింపు పొందే పలు రంగాలు ఒకదానితో మరొకటి ముడిపడి ఉండటం, దాని వల్ల జనం గుమికూడటాన్ని అడ్డుకోలేమనే ఉద్దేశంతోనే ముందుగా నిర్ణయించిన ప్రకారం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను ఈ నెలాఖరు దాకా పకడ్బందీగా అమలు చేయాలనే అభిప్రాయానికి వచ్చింది.

ఈ క్రమంలోనే ఆదివారం మధ్యాహ్నం 230 గంటలకు ఇక్కడ ప్రగతి భవన్‌లో జరిగే కేబినెట్‌ భేటీలో సీఎం కేసీఆర్‌, కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్‌డౌన్‌ అమలు తదితర అంశాలపై మంత్రివర్గ సహచరులతో విస్తృతంగా చర్చించనున్నారు. ప్రధానంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, నిధుల సమీకరణ, పొరుగు రాష్ట్రాల్లో ఒకవేళ లాక్‌డౌన్‌ను సడలిస్తే ఎదురయ్యే సవాళ్లను అధిగమించటంపైనా కేబినెట్‌ దృష్టి సారించనుంది. పంట ఉత్పత్తుల కొనుగోళ్లు, వలస కూలీలకు సంబంధించిన శిబిరాల నిర్వహణకు సంబంధించి మరింత మెరుగైన కార్యాచరణ రూపొందించనుంది.  

అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని, ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దని కేసీఆర్ హెచ్చరించారు. హైదరాబాద్‌లో అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించాలని, కంటైన్మెంట్ల నుంచి ఎవరినీ ఎట్టి పరిస్థితుల్లో బయటకు రానీయొద్దని, రాష్ట్రంలో కరోనా వైరస్‌ సోకినవారు నివసిస్తున్న ఇతర ప్రాంతాల్లో కూడా అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

కాగా, వైరస్‌ సోకినవారి ద్వారా ఇంకా ఎవరికి సోకవచ్చు అనే విషయాలను కచ్చితంగా నిర్ధారించి పరీక్షలు జరపాలి. ఎంత మందికైనా పరీక్షలు జరపడానికి, ఎంత మందికైనా చికిత్స చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది’’అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. వైరస్‌ వ్యాప్తి నివారణ, రోగులకు అందుతున్న చికిత్స, లాక్‌డౌన్‌ అమలు తదితర అంశాలపై ప్రగతి భవన్‌లో శనివారం సీఎం సమీక్ష నిర్వహించారు. ఆదివారం జరిగే మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలను చర్చించారు. 

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి అమలు చేస్తున్న పద్ధతులను యథావిధిగా అమలు చేయాలని, అదేసమయంలో లాక్‌డౌన్‌ వల్ల ఏ ఒక్కరు ఆకలితో అలమటించే పరిస్థితి రాకుండా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. లాక్‌డౌన్‌ వల్ల పేదలకు ఎలాంటి ఇబ్బంది కలగవద్దు. అందుకే ప్రభుత్వం తెల్ల రేషన్‌ కార్డుదారులకు నగదు, బియ్యం ఉచితంగా పంపిణీ చేసింది. వలస కూలీలు, రోజువారీ కార్మికులు ఇంకా ఎవరైనా మిగిలినా సరే, వారిని గుర్తించి తగిన సహాయం అందించాలి. వ్యవసాయ కార్యక్రమాలు యథావిధిగా జరిగేట్లు చూడాలని సీఎం సూచించారు.

ఈ విషయాన్ని ఆదివారం మంత్రివర్గ సమావేశం తదుపరి సీఎం కేసీఆర్‌ అధికారికంగా ప్రకటించనున్నారు. కేబినెట్‌ భేటీకి సన్నాహకంగా ఆయన శనివారం రాత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై ఒక అంచనాకు వచ్చారు. రోజంతా లాక్‌డౌన్‌, రాత్రి వేళల్లో కర్ఫ్యూ ఆంక్షల వల్ల మన దగ్గర కరోనా వైరస్‌ వ్యాప్తి వేగంగా లేదని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ను సడలిస్తే, కరోనా పాజిటివ్‌ కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరిగి, పరిస్థితి చేయి దాటి పోతుందని ఆయన ఆందోళన చెందుతున్నారు. అందుకే ఎవరినీ ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రానీయవద్దని ఆదేశించారు. 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle